New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమలో పడితే – 4

ప్రేమలో పడితే – 4

ప్రేమలో పడితే -4

 

 

మేనేజర్ వెనకే వయసు పైబడిన పిఏ వస్తూ అమ్మాయిలు అందరూ మేనేజర్ వైపు చూస్తూ ఉండటం గమనించి “అయిపోయారు ఈరోజు అందరి పరిస్థితి ఏంటో’ అని మనసులో అనుకున్నారు. 

 

మేనేజర్ శ్రీరామ్ తను అందరికీ ఎదురుగా తన ప్లేస్ లో కూర్చొని నాలుగు టీమ్స్ ని చూశాడు.

 

అబ్బాయిలు భయంగా అమ్మో ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ లో ఏదైనా మిస్టేక్ ఉంటే తమ జాబు పోతుంది ఏమో అని భయంగా చూస్తుంటే, అమ్మాయిలు మాత్రం అసలు అవేమీ కేర్ చేయనట్లుగా తన వైపే చూస్తూ ఉండటం నచ్చని శ్రీరామ్ మేనేజర్ వైపు ఒక్క చూపు చూశాడు.

 

అంతే మేనేజర్ ఓకే సార్ అని అంటూ ఎదురుగా ఉన్న టేబుల్ మీద గట్టిగా తన చేతిలో ఉన్న ఫైల్ తో కొట్టాడు. అంతే అప్పటివరకు శ్రీరామ్ ని చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా డిస్ట్రబ్ అయినట్లుగా తన చూపులని పక్కకు తిప్పుకున్నారు.

కానీ మహాలక్ష్మి మాత్రం అతని వైపు అంతే చూస్తూ “మేనేజర్ స్ట్రిక్ట్ అది ఇది అని చెప్పారు కానీ ఇతనేంటే ఇంత హైట్ ఉన్నాడు, బాడీ కూడా సినిమాలో విలన్ కి ఉన్నట్లుగా కనిపిస్తుంది” అని పక్కన ఉన్న రమ్యతో అన్నది.

హీరో కానీ విలన్ తో పోల్చింది.

 

“చిన్నప్పటినుంచి Complan బూస్ట్ కలిపి తాగాడేమో అందుకే అలా ఉన్నాడేమో ఇప్పుడు అవన్నీ అవసరమా..?” అని అసహనంగా అన్నది రమ్య.. 

” ఏంటి ఆ సౌండ్..?” అని శ్రీరామ్ గట్టిగా అరిచాడు. 

 

అప్పటివరకు అతనిని చూసి అందంగా ఉన్నాడు అని ఊహించుకుంటూ ఉన్న అమ్మాయిలు అందరూ కూడా అతని బేస్ వాయిస్ కి భయపడిపోయారు.

 

“అబ్బా ఏంటి అంత గట్టిగా అరుస్తున్నాడు” అని మహాలక్ష్మి  చెవిలో వేలిని పెట్టుకుని అంటే,

‘చిన్నప్పుడు మైకులు మింగాడేమో అందుకే అలా అరుస్తున్నాడేమో నన్ను అడుగుతావేంటి..?” అని విసుక్కుంటూ అన్నది రమ్య.. 

 

“ఇక్కడ వరకు జరుగుతుంటే..? ఏంటి అక్కడ గుసగుసలు’ అని శ్రీరామ్ మహాలక్ష్మి రమ్య ఇద్దరు మాట్లాడుకోవటం గమనించి వాళ్ళిద్దరిని పాయింట్ అవుట్ చేసి మరీ అడిగాడు. 

 

మహాలక్ష్మి చాలా క్యాజువల్ గా పైకి లేచి “ఏమీ లేదు సార్ మీరు చాలా హైట్ ఉన్నారు కదా ఏంటి కారణం అని అడిగితే, 

తను చిన్నప్పుడు మీరు బూస్ట్ హార్లిక్స్ Complan కలిపి తాగారు అని చెప్తుంది. ఇంతకీ మీరు ఏం తాగారు సార్..? ఇంత హైట్ పెరగడానికి Complan, హార్లిక్స్..!” అని అమాయకంగా అడిగింది.

 

ఆ మాటలకి శ్రీరామ్ కి బాగా కోపం వచ్చి “వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావ్”  అని గట్టిగా బేస్ వాయిస్ తో అరిచాడు. 

 

” నిజమేనే నువ్వు చెప్పింది మైక్ మింగేసాడు చిన్నది కాదు పెద్ద మైక్ అందుకే సౌండ్ రి సౌండ్ వస్తుంది” అని అన్నది మహాలక్ష్మి.

 

గెట్ లాస్ట్ అని శ్రీరామ్ నోటి నుంచి బయటికి వస్తున్న సమయంలోనే గణేష్ “మే ఐ కమింగ్ సార్” అని అడిగాడు.. 

 

మహాలక్ష్మి మీద చూపించవలసిన కోపం ట్రాన్స్ఫర్ అయినట్లుగా గణేష్ వైపు తిరిగి “హూ ఆర్ యు” అని సీరియస్ గా అడిగాడు.. 

 

అది సార్ నేను అని చెప్తున్నప్పుడు పక్కన ఉన్న పిఏ “సార్ అతను ఈ ప్రాజెక్టు లీడ్ చేసిన మహాలక్ష్మి టీం లోని పర్సన్” అని చెప్పటంతో,

” టైం సెన్స్ లేదు గెట్ లాస్ట్” అని సీరియస్ గా అన్నాడు. 

 

“అది కాదు సార్, ఐ యాం సారీ లేట్ అయింది” అని గణేష్ చెప్తున్నా కూడా శ్రీరామ్ వినలేదు గెట్ లాస్ట్ అని చెప్పటంతో ఇక చేసేది ఏమీ లేక మహాలక్ష్మి వాళ్ళని చూస్తూనే గణేష్ బయటకు వెళ్లిపోయాడు.

 

“మహా గణేష్ ని లోపలికి రానివ్వలేదు, ఇప్పుడు మన ప్రాజెక్ట్ మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేము కదా” అని భయంగా అన్నది రమ్య. 

 

“ఆ మేనేజర్ బాడ్ లక్,  ఏం చేద్దాం వాడికి మన ప్రాజెక్ట్ పూర్తిగా విని సక్సెస్ చేసే అదృష్టం లేదు” అని చాలా క్యాజువల్ గా చెప్పేసింది మహా. 

 

ఒక్కొక్క టీం కూడా  వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని సబ్మిట్ చేసేసరికి గంట పైనే పడుతుంది మహాలక్ష్మి టీం వచ్చేసరికి మధ్యాహ్నం 12:00 దాటిపోయింది. అప్పటికే మహాలక్ష్మికి పొట్టలో ఎలుకలు పరిగెడుతున్నాయి 

 

నాలుగు టీమ్స్ కి ఇచ్చింది ఒకటే ప్రాజెక్ట్ ఎవరు ఎంత పర్ఫెక్ట్ గా చేస్తారు అనేది టాస్క్.

 

మహాలక్ష్మి టీం వంతు వచ్చింది, మహాలక్ష్మి ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది కానీ లాస్ట్ లో కొంత ఎక్స్ప్లైన్ చేయమంటే ‘సారీ సర్ లాస్ట్ పార్ట్ అంతా మా టీం మెంబర్ గణేష్ దగ్గర ఉంది. కానీ మీరు అతన్ని లోపలికి అలో చేయలేదు” అని సింపుల్ గా చెప్పేసింది ఏ మాత్రం అతడికి భయపడకుండా, 

 

“వాట్ ఏం మాట్లాడుతున్నావ్, ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు కంప్లీట్ గా తెలుసుకోవాల్సిన బాధ్యత టీం లీడర్ గా నీకు లేదా, మీ టీమ్ మెంబర్ కి టైమింగ్ కూడా తెలియదా..?” అని అప్పటివరకు స్పెడ్స్ పెట్టుకొని ఉన్నవాడు కాస్త స్పెట్స్ తీసి అసహనంగా అన్నాడు..

 

రెండు నిమిషాల పాటు అతని కళ్ళ వైపే చూస్తూ ఉంది మహా, కనీసం చూపు కూడా పక్కకు తిప్పుకోలేకపోయింది. ఇప్పటివరకు స్పెట్స్ పెట్టుకుని ఉండటంతో అతని కళ్ళల్లో ఉన్న పవర్ తనకి తెలియలేదేమో ఇప్పుడే తెలిసింది ఏమో అలా చూస్తూ ఉండిపోయింది. 

 

“హలో మిస్ ఎటు చూస్తున్నావ్..? వర్క్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వు” అని సీరియస్ గా అన్నాడు శ్రీరామ్.

 

“వర్క్ ఎక్స్ప్లనేషనే కదా సార్ ఇస్తాను, ఇంతకుముందు ఏదో అన్నారు. టైమింగ్ అని టైమింగ్ తెలుసు సార్ కానీ మీకే టైం సెన్స్ లేదు. ఏం చేద్దాం? అతను కరెక్ట్ టైం కి వచ్చాడు కానీ మీరే లోపలికి ఎలో చేయలేదు. మీరు స్ట్రెక్టుగా ఉంటారు అని చెప్తున్నారు కానీ అది స్ట్రిక్ట్ గా ఉండటం కాదు, మీ మాట అన్నట్లుగా ఆశిస్తున్నారు” అని అసహనంగా చెప్పి,

అప్పటికి కూడా బయట చైర్ లోనే కూర్చొని ఉన్న గణేష్ ని పిలిచి “టీం అన్నప్పుడు అందరూ కలిస్తేనే వర్క్ పర్ఫెక్ట్ గా వస్తుంది” అని గణేష్ ని లోపల రమ్య పక్కన కూర్చోమని చెప్పి ఆ తర్వాత మిగిలిన ప్రాజెక్ట్ మొత్తం తను ఎక్స్ప్లెయిన్ చేసింది.

 

ఫస్ట్ టైం తనని ఒక అమ్మాయి అలా ఎదిరించి మాట్లాడటం విని షాక్ లో ఉన్నాడో ఆశ్చర్యంతో ఉన్నాడో కానీ అలా సైలెంట్ గా ఉండిపోయాడు. కనీసం గణేష్ లోపలికి వస్తున్న ఆ తర్వాతది మహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయాడు.

 

అలా ఎక్స్ప్లెయిన్ చేయడం నాలుగు టీమ్స్ అయిపోయిన తర్వాత “మీరందరూ ఇక బయటికి వెళ్ళండి ఎవరిది సెలెక్ట్ అయింది అనేది రేపు అనౌన్స్ చేస్తాం” అని మేనేజర్ పిఏ చెప్పారు. 

 

శ్రీరామ్ వెళ్తున్న మహా వైపే కోపంగా చూస్తూ ఉన్నాడు. మహా కూడా అసలు పట్టించుకున్నట్లు కేర్ లెస్ గా శ్రీరామ్ వైపు ఒక చూపు చూసి బయటకు వెళ్ళిపోయింది..

 

“మహా నువ్వేంటే అలా మేనేజర్ ని ఎదిరించి మరీ మాట్లాడావ్, ఇప్పుడు నీ జాబ్ తీసేస్తే లేదంటే వేరే ఏదైనా పనిష్మెంట్ ఇస్తే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ సెలెక్ట్ కాకపోతే పరిస్థితి ఏంటి..?” అని గణేష్ భయంగా అడిగాడు. 

 

పక్కన ఉన్న రమ్య ఏదో జరగకూడదని జరుగుతుంది ఏమో అన్నట్లుగా భయంగా పేస్ పెట్టి బుగ్గ మీద వేలు పెట్టుకొని తెగ ఆలోచించుకుంటూ కనిపించింది. 

 

“ఏమి జరగదు మహా అయితే జాబ్ తీసేస్తారు అంతే కదా” అని మహా అంటున్నప్పుడే శ్రీరామ్ కరెక్టుగా ఆమె ముందు నుంచి వెళ్తూ ఆమె అన్న మాట విని ఒక సెకండ్ ఆగి, మహా వైపు చూసి ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. 

 

 

 

 

 

కొనసాగుతుంది