New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఓయ్ బావ.. ఐ లవ్ యు – 1

ఓయ్ బావ.. ఐ లవ్ యు – 1

హాయ్!!! అందరూ ఎలా ఉన్నారు..

 

మీకేంటి మీరు అందరూ బంగారాలు చాల బాగుంటారు లే..

 

మరి నేను ఎలా ఉన్నానో అడగరా..

 

ఉఫ్ఫో!! మీరు అడిగినా అడగక పొయినా మీ కోసం చేప్పేస్తాను అండి..

 

నేను కుడా చాలా బాగున్నాను 

 

ఇంతకి అసలు విషయం మర్చిపోయాను చూసారుా.. అదే అండి తెలివైన వాళ్లు పడే కష్టాలు.. (ఎన్ని విషయలు అని గుర్తు పెట్టుకోవాలి )

 

నా పేరు °సాన్విక ° ..నాకు అలోచనలు ఎక్కువ ఆచరణలు తక్కువ, ప్రేమ ఎక్కువ, కొపం తక్కువ.. జాలి ఎక్కువ, స్వార్ధం తక్కువ.. కొంచెం తిక్క ఎక్కువ, ఆలాగే కొంచెం తింగరి తనం కుడా.. 

 

మనకి ఉన్న టాలెంటు కి బిల్ గేట్స్ బాబాయి.. మొన్ననే ఓక కంపెనీ రాసి ఇస్తాను అంటే.. వద్దులే బాబాయ్ నా నెట్ బిల్లు కట్టెే చాలు అంటే అలిగి వెళ్లిపోయారు అండి.. (తప్పుగా అన్నానా )

 

నిన్న ఎమో టాటా తాతయ్య గారి మనవడు పెళ్లి చేసుకుంటావా అనీ నన్నూ అడిగితే నాట్ ఇంట్రస్ట్డ్ 

అని చెప్పాను అండి.. మనకీ ఎందుకు అండి పెళ్లి.. అసలే చిన్న పిల్లని.. 

 

నా వేషాలు బట్టి మీకు ఇంకొక విషయం అర్దమైంది అనుకుంటా.. అదేటంటే మనకీ మనమే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటాం అబ్హా.. 

(మనల్ని ఎవరూ పోగడకపోతే మనల్ని మనం పోగుడుకోవ్వచు తప్పు లేదు అండి )

 

ఇంతకి నాకు జీవిత  ప్రయాణంలో ఉన్నాడు ఓకే ఒక

భద్హ శత్రువు.. తనే °సిద్దార్థ్° ..

 

మా ఎదురు ఇంట్లొ ఉంటాడు.. మా నాన్న.. వాళ్ళ నాన్న బెస్టు దోస్తులు.. కలిసి బిసినెస్ పార్టనర్స్ గా కుడా చేస్తున్నారు.. మేము ఇద్దరం చిన్నపటి నుండీ కలిసే పెరిగాం కాని ఒకరు అంటే ఒకరికి అస్సలు పడదు.. రోజుకో గొడవ లేకపొతే నిద్రే పట్టదు 

 

ముందూ మీ అందరికి మా ఫ్యామిలి నీ పరిచయం చేసేస్తా వచ్చేయండి…

 

ముందు నాన్నగారు (మా డాడీలు ).. సంతోష్ గారు

ఇంక మా మత శ్రీ.. సీత గారు

 

ఇంట్లొ మనం వన్ అండ్ ఓన్లీ క్వీన్ అనమాట.. అంతెే మా ఇంట్లొ శాల్తీలు..

 

పదండి మా ఎదురు ఇంట్లొకి తీసుకుని వెళ్తాను.. కామన్ వచ్చేయండి నా వెనుకా..

 

అయ్యొ ఎదురు ఇంట్లొ వాళ్లు డోర్ వేసుకున్నారు.. ఎం పర్లేదు.. అందరినీ డిస్టుర్బ చెయడం లో ఉండే అహ్ కిక్కే వెరప్ప అహ్.. 

 

అత్తమ్మా అత్తమ్మా అనీ గట్టిగా తలుపు బాదెసరికి అత్తమ్మ యే వచ్చి తలుపు తీసింది చూసారా… మా అత్తమ్మ బంగారం..

 

వెంటనే వెళ్లి అత్తమ్మా చుట్టూ ఓక రౌండ్ వేసి మంచిగా జ్యూస్ తీసుకురా అత్తమ్మ అనీ కిచెన్ లోకి పంపేసాను..

(ఎందుకొ తెలుసా.. మీకు ముందు మా తోక్కలో తిక్క మానవుడి మంచీ ఫ్యామిలి గురించి చెప్పాలీ కదా )

 

మా మామ.. విష్ణు గారు

మా అత్తమ్మ..అనుషా గారు..

 

(ఇంక మిగిలిన వాడు ఉన్నడు లెండి వాడి గురించి అవసరం లేదు.. కాకపొతే అందరి గురించి చెప్పీ వాడి గురించి చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు అని చెప్తున్నా అంతే )

 

సిద్ధార్థ్… చదువులో ఫస్ట్ ర్యాంక్ (వీడిని ఎవడూ  

తెచుకోమన్నడో ఫస్ట్ ..వీడి వల్ల నేను సరిగ చదవట్లెదు అని ఎన్ని సార్లు మా అమ్మ తిట్టిందో 

…ఫస్ట్ ఎవరికి కావాలి అంటా టాలెంట్ ఉండాలి..అధి ఇక్కడా టన్నుల టన్నుల ఉంది.. కాకాపోతే నాకు ఉన్న ట్యాలెంట్ నాకే పనికీ రాదు అనుకొండి.. అధి వేరే విషయం.. )

 

ఇంకా ఆటలలో గోల్డ్ మెడల్ (ఎవడికి ఓపియోగమో.. అధి రియల్ గోల్డ్ కాదు అని చెప్పండీ ఎవరినైనా వాడికి )..మనకి ఆటలు అవీ పడవు అండి బాబు.. ఓక వేల పంతంగా వెలితే నేను పడతాను అంతే..

 

ఉంటాడు లెండి ఓక సిక్స్ ఫీట్ (వీడి హైట్ వల్ల దేశానికి ఏమీ ప్రయొజనం లెదు.. వేస్ట్.. టోటల్ వేస్ట్ ))..మనమా క్యూట్ గా స్వీట్ గా 5’4 ఎదగడానికి కరణము.. చిన్నప్పుడు బలవంతంగా తాగించిన హార్లిక్స్.. 

 

ఇంకా వీడి గురించి చెప్పాలి అంటే అందంగానే ఉంటాడు అని మా కాలేజ్ అమ్మాయిల ఒపీనియన్

((వాళ్లకి పాపం కళ్ళు సరిగ కనిపించవు ఏమో.. కొంత మంది టేస్ట్ బ్యాడ్ అంతే ఎమ్ చెయ్యలేం.. ))

 

ఇప్పటికే వీడిని ఎక్కువ పొగిడేసాము ఎమో.. ములగ చెట్టు ఎక్కి ఉంటాడు ఎమో.. దిగు బాబు దిగు.. 

 

ఇంతకి ఎక్కడ ఆగమో.. హా గుర్తు వచ్చింది.. ఇంకా వీడూ వీడి సిరియస్ ఫేస్.. ఎపుడూ మొహం ముచ్చు లాగ పెడతాడు.. నవ్వితె ముత్యాలు రాలతాయి ఏమో అన్నట్టూ.. ఓక పెద్ద అయన ఎమ్ చెప్పారు అంటే.. ఎప్పుడూ నవ్వుతూ ఉండు.. పది మంది నీ నవ్విస్తు ఉండు అని.. (అహ్ పెద్ద అయన పేరు గుర్తు లెదు.. గుర్తు వచ్చినపుడు చెప్తాను )

 

ఇంకా మా అత్తమ్మ జ్యూస్ తెచ్చింది.. వెళ్లి తాగేసి మళ్ళీ మాట్లాడడానికి ఎనర్జీ తెచ్చుకోవాలి అబ్హ..

 

ఇదిగోరా నువ్వు అడిగిన మాంగో జ్యూస్ అంటు చేతికి అందించింది అత్తమ్మ..

 

అత్తమ్మ సూపర్ క్యూట్ కాద.. నా లానె.. 

…

ఇంతకి నేను మీకు నచ్చానా…  హాయ్ హాయ్ బంగారాలు.. 👀😜