ఐ హేట్ యూ రావణ్ – 2
నిధి కోసం శృతి వెతుకుతూ వస్తు ఉంటే కంగారుగా కిందకి దిగుతున్న తనని చూసి ఓయ్ ఎక్కడికి మాయామయ్యావ్ అని అంటే నేను ఇక వెళ్తాను అన్నయ్య ఎదురుచూస్తూ ఉంటారు…
హలో నువ్వు వచ్చి కొంచం టైం కూడా అవ్వలేదు మా ఇంట్లో వాళ్ళకి నిన్ను పరిచయం చేస్తా ఉండు అని తనని కిందకి తీసుకువెళ్తుంది…
శృతి తో వస్తున్న నిధి నీ చూసి అభి వాళ్ల అమ్మ నానమ్మ ఎవరూ ఆ అమ్మాయి చాలా బావుంది కదా అని అనుకుంటారు…
ఆ మాట విన్న అభి మరదలు అను కోపంగా శృతి తో మెంట్లు దిగుతున్న నిధి వైపు చూస్తుంది…
అభి ఎప్పుడూ వచ్చాడో కాని నిధి నీ క్రాస్ చేస్తూ తన నడుము గిల్లి ఏమి తెలియని వాడిలా కింద కి వచ్చి సోఫా లో కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటాడు…
అభి వాలకం ఏంటో అర్ధం కాకా ఇక్కడ పాప కి భయం పెరిగిపోతుంది…
ఇక అతని ముందు ఉండలేక ప్లీజ్ శృతి ఇక నేను వెళ్తాను అన్నయ్య ఒక్కడే చూసుకోవాలి అంటే కష్టం అని అంటే వెయిట్ చెయ్ ఇక్కడే అని వాళ్ల అన్నయ్య దగ్గరకి వెళ్లి ప్లీజ్ అన్నయ్య తాను నా ఫ్రెండ్ శృతి అని అంటే
అను ఒక్కరోజులో ఫ్రెండ్ అయిందా లేక నువ్వు డబ్బు ఉన్న అమ్మాయి అని తెలిసి నీతో ఫ్రెండ్షిప్ చేస్తుందా అని అంటుంది…
ఆ మాట నిధి కి బాధ గా అనిపించి బయటకు వస్తుంది శృతి కి చెప్పకుండానే…
అలా బయటకి వెళ్తున్న తనని బాధ గా చూస్తూ తాను అందరిలా కాదు ఎవరూ ఎలాంటి వాళ్లు తెలుసుకోలేనంత చిన్న పిల్ల కాదు నేను…
అని వాళ్ల అమ్మ వైపు చూస్తూ తాను నిధి అమ్మ వాళ్ళకి ఎవ్వరు లేరు తాను వాళ్ల అన్నయ్య ఇద్దరే…
తన చదువు కోసమే వాళ్లు ఈ ఊరు వచ్చారు వాళ్ల అన్నయ్య ఇక్కడ కేఫ్ పెట్టాడు…
ఇద్దరు అది చూసుకుంటూ ఉంటారు ఈ రోజు కాలేజీ మొదటి రోజు మా సీనియర్స్ తనని ఏడిపిస్తుంటే ఏడుస్తున్నా తనని చూసి నేనే తనకి హెల్ప్ చేశాను…
వాళ్లు ఎమన్నా సైలెంట్ గా ఏడుస్తుంది కాని ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు తాను చాలా అమాయకురాలు అమ్మ అని అంటుంది…
అప్పుడు అను మొదటిలో అందరూ అలానే కనిపిస్తారు అని అంటే శృతి కోపంగా ఇది నా విషయం నాకు సంబంధించింది నువ్వు మాట్లాడకు అని కోపంగా అన్నయ్య తనకి ఇక్కడ కొత్త ఎటు వెళ్తుందో ఏమో నువ్వే తనని సేఫ్ గా దించాలి వెళ్లు అని అంటే ఓకే అని వెళ్తున్న అభి నీ చూసి
అను ఇప్పుడు నువ్వు వెళ్లడం అవసరమా అభి అని అంటే అభి కోపంగా అను వైపు చూసి ఈ విషయం నీకు అనవసరం ఓకే నువ్వు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడం నీకే మంచిది అని నిధి కోసం బయటకి వెళ్తాడు…
తాను ఎక్కడ ఉందా అని చూస్తూ ఉంటాడు ఒక బస్ డిపో లో కూర్చొని తన బాగ్ నీ గట్టిగ పట్టుకొని భయంగా కూర్చొని ఉంటుంది…
తనని అలా చూసి కోపంగా వెళ్లిన అభి తన భుజం మీద చెయ్యి వెయ్యగానే భయంగా లేచి అభి నీ చూసి దూరం జరుగుతుంది…
పిచ్చ నీకు ఇక్కడ కుర్చున్నావ్ అంటే అన్నయ్య కి కాల్ చేశాను వస్తాను అన్నారు కస్టమర్స్ ఉన్నారంట ఒక 30 మినిట్స్ ఇక్కడే కూర్చోమన్నాడు అని అంటే కోపంగా వాడికి బుద్ధి లేదా అని అంటాడు…
వాళ్ల అన్న నీ అలా అంటున్న అభి నీ కోపంగా చూస్తూ మీలా మేము డబ్బు ఉన్నవాళ్ళం కాదు…
మా అన్నయ్య అలా కస్టమర్స్ నీ వదిలి వస్తే రేపు వాళ్లు వస్తారా మా కేఫ్ కి అని అంటున్న తనని కోపంగా చెయ్యి పట్టుకొని కార్ లో కూర్చో పెట్టి అడ్రెస్స్ చెప్పు అని అంటాడు…
మీ కార్ లో నేను రాను మా అన్నయ్య వస్తాడు తన కోసం నేను వెయిట్ చేస్తా అంటున్నా తనని నువ్వు ఇప్పుడు కార్ దిగాలని చూస్తే ఈ రోజు నువ్వు ఇంటికి వెళ్ళావ్ అని అంటాడు…
ఏంటి అండి మీరు ఇలా చేస్తున్నారు…
చేస్తాను ఇలానే అని తన చెయ్యి వైపు చూస్తాడు ఎర్రగా కమిలి ఉన్న చెయ్యి నీ చూసి ఆ చెయ్యి పట్టుకొని ఏంటే ఇది అని అంటే
మీ వాళ్లే మీరే కదా అంత గట్టిగ నా పట్టుకొని వచ్చారు అందుకే ఇలా అంటే…
దేవుడా ఇలా ఉన్నవేంటే నువ్వు కొంచం గట్టిగ పట్టుకుంటే నీ స్కిన్ ఇంత రెడ్ ఐపోతుంది…
నిన్ను చాలా స్మూత్ గా డిల్ చెయ్యాలి అని అంటాడు…
కాని ఇప్పుడు తనని అతనే బాధపెడుతున్నాడు…
𝕭𝖚𝖏𝖏𝖎…
Swipe left/right or tap the sides to turn pages