హాస్పిటల్లో జాయిన్ అయిన లోకల్ గుండాలు మాఫియా వాళ్ళు డిశ్చార్జ్ అయ్యి ఫామ్ హౌస్ కి వెళ్ళిపోతారు . అక్కడ లైకాన్ టీంలోని కొంత మందిని ఎవరో చంపి తలలు మొండాలు వేరు చేసి తలల్ని రూమ్ లో ఫ్యాన్స్ కి కట్టి ఫ్యాన్ అన్ చేసి , మొండాల్ని స్విమ్మింగ్ ఫూల్ లో పడేసి వెళ్తారు . ఫ్యాన్ హౌస్ లో వున్న cc కెమెరాలు పనిచేయవు , కుక్కలు మత్తు మందికి నిద్రపోతారు , అక్కడ పని చేసే వాచ్మెన్ భార్యను కూడా చంపేస్తారు . బిలాల్ తో కలిసి హైటెక్ సిటీ కొండ దగ్గరకి వెళ్ళిన మిగతా టీమ్ వాళ్ళకి ఫామ్ హౌస్ విషయం తెలిసి బిలాల్ తన టీంను అక్కడ ఉంచి ఒక్కడే ఫామ్ హౌస్ కి వెళ్తాడు . ఈ విషయం తెలిసిన లాలా కూడా ఫామ్ హౌస్ దగ్గరకి చేరుకుంటాడు .