సరిగ్గా రాత్రి 10 గంటలకు, ఆ చీకటిని చీల్చుకుంటూ జ్వాల నడుపుతున్న నల్లటి లగ్జరీ కారు షిప్‌యార్డ్ లోపలికి ప్రవేశించింది. కారు హెడ్లైట్ల వెలుతురులో, ఒక పెద్ద క్రేన్‌కు తలకిందులుగా కట్టేసి ఉన్న విక్రమ్ కనిపించాడు అతని శరీరం మొత్తం రక్తసిక్తమై ఉంది. ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి. భారతదేశంలో ఉన్న విక్రమ్‌ను కార్లోస్ అంతర్జాతీయ నెట్వర్క్ ఎంత పకడ్బందీగా కిడ్నాప్ చేసి, లండన్ మాఫియా కేంద్రానికి చేర్చిందో ఈ దృశ్యం చూస్తేనే అర్థమవుతోంది.