New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా జత నీవని 💘 – 2

నా జత నీవని 💘 – 2

షాపింగ్ మాల్ భారీ గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని ఇద్దరూ మాల్ లోకి ఎంటర్ అవుతారు……. !! మాల్‌లోకి అడుగుపెట్టగానే రకరకాల బ్రాండెడ్ షాప్స్, కలర్ ఫుల్ లైటింగ్స్‌తో వాతావరణం చాలా వైబ్రెంట్‌గా అనిపిస్తుంది………. !! అను, భూమి ఇద్దరూ  మెల్లగా జెంట్స్ సెక్షన్ వైపు నడుస్తారు………. !! లౌడ్ మ్యూజిక్‌తో  మాల్ అంతా సందడిగా ఉంది……….!! అను మాత్రం చుట్టూ ఉన్న షాప్స్‌ని చూస్తూ ఆశ్చర్యంగా నోరు తెరిచి అబ్బా భూమి…..!! ఈ మాల్ చూస్తుంటేనే నా మనసు ఏదేదో కొనేయమని పరిగెడుతుంది తెలుసా……!! అది విన్న భూమి నవ్వుతూ  కొనడానికి మన దగ్గర డబ్బులు కూడా ఉండాలి కదా మేడమ్…..!! ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచించడమేనా నీ పని …..!! కాసేపు అయినా మనం రిచ్ గర్ల్స్‌లా ఫీల్ అవ్వకూడదా…..!! అబ్బా ఆ ఫీల్ ఎంత కిక్ ఇస్తుందో తెలుసా నాకు…….. !! 

మనం రిచ్ గర్ల్స్‌లా ఫీల్ అవ్వొచ్చు అను కానీ బిల్ కట్టే టైమ్‌కి మాత్రం మన బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తొస్తుంది…..!!
అంటూ భూమి నవ్వడంతో అను కూడా నవ్వుతుంది………. !! అలా ఇద్దరూ నడుచుకుంటూ ఎస్కలేటర్ వైపు వెళ్లారు అను చుట్టూ ఉన్న షాప్‌లను ఇంట్రెస్ట్‌గా చూస్తూ అబ్బబ్బా ఎంత క్రౌడ్  ఉందో చూసావా భూమి……..?? అని మాట్లాడుతూ ఇద్దరూ జెంట్స్ వేర్ సెక్షన్‌లోకి అడుగుపెడతారు………. !!  అక్కడ వరుసగా వేలాడుతున్న ఫార్మల్ షర్ట్స్, బ్లేజర్స్, డిజైనర్ జాకెట్స్ కనిపిస్తాయి………. !! సరే గానీ ఫస్ట్ మనం ప్రియేష్‌కి ఏం గిఫ్ట్ తీసుకోవాలో ఒక క్లారిటీకి వద్దాం………. !! లేకపోతే రోజంతా ఈ మాల్‌లోనే తిరగాల్సి వస్తుంది అంది అను ………. !! 
భూమి తన హెయిర్ అడ్జస్ట్ చేసుకుంటూ అదే కదా అను… నేను కూడా అదే థింక్ చేస్తున్నా ………… !! ప్రియేష్ టేస్ట్ నీకు తెలిసిందే కదా చాలా డిఫరెంట్ వాడికి నచ్చేలా యూస్‌ఫుల్  గా ఉండేది ఏదైనా ఇవ్వాలి…………. !!!ఎలాంటిది తీసుకుంటే బాగుంటుందంటావ్ ………… ?? 
హ్మ్మ్… ప్రియేష్ ఫార్మల్ డ్రెస్సింగ్ బాగా లైక్ చేస్తాడు కదా………..!! ఆఫీస్ వేర్ కోసం ఒక క్లాసీ వాచ్ లేదా బ్రాండెడ్ పెర్ఫ్యూమ్ ఇస్తే ఎలా ఉంటుంది………?? వాచ్ అయితే డైలీ వేర్ చేయొచ్చు  ఎప్పుడూ ఆ గిఫ్ట్ గుర్తుంటుంది అని అను సజెషన్ ఇస్తుంది……… !! 
భూమి కాసేపు ఆలోచించి పెర్ఫ్యూమ్స్ ఆల్రెడీ వాడి దగ్గర చాలా ఉన్నాయి అను………… !!  వాచ్ ఐడియా బాగుంది కానీ రీసెంట్‌గానే తను ఒక స్మార్ట్‌వాచ్ కొనుక్కున్నాడు కదా……..!! ఈసారి కాస్త స్పెషల్‌గా పర్సనలైజ్డ్‌గా ఉండేలా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది……….. !!  లైక్ ఒక మంచి ఫార్మల్ బ్లేజర్ విత్ లెదర్ వాలెట్ కాంబో  ఎలా ఉంటుంది ………?? 
వావ్! సూపర్ ఐడియా భూమి ప్రియేష్‌కి ప్రెజెంటేషన్స్ ఉన్నప్పుడు బ్లేజర్స్ ఎక్కువ వేస్తుంటాడు………. !!  చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది ఆ ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న మెన్స్ బ్రాండెడ్ స్టోర్‌కి వెళ్దాం పదా ………..!! అక్కడ మంచి కలెక్షన్ ఉంటుంది అంటూ భూమి చెయ్యి పట్టుకుని పైకి తీసుకెళ్లింది……….!! షాప్‌లోకి వెళ్లగానే అక్కడి సేల్స్ ఎగ్జిక్యూటివ్ నవ్వుతూ వచ్చి గుడ్ మార్నింగ్ మేడమ్ మీకు ఎలా హెల్ప్ చేయమంటారు ………… ?? 
మా ఫ్రెండ్ బర్త్‌డే కోసం ఒక మంచి బ్లేజర్ అండ్ మ్యాచింగ్ వాలెట్ చూడాలి ……… !! షూర్ మేడం ప్లీస్ కమ్ అంటూ 
అతను వాళ్లను మెన్స్ సెక్షన్‌కి తీసుకెళ్లి రకరకాల కలర్స్ చూపించడం స్టార్ట్ చేశాడు……… !! భూమి చాలా జాగ్రత్తగా ప్రతీ బ్లేజర్ , కలర్ క్వాలిటీ, షేడ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది……… !! నేవీ బ్లూ, బ్లాక్, గ్రే కలర్స్ పక్కన పెడుతూ ఒక నేవీ బ్లూ కలర్ రాయల్ ఫిట్ బ్లేజర్‌ని చేతిలోకి తీసుకుంటూ…….. !! అను ఇది చూడు ప్రియేష్ కలర్ టోన్‌కి ఈ నేవీ బ్లూ పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది కదా……..?? వాడి హైట్‌కి ఈ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అంది భూమి ఎగ్జైట్‌మెంట్‌తో……… !! 
అను ఆ బ్లేజర్ వైపు సరిగ్గా చూసి హా భూమి నీ సెలెక్షన్ మాత్రం వేరే లెవెల్………..!! ప్రియేష్ ఇది వేసుకుంటే నిజంగా చాలా హ్యాండ్సమ్‌గా కనిపిస్తాడు……… !! డెఫినెట్‌గా ఇది వాడికి బాగా నచ్చుతుంది & ఇక్కడే దీనికి మ్యాచింగ్ అయ్యే ఒక డాార్క్ బ్రౌన్ లెదర్ వాలెట్ కూడా సెలెక్ట్ చేద్దాం ………. !! అలా ఇద్దరూ కలిసి బ్లేజర్‌కి సెట్ అయ్యేలా ఒక క్లాసీ లెదర్ వాలెట్, అలాగే ఒక డిజైనర్ పెన్ కూడా పిక్ చేసుకున్నారు………. !! బిల్లింగ్ కౌంటర్ దగ్గర భూమి ప్రెసెంట్స్‌కి గిఫ్ట్ ప్యాకింగ్ చేయిస్తూ అను… నాకిప్పటికీ నమ్మకం కుదరడం లేదు తెలుసా………..?? నా లైఫ్‌లో ఇంత హ్యాపీగా, నచ్చినట్టు ఉండే రోజులు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు……..మీ !! ఆ దేవుడు నా చిన్నప్పుడు పేరెంట్స్‌ని దూరం చేసినా మావయ్య రూపంలో, ఆ తర్వాత నీ రూపంలో, ప్రియేష్ రూపంలో నాకు ఒక అందమైన లైఫ్ ఇచ్చాడు అంది కొద్దిగా ఎమోషనల్ అవుతూ………. !! 
అను భూమి భుజంపై చెయ్యి వేసి భూమి! పాత విషయాలు తలుచుకుని ప్రెసెంట్ ని వేస్ట్ చేసుకోకు………. !! నువ్వు పడిన కష్టాలకి, నీ మంచి మనసుకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్ మేము……… !! ఇప్పుడు నువ్వు ఇక్కడ చాలా హ్యాపీగా, ఇండిపెండెంట్‌గా ఉన్నావ్……… !! నీ కష్టాలు కూడా ముగిసిపోయాయి సో ప్రెజెంట్‌ని ఎంజాయ్ చేయి……….!! రేపు నైట్ ప్రియేష్ బర్త్‌డే సర్ప్రైజ్ పార్టీ గట్టిగా ప్లాన్ చేయాలి లెట్స్ సెలబ్రేట్ ఇట్ బిగ్ అని నవ్వుతుంది………. !! 
యస్ అను! రేపు ప్రియేష్ లైఫ్‌లోనే బెస్ట్ బర్త్‌డే అవ్వాలి……….. !! ప్రెజెంట్ ప్యాక్ అయిపోయింది పదా, వెళ్తూ వెళ్తూ డెకరేషన్ ఐటమ్స్, ఆ కేక్ ఆర్డర్ కూడా ఫినిష్ చేసేద్దాం అంటూ భూమి ముఖంలో ఆనందంతో గిఫ్ట్ ప్యాక్ అందుకుంది……….. !! ఒకే అని ఇద్దరూ నవ్వుకుంటూ రేపటి సర్ప్రైజ్ ప్లాన్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ మాల్ నుండి బయటకు అడుగులు వేశారు………. !! చెప్పు భూమి ప్రియేష్‌కి ఏం గిఫ్ట్ తీసుకుందాం వాచ్‌ తీసుకుందామా లేక మంచి షర్ట్ తీసుకుందామా అని అడుగుతుంది అను……… !! 
ప్రియేష్‌కి సింపుల్ అండ్ క్లాసీగా ఉండేవి ఇష్టం అను………..!! తను ఎప్పుడూ హడావుడి ఇష్టపడడు సో తన కోసం ఒక మంచి బ్రాండెడ్ వాచ్ అండ్ ఒక కూల్ షర్ట్ తీసుకుందాం అంది భూమి చిరునవ్వుతో………… !! అలా 
షాపింగ్ చేస్తూ ఇద్దరూ తమ గతాన్ని, తమ ఫ్రెండ్షిప్ ను గుర్తుచేసుకున్నారు………. !! భూమి జాబ్ లో చేరిన కొత్తలో ఈ హైదరాబాద్ అంతా తనకు కొత్తగా, కాస్త భయంగా అనిపించేది………. !! కానీ ఆ ఆఫీసులోనే పరిచయమైన అను, ప్రియేష్‌లు భూమి జీవితాన్ని పూర్తిగా మార్చేశారు……… !! ముగ్గురి మనస్తత్వాలు వేరైనా, ఆలోచనలు మాత్రం ఒకటే ……… !! అందుకే కొద్దిరోజుల్లోనే ముగ్గురూ ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు……… !! 
అను కుటుంబ బాగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ……….!! వాళ్ళ నాన్నగారు పెద్ద బిజినెస్ మెన్ అయినప్పటికీ అనులో ఏమాత్రం గర్వం ఉండేది కాదు………. !! చాలా సాధారణంగా, ప్రతి ఒక్కరితో ప్రేమ్‌గా మాట్లాడేది………… !? అనుకి భూమి, ప్రియేష్ అంటే రెండు కళ్ళు వాళ్ళిద్దరినీ తన సొంత సిబ్లింగ్ లానే చూసుకునేది………… !! 
ఇక ప్రియేష్ విషయానికి వస్తే తన స్టోరీ వింటే ఎవరికైనా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాయి………. !! ప్రియేష్ ఒక అనాథ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి, ఒక ట్రస్ట్ అనాథాశ్రమంలో పెరిగాడు………… !! మెరిట్ స్కాలర్‌షిప్స్ (Merit Scholarships) సాధించి ఎంతో కష్టపడి ఇంజనీరింగ్ చదివాడు……….. !! తన స్వయంకృషితోనే మంచి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడు……… !! హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఎన్నో కష్టాలు పడి తన సంపాదనతో ఒక చిన్న ఫ్లాట్ తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు………. !! ప్రియేష్‌కి ఈ లోకంలో బంధువులు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది భూమి, అను మాత్రమే………!! వాళ్ళిద్దరే అతని కుటుంబం, అతని ప్రపంచం…………. !! 
అయితే ఒక సంవత్సరం నుండి ప్రియేష్ మనసులో ఒక మార్పు వచ్చింది………. !! భూమి యొక్క అమాయకత్వం, తన సహనం, ఎదుటివారి పట్ల ఆమె చూపించే ప్రేమ చూసి ప్రియేష్ ఆమెను ఇష్టపడటం మొదలుపెట్టాడు……….. !! అది కేవలం ఆకర్షణ కాదు, భూమిని తన జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాలనేంత పిచ్చి ప్రేమ……….!!కానీ ఆ విషయం భూమికి చెప్పే ధైర్యం ప్రియేష్ ఎప్పుడూ చేయలేకపోయాడు………. !! 
ఒకవేళ నేను నా ప్రేమ విషయం చెప్పాక భూమి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే……..?? మన మధ్య ఉన్న ఈ అందమైన ఫ్రెండ్‌షిప్ కూడా పాడైపోతే……..?? భూమిని ఫ్రెండ్‌గా కూడా కోల్పోతే నేను తట్టుకోలేన అనే భయం ప్రియేష్‌ను ఎప్పుడూ వెంటాడేది………. !! ఈ విషయం అనుకి కూడా తెలుసు అను చాలాసార్లు ప్రియేష్‌కి ధైర్యం చెప్పేది……… !! రేయ్ ప్రియేష్ భూమికి కూడా నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ధైర్యంగా నీ మనసులో మాట చెప్పు……….. !! తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని అను ఎంత ఎంకరేజ్ చేసినా ప్రియేష్ మాత్రం మంచి టైమ్ చూసి చెప్తానులే అను తొందరేముంది అని ఆపేస్తూ ఉండే వాడు………. !! 
మాల్‌లో షాపింగ్ పూర్తి చేసుకుని ప్రియేష్ కోసం ఒక బ్యూటిఫుల్ వాచ్, డార్క్ బ్లూ షర్ట్, అండ్ కొన్ని గిఫ్ట్స్ ప్యాక్ చేయించారు ఇద్దరూ………. !! అబ్బబ్బా… భూమి ప్రియేష్‌కి ఈ షర్ట్ వేస్తే చాలా బాగుంటాడు కదా అని అను అనగానే ……… !! భూమి నవ్వుతూ అవును అను తనకి బ్లూ కలర్ చాలా సూట్ అవుతుంది ………. !! అలా ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ ఐస్‌క్రీమ్ తింటూ హాస్టల్‌కి తిరిగి వచ్చేశారు……….. !! ఆ రోజంతా రేపటి ప్రియేష్ బర్త్‌డే ప్లాన్స్ గురించి కబుర్లు చెప్పుకుంటూ సరదాగా గడిపారు ………. !! 
Continues 💞