తనువులు కలిసిన వేళ ❤️ – 1
తనువులు కలిసిన వేళ….
అక్క నీ చేసుకోవలసిన అతడు చెల్లి ని చేసుకున్నాడు…
ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఇద్దరు మరి వాళ్ల బంధం ఎలా ఉంటుంది…
ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అతను…
ఆమె నే అతను ప్రేమించింది అని తెలుసుకొని తన తో జీవితం మొదలుపెడతాడు…
వాళ్ల అక్క తిరిగి వస్తే ఆ చెల్లి పరిస్థితి ఏమిటి…
అప్పుడు ఆమె ఏం చేస్తుంది…
వాళ్ల అక్క కోసం తాను ఆ బంధాన్ని వదులుకుంటుందా…
అతను తనని తనకు దూరంగా వెళ్ళానిస్తాడా…
తెలుసుకోవాలి అంటే చదవండి…
తనువులు కలిసిన వేళ
కుందన ♥️రాణా
అది ఒక పెళ్లి మండపం అక్కడ పెళ్లి కొడుకు పూజ చేస్తూ ఉన్నాడు…
తనని చూస్తూ ఉన్న అక్కడ వారందరు తనని అలానే చూస్తూ ఉన్నారు…
అక్కడ ఉన్న పెద్ద వాళ్లు నాకు అల్లుడు అయితే బావుండు కాని ఆ ఛాన్స్ మాకు ఇవ్వకుండా ఈ వర్మ కొట్టేసాడు అని తన మీద అసూయ తో తనని చూస్తూ ఉన్నారు…
అక్కడ ఉన్న అమ్మాయిలు వాళ్ల కలల రాకుమారుడు ఈ రోజు వేరే వారి సొంతం అవుతున్నాడు అని బాధ గా ఫిల్ అవుతూ పెళ్లి కూతురు చాలా లక్కీ అని అనుకుంటున్నారు…
పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకురండి అని చెప్తే పెళ్లి కూతురి అమ్మ పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్లి చూసే సరికి అక్కడ ఒక లెటర్ మాత్రమే ఉంటుంది…
ఆ లెటర్ తీసుకొని చదివిన తాను కళ్లుతిరిగి పడిపోతుంది టెంక్షన్ కి…
అప్పుడే వాళ్ల చిన్న కూతురు అయినా కుందన వల్లి అక్కడ వచ్చి వాళ్ల అమ్మ నీ చూసి కంగారుగా ఏమైంది మా అని అడుగుతూ వాళ్ల అమ్మ నీ లేపి కొన్ని వాటర్ తాగించి వాళ్ల అమ్మ చేతిలో ఉన్న లెటర్ చదువుతూ తాను
ఎంత పని చేశావ్ అక్క అని అనుకోని…
వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి వాళ్ల నాన్న కి జరిగిన విషయం చెప్తుంది తాను కోపంగా లోపడికి వచ్చి వాళ్ల అమ్మ నీ చెంప మీద కొట్టి ఆడపిల్ల ఏం చేస్తుంది ఎక్కడికి వెళ్తుంది…
తాను ఎలా ఉంటుంది అని తెలుసుకోకుండా ఇంత పని చేసే దాక నువ్వు ఏం చేస్తున్నావ్ అని కోపంగా ఇంకొకటి కొట్టడానికి వెళ్తుంటే అప్పుడు వాళ్ల చిన్న కూతురు తనని అసలు మీరు అడిగారా నాన్న ఎప్పుడైనా…
అసలు అక్క కి ఈ పెళ్లి ఇష్టమా లేదా అని మీరే మీ ఇష్టం తో అక్క కి పెళ్లి చెయ్యాలి అని చూసారు…
ఇప్పుడు చూసారా ఏమైందో ఒక్కసారి మీరు అక్క నీ అడిగి ఈ ఏర్పాటు చేసి ఉంటే బావుండు అని అంటుంది…
కోపంగా వాళ్ల నాన్న తనని కొట్టాలని చెయ్యి లేపేసరికి అక్కడికి పెళ్లి కొడుకు వస్తాడు…
తాను వర్మ గారు కంగారుగా రావడం చూసి అసలు ఏమైందో కనుక్కోమని వాళ్ల వాళ్ళని పంపిస్తాడు…
వాళ్లు పెళ్లి కూతురు లేదండి రూమ్ లో అని చెప్తే వాళ్ల అమ్మ నాన్న వైపు కోపంగా చూసి లేచి వాళ్ల దగ్గరకు వస్తాడు…
వస్తున్న తాను వల్లి అన్నా మాటలు అన్ని వింటాడు…
కోపంగా లోపడికి వచ్చి మీరు మీ కూతురిని అడగకుండా ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరి ముందు మా ఫ్యామిలీ కూడా తల దించుకునే లా చేశారు దీనికి మీకు మంచి పనిష్మెంట్ ఉంటుంది…
అనీ కోపంగా బయటకి వెళ్తుంటే బాబు రాణా నా మాట విను తాను వేరే వాళ్ళని ప్రేమించింది అని నాకు తెలిదు నా కూతురు అలా చేయదు అనుకున్న కాని అని ఆగి మీకు అభ్యంతరం లేకపోతే నా చిన్న కూతురు కుందన వల్లి నీ పెళ్లి చేసుకోండి అని అంటాడు…
అప్పుడు రాణా వాళ్ల అమ్మ నాన్న కూడా అక్కడికి వస్తారు వల్లి నీ చూసి వాళ్లు ఈ అమ్మాయి కూడా ఎవరినైనా ప్రేమించి ఉంటుందేమో అడగండి అని అడుగుతారు కోపంగా…
అప్పుడు రాణా కోపంగా వల్లి వైపు తిరుగుతాడు…
తాను వాళ్ల నాన్న వైపు చూసి లేదు అని అంటుంది…
రాణా కోపంగా వల్లి దగ్గరకు వచ్చి మీ అక్క ఎక్కడికి వెళ్లిందో నీకు తెలీదా అని అంటాడు…
అప్పుడు వాళ్ల అమ్మ రాణా తో రాణా బాబు తాను మార్నింగ్ నే వచ్చింది క్యాంపు నుంచి తనకు ఏమి తెలిదు అని అంటుంది…
మీ అక్క ఎవరినైనా ప్రేమించిందా అని గట్టిగ అడుగుతాడు…
నాకు తెలీదు అని అంటుంది వర్మ గారు మీరు బయటకు వెళ్ళండి అని అంటాడు…
మరి రాణా కుందన వల్లి ని పెళ్లి చేసుకుంటాడా…
వల్లి ఒప్పుకుంటుందా…
అసలు పెళ్లి జరుగుతుందా…
వల్లి అక్క ఎవరూ అసలు తాను ఎవరిని ప్రేమించింది…
చూడాలి అంటే రీడ్ మై స్టోరీ…
తనువులు కలిసిన వేళ
మరి వీళ్ల కథ ఏంటో చూద్ధం…
Swipe left/right or tap the sides to turn pages