ఓయ్ బావ.. ఐ లవ్ యు – 3
అలోచన లొ ఉన్న నాకు.. అత్తమ్మ వచ్చి… ” వాడికీ కాఫీ.. ఇచ్చేసి రావే” అంది..
అబ్బబ్బా ఈరొజు నా టైమ్ ఏంటో ఇలా ఏడ్చింది..
ఎది అయితే అదే అయ్యింది.. ముందు వెళ్లి వాడిని బుజ్జగించడం మొదలు పెట్టాలి ..
ఇంకా మెట్లు ఎక్కి పైన ఉన్న వాడి రూం కి వెళ్లి తలుపు కొట్టాను (మాకు అలాంటి ఫార్మాలిటీస్ ఉండకపోయినా.. టైమ్ బ్యాడ్ అయ్యినపుడు ఇలాంటివి పాటించాలి అండి )
వాడు డోర్ ఓపెన్ చేసి కొపంగా నా వైపు చూసీ.. వెళ్లి బెడ్ మీద కూర్చున్నాడు..
వెళ్లి వాడి చేతిలొ లో కాఫీ పెట్టాను..
(పాపం చేయ్యి కాళింది.. కాఫీ వేడిగా ఉంది ఏమో)
“అయ్యొ చేసుకోలేదు రా.. బాగ కాలిందా”అని అడిగాను కంగారుగా
వాడు మొహం అంత కాకరకాయ తిన్నా కోతి లాగ పెట్టేసి.. “అవునే బాగ కాలింది ..ఈ కాఫీ వల్ల కాదు నీ మాటలూ వల్ల “అన్నడు
( నాకు ఏమీ మాట్లాడాలో అర్ధమే కాలేదు )..”అరేయ్ నేను ఎదో సరదగా అంటే ఇంత అలగలా..
నన్ను ఎన్ని సార్లు తిట్టలేదు రా నువ్వు.. నేను ఇలాగే కారం తిన్న కోతి లాగ పెట్టనా ఫేస్”.. అంటు ఫ్లో లో ఇంకొకటి అన్నాను
వాడు అభ్భచ అన్నట్టూ ఓక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు
“నీకు ఎన్ని సార్లు చెప్పానే మనం ఉన్నపుడు నన్ను ఎన్ని అయినా తిట్టుకో.. నేను ఏమి అన్నాను.. కాని అందరీ ముందు అనకు “అనీ అన్నాడు
“అరే అందరూ ఎవరూ రా.. అత్తమ్మ ఒకతె ఉందిగా … బయట వాళ్ళ ముందు ఏమైన అన్నానా నిన్ను” అని అరిచాను
(నా బ్రైన్ ఎంత బాగ పనీ చేస్తుందో చూసారా.. వాడిని బుజ్జగించడం కి వచ్చి వాడి మీద ఇంకా అరుస్తున్నాను )
వాడు ఇంకా సీరియస్ గా చూస్తు.. “ఇదే అలవాటు అయ్యిపోతుంది నీకు.. కొంచెం నొరు అదుపు లో పెట్టుకో..బయట వాళ్ళ ముందు ఇలా అన్ని చెప్పి..అందరిలో నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం..బయట వాళ్ళ ముందు నువ్వు తగ్గడం నాకు నచ్చదు “అని చెప్పీ.. ఫోన్ వస్తే మాట్లాడడానికి పక్కకి వెళ్లాడు
అబ్బబ్బా.. ఇదెే ఇష్టము వీడిలో.. తననీ అన్ని మాటలు అన్న నా గురించి ఆలోచిస్తున్నాడు.. తప్పా తననీ అన్నాను అనీ ఆలోచించలేదు ..
(బంగారం అభ్భా.. హాల్లో హోల్డ్ ఆన్.. ఈ విషయం లోనే బంగారం అంతే.. మీరు ఇంకా ఎదో
ఊహించుకోకండి)
((సప్త సాగారాల కి సోలో క్వీన్ సాన్వి ఇక్కడ 💛))
పాపం నా ఫ్రస్టేషన్ లో అనవసరంగా మాటలు ఎక్కువ అనేసినట్టు ఉన్నాను.. ఎంతైన మన ముందు మనకి కావలసినవాళ్ళు మన గురించి ఇలా తప్పుగా మాట్లాడుకుంటే కోపం బాధ రెండు వచ్చేస్తాయి..
కానీ వీడు ఇంకా నా మీద కేరింగ్ నే ఎక్కువ చూపిస్తున్నాడు అన్ని మటాలు అన్న సరే..
నిజం చెప్పాలి అంటే నేను ఎక్కువ అలుగుతాను అండి…ఎక్కువ బ్రతిమలించుకుంటా..ప్రొద్దున చూసారా.. టిఫిన్ కి కూడా అత్తమ్మ నన్ను ఎలా బుజ్జగించిందో..నాకు అదో సరదా..కొన్ని సార్లు అలాంటి వాటిలోనే అవతల వాళ్ళకి మన మీద ప్రేమ ఎంత ఉందో..మన మీద ఎఫర్ట్ ఎంత పెడతారో తెలుస్తుంది అండి
ఇంకా సిద్దూ గురించి చెప్పాలి అంటే..వాడు బయట ఎలా ఉన్నా..నా విషయం లో మాత్రం వాడి ఈగో పక్కన పెట్టేసాడు ఎప్పుడూ..కాకపోతే కొన్ని సార్లు చాలా కోపం తెప్పించేస్తాడు
(ఒక ఇన్సిడెంట్ అలానే జరిగింది అండి..నేను మా ఫ్రెండ్ కలిసి ఒకసారి కాలేజీ డుమ్మా కొట్టేసి ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉన్నపుడు మూవీ కి వెళ్ళాము..
అదీ ఇంట్లో చెప్పింది వాడే… వాడే ఇంట్లో చెప్పాడు అని తెలిసి చాలా అంటే చాలా కోపం వచ్చేసింది..
మన ఇంట్లో అందరూ గారం చేసేవాళ్ళే..నాన్న, మావయ్య ఆ లిస్ట్ లో ఫస్ట్ ఉంటారు..ఇంకా అమ్మ మాత్రం ఆ రోజు అమ్మోరు తల్లి అవతారం ఎత్తింది..ఇంట్లో వెళ్లగానే కోపంగా ఒక చూపు చూసింది..నాకు అప్పుడే అర్ధం అయిపోయింది..నేను చేసిన పని ఇంట్లో తెలిసిపోయింది అని.. అది కూడా వాడు చెప్తేనే ఇంట్లో తెలుస్తుంది అనే విషయం కూడా తెలుసు నాకూ..
ఇంకా అమ్మ గట్టిగానే తీడదాము అనుకుంది..కానీ ఒక్క రెండు మాటలు అనగానే..సిద్ధూ అత్తమ్మ..దానిని ఏమి అనకు..సరదాగా ఒక రోజు అలా ఎంజాయ్ చేస్తే తప్పు ఏంటి..అయిన ఆది నాకు చెప్పే వెళ్ళింది అని కవరింగ్ చేసి నేను చెప్పి వెళ్లకపోయినా అమ్మ నుంచి నన్ను కాపాడాడు..
కానీ అమ్మ మాత్రం అందరూ ఇలా గారం చేసి చెడగొడుతున్నారు..అని వాడినీ కూడా నాలుగు మాటలు అంది..
వాడు మాత్రం అప్పుడే అది బీటెక్ నాతో పాటే చేస్తుంది నేను దానిని బాధ్యతగా చూసుకుంటాను అని ఆ రోజు అమ్మకి ప్రామిస్ కూడా చేశాడు..
ఇంకా వాడికి థాంక్స్ చెప్పాలి అని వాడి రూమ్ కి వెళ్ళి వెనక నుంచి వాడిని లైట్ గా హత్తుకుంటూ..థ్యాంక్ యూ సో మచ్ రా అని చాలా ఎమోషనల్ గా చెప్పాను..
~~~~~~~~~~~~
ఇంతకీ సిద్దు ఏం అంటాడో ఇప్పుడు గెస్ కరో…అలానే ఎపిసోడ్ నచ్చితే సమీక్షలో తెలియజేయండి క్యూటిస్!!😍
Swipe left/right or tap the sides to turn pages