ఓయ్ బావ.. ఐ లవ్ యు – 2
వచ్చేసాను అండి.. ఎక్కడా ఉన్నాం మనం.. హ గుర్తు వచ్చింది..
అదే అంటే ఇందాక మాంగో జ్యూస్ శుభ్రంగా తాగేసాను..
ఇప్పుడు ఈ పిల్ల ఏంటి మాతో ముచ్చట్లు పెట్టింది.. పనీ పాట లేదా అనుకుంటున్నారు కదా ( నాకు తెలిసిపోయింది.. )
ఈరొజు అదివారం అండి.. అందుకే ఇంత కాలిగా ఉన్నాను..
((నేను బి టెక్ థర్డ్ ఇయర్ అండి
నిన్న చెప్పాను కధ వాడు కుడా బి టెక్ థర్డ్ ఇయర్.. ఒక్కటే కాలేజ్.. కాని వెరే వెరే క్లాసు..
సేము గ్రూప్.. కాకాపోతే వాడు బోయ్స సెక్షన్.. నేను గర్ల్ సెక్షన్.. ))
( వాడు నా కన్న టూ ఇయర్స్ పెద్ద అండి.. చిన్నపుడు లేట్ గా జాయిన్ అయ్యడు స్కూలు లో.. నేను స్కూల్ లో జాయిన్ అయ్యక వాడిని నా క్లాసు లో ఉండాలి అనీ గొల చేసా.. అప్పటికి వాడికి నర్సరీ, ఏల్ కె జి కుడా అయిపోయాయి.. నాకొసం రెండో సారి చదివాడు )
(అప్పట్లొ అలా ఎందుకు చెసానో గాని.. ఇపుడు వాడు నేను ఒకటే క్లాస్ కాబట్టి.. వాడు ఏమో టాపర్.. నేను చదవకపోతే మత్రం ఒహ్ రేంజ్ లో క్లాస్ పీకుతాడు )
ఇంక కలిగా ఉండి మనం చేసే పనీ ఏమి ఉంది..అందుకే అత్తమ్మ తొ ముచ్చట్లు మొదలు పెట్టాను.. మనకి మాటలకి కోదవా చెప్పండి..
మవయ్య, నాన్న ఎమో బయటకి వెళ్లారు అంటా..
నేను లెగిసిన రెడీ అయిన వెంటనే.. మా సీతాలు చేసినా ఇడ్లి తినలేక ఇక్కడికి వచ్చి జ్యూస్ తాగేసాను.. అంటే నేను లెగిసే సరికి 10:00 అయ్యంది అధి ఇంకొ విషయం అనుకొండి..
ఏంటో అబ్హా.. ఈ ప్రాణానికి ఎంత నిద్ర పోవాలన్న నిద్ర వచ్చేస్తుంది.. ఇది కుడా ఒక ట్యాలెంట్ అండొయ్ ..( పైగా అదివారం కదా ఎదో.. వారం అంతా ఏమీ పోడిచేది లేకున్న ఎదో కష్టపడట్టు సండే రోజు బిల్డప్పులు కోట్టాలొచ్!! )
అత్తమ్మ తొ కాసేపు టిఫిన్ తిను అంటు బతిమలించుకున్న తరువాత 12 కి డైరెక్ట్ భొజనం నీ దెగ్గర చేస్తాను అని డీల్ కుదుర్చుకున్న.. హమ్మయ్య.. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది..
అదే మా సీతమ్మ అయితే.. బ్రతిమాలడం బుజ్జగించడం ఏమి ఉందదు డైరెక్ట్ నోట్లో కుక్కేస్తుంది..ఎంతైనా తల్లి ప్రేమ అదొ రకం అండి.. ఎంత తిట్టిన సరే దానిలో మన మీదా ప్రేమే కనిపిస్తుంది..
ఇంకా బాగా బోర్ కొట్టి అత్తమ్మ నేను అలా పాత పాటలు వింటున్నాం..
నేను ఇక్కడికి వచ్చి చాలా సేపు అయ్యిందే.. ఆ మహాప్రభూ మనలాగా పది వరకు పడుకునే రకం కాదు..పోనీ అప్పుడే చదివేస్తున్నాడు ఏమో..వాడు చదువుకోవడం అమ్మ చూస్తే నా పని గోవిందా..ఏది అయితే అది అయింది లే అని అత్తమ్మనే అడిగేసా..
రూమ్ లో వాడు ఉన్నట్లు అనిపించట్లేదు ..అందుకే
అత్తమ్మ.. మీ పుత్ర రత్నం ఎక్కడ అని అడిగాను
వాడు గ్రౌండ్ కి వెళ్లాడు జున్నమ్మ..
అంది మా అత్తమ్మ
(ఉండండి జున్నమ్మ నా ముద్దూ పేరు.. అహ్ సిద్దు గాడే చిన్నప్పుడు నాకు పెట్టాడు )
అవునా కష్టాజీవి అత్తమ్మ నీ పుత్రరత్నం అని అత్తమ్మ తొ అంటే..
ఏదో కష్టం పడాలి కదరా జీవితం అన్నాక అని వాళ్ళ అబ్బాయిని సపోర్ట్ చేస్తూ అంది అత్తమ్మ
అబ్బా ఏంటి అత్త పార్టీ మార్చేశావు.. నీ కొడుకుకు ఏమి జీవితం లో కష్టాలు లేవు వాడే లేని పోనివి నెత్తి మీద వేసుకుని నాకు దెబ్బలు పడేలాగా చేస్తాడు..అయిన అంత చదవడం అవసరమా..అంత బాధ్యతగా ఉండడం అవసరమా..ఈ ఏజ్ లో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము నువ్వు చెప్పు..
నాకు తెలిదు అమ్మ.. నాకు కాదు వెళ్లి వాడితో చెప్పూ ఆ మాట..నీ మాట వింటాడు ఏమో అంది మా అత్తమ్మ..
హెల్లొ నాకు ఎమ్ భయం లేదు.. నీ కొడుకే ఉరికే ముచ్చు మొహం వేసుకుని ఉంటాడు.. పైగా అ చూపు ఒక్కటీ.. ఎదో పెద్దా సిఎం లాగ బిల్డప్పులు.. నా దెగ్గర యాక్షన్ చెయ్యద్దు అనీ చెప్పూ.. మాటలు రానట్టు హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్ అంట.. ఎదో మాట్లాడితే ట్యాక్స్ వేస్తారు అన్నట్టు..అంత సీరియస్గా ఉంటే చెప్పాలి అనుకున్నది కూడా మర్చిపోతాం మరి..
ప్రతి దానికి క్లాసు పీకుతూ ఉంటాడు.. ఎదో లెక్చరర్ లాగా.. ఇంకా మా టీచర్లు లు బెస్టు తెలుసా.. అసలు తిట్టారు నన్ను.. చిన్నా పిల్లా అనీ కుడా ఉందదు వాడికి అంటు ..నాకు ఉన్న తిక్క లో వాగుతూ ఉన్నాను.. ఒకసారి ఎందుకో వెన్నక్కి తిరిగీ అ సాల్తి నీ చుసి నా సౌండ్ బాక్స్ మ్యూట్ లోకి పొయింది..
వెనకనే ఉన్నడు సీరియస్ గా కళ్ళు ఎర్రజెసి మొద్దూ.. అదే అదే సిద్ధు..
((అమ్మో నా పనీ గోవింద గోవింద ..ఈరొజు నా పనికి
“యే నిమిషానికి యేమి జరుగునో.. ఎవరూ ఉహిన్చి ఎదరు.. అని పాటా వేసుకోవాలి..
అయినా నా దరిద్రం డిజె సాంగ్ పెట్టుకుని డిస్కో ఆడుతుంది గా ..ఇప్పటి దాకా ఎన్ని మట్లడుకున్నమో.. అప్పుడు రాలేని వాడు ..వాడిని తిట్టినప్పుడు వినడం ఏంటో.. ))
ఏడుపు ఒక్కటే తక్కువ నాకు..
అత్తమ్మా తొ మెల్లిగా… నీ కొడుకు ఎప్పుడూ వచ్చాడే?? అనీ అడిగా.. అంటే వాడు నా మాటలు విన్నడో లేదొ తెలుసూకుందాము అని !!
అత్తమ్మా.. నేను అవీ అన్ని నా కొడుకు తొ చెప్పుకో అన్నపుడే వచ్చాడే.. నీకూ సైగ చేసిన నీ గొల లో నన్ను పట్టించుకోలేదు నువ్వూ అనీ సైలెంట్ గా బాంబ్ పేల్చింది..
అయిపొయింది దేవుడా.. నువ్వే నన్ను కాపాడాలి అనీ ఆకాశం లోకి చుస్తూ ఉంటే..
వాళ్లు వి డోన్ట కేర్ అన్నటుగా చెవులూ ముసుకుని ఉన్నట్టు ఇమేజ్ కనపడింది..
ఇంకేం ఉందిగానీ అమాయకంగా మోహం పెట్టీ వాడి వైపూ చుసాను..
వాడు నా వైపూ ఓక సీరియస్ లూక్ ఇచ్చి రూం కి వెల్లిపోయాడు…
(అహ్ లుక్ కి అర్థము ఏంటో చెప్పమ్మా..?? ))
నా అంతరాత్మా బి లైక్: నీ ప్రశ్నలూ నీవే ఎవ్వరూ బదులు ఇవ్వరూ గా అంటు పక్కకి పొయింది..
ఇంకా అత్తమ్మ వైపు చూసా కాపాడు అన్నట్టుగా..”చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత”..అయిన మీ మధ్యలోకి నేను రాను అమ్మ అంటూ వెళ్ళిపోయింది..
…..
ఇప్పుడు సాన్వి పరిస్థితి ఏంటి గాయ్స్..👀🌝
Swipe left/right or tap the sides to turn pages