కోర్టు హాల్ మొత్తం కొన్ని నిమిషాల పాటు నిశ్శబ్దంగా మారిపోయింది. లార్డ్ జస్టిస్ విలియం అన్ని ఫైళ్లను, ఇంటర్పోల్ నివేదికలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం తన సుదీర్ఘ తీర్పును చదవడం ప్రారంభించారు.
“ఈ అంతర్జాతీయ కోర్టు అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చింది. మేడమ్ జ్వాల సమర్పించిన సాక్ష్యాలు వందకు వంద శాతం నిజం. బోనులో ఉన్న ప్రమీల అలియాస్ విక్టోరియా భారతదేశంలో మరియు లండన్ లో అంతర్జాతీయ కుట్రలు, హత్యలు, మరియు హవాలా లావాదేవీలకు పాల్పడినట్టు రుజువైంది. లాయర్ అలెక్స్ కాంప్‌బెల్ వేసిన అన్ని పిటిషన్లను ఈ కోర్టు కొట్టివేస్తోంది. జేఎస్ కార్పొరేషన్ యొక్క గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ టెండర్లు పూర్తిగా లీగల్ అని ఈ కోర్టు ప్రకటిస్తోంది.”