జ్వాల రాగ్నర్ కళ్లల్లోకి చూస్తూ తీవ్రమైన స్వరంతో అంది, “రాగ్నర్! నువ్వు నా జేఎస్ ఫౌండేషన్ పిల్లల ప్రాణాలతో మైండ్ గేమ్ ఆడావు. కానీ నేను నీలాంటి రాక్షసిని కాదు. నీ కుటుంబాన్ని నేను ఏమీ చేయను. కానీ నువ్వు గనక ఈ క్షణమే హ్యాకింగ్‌ను ఆపి, జేఎస్ ఫండ్స్ ను రీస్టోర్ చేయకపోతే.. నువ్వు లండన్ లో చేసిన వందలాది సైబర్ మర్డర్స్ ఆధారాలను ఇంటర్‌పోల్ కోర్టులో సబ్మిట్ చేస్తుంది. నీ కుటుంబం సమాజంలో తలెత్తుకోలేకుండా రోడ్డున పడుతుంది. నీ డబ్బు, నీ ఇగో ఏదీ నిన్ను కాపాడలేదు. ఇప్పుడు చెప్పు.. నీ ఇగో ముఖ్యమా, నీ కుటుంబం ముఖ్యమా?” అని మైండ్ గేమ్‌ను రివర్స్ తిప్పింది.
జ్వాల వేసిన ఈ మాస్టర్ స్ట్రోక్‌కు రాగ్నర్ పూర్తిగా ఆలోచనలో పడి పోయాడు. వాడి చేతిలో ఉన్న బాంబు స్విచ్ కింద పడిపోయింది. వాడి కళ్లల్లో మొదటిసారి చావు భయం కనిపించింది. ఒక మహిళ తనను ఇంతలా మైండ్ గేమ్‌లో ఓడిస్తుందని వాడు ఊహించలేదు.