New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నా పరిచయం – 1♥️

నా పరిచయం – 1♥️

hi స్నేహితులారా జీవితం అందరికీ ఒకలా ఉండదు కొంతమంది ఎన్నో అనుకుంటారు ఎన్నో సాధించాలి ఎన్నో ఆశలని నెరవేర్చుకోవాలి అనుకుంటారు కానీ అలా అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది అలానే ఒక అమ్మాయిగా నాకు చాలా కోరికలు చాలా అసలు ఉన్నాయి కానీ అంత దూరం నా కుటుంబం వెళ్ళనివ్వలేదు… 

 

జీవితంలో ఏదైనా ఒక్కసారే వస్తుంది అంటారు అలానే నా లైఫ్ లో నాకు నచ్చ ని కాదు కాదు సర్దుకుపోయే అవకాశ ఇష్టమో కష్టమో కూడా తెలియని వయసులో బంధాన్ని ఏర్పరచు కున్న

 

ప్రతిభంలో తన తోడు తనకు అండగా నిలబడితే సాధిస్తారు కానీ మన ఫ్యామిలీలో ఇలా కుదరదు సర్దుకుపోతూ బతకడమే జీవితం అనే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఇలా అనుకోవడంలో ఒక ఆడపిల్లకు మాత్రమే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ….

 

ఎందుకంటే కుటుంబం కంటే ప్రపంచం మే ఎక్కువ వేలెత్తి చూపిస్తుంది అందుకే ఆ ప్రపంచానికి భయపడి కుటుంబం నీ ఎదిరించలేక తనలో తను నలిగిపోతూ ఎంతో మంది ఆడవాళ్లు వంటగదికే పరిమితమవుతున్నారు అంటే ఒక ఆడపిల్లగా నాలో ఉన్న బాధని గాని సంతోషాన్ని గాని ప్రేమను గాని మోసాన్ని గాని ఎన్నో భావాలు ఎవరో తెలియని స్నేహితులతో పంచుకునే ఒక చిన్న అవకాశం ఉంది అందుకే నా ప్రతి భావన ఈ పదాలలో చూపిస్తున్నాను… 

 

ఎందుకంటే అబ్బాయి అయినా నాకి ఒక కష్టం వస్తే తనకంటూ ఎవరో ఒకరు ఉంటారు ఆడపిల్లలకి అలా కాదు ఇటు ఫ్యామిలీకి చెప్పుకోలేదు అటు తెలిసిన వాళ్ళకి చెప్పుకోలేదు ఫ్రెండ్స్ ఇప్పటిలో అయితే అస్సలు చెప్పలేదు చెప్పినా ఒకవేళ 

 

అది తిరిగి మనకే ఒక ఒక పాము విషం గా మన మీదే వెదజల్లుతారు అందుకే మనుషులను నమ్మే కంటే ఇలా మనిషి తెలియని స్నేహాన్ని నమ్మడం చాలా మంచిది లా అనే నేను అందరిని అన్నాను కానీ జరిగేది మాత్రం అదే ప్రతి మనిషి జీవితంలో ఒకరు ఉంటారు అది స్నేహితులైన లేకపోతే లైఫ్ పంచుకున్న వాళ్లేనా కానీ వాళ్లకు కూడా ఎన్నో విషయాలని ఇలా ఎవరో తెలియని వాళ్ళతో పంచుకుంటారు కదా 

 

అందుకే ఇందులో రాసే ప్రతి కథ కథ ఒక జీవితం గా చాలామంది అర్థం చేసుకుంటారు అలా ఎన్నో జీవితాలు కథల రూపంలో మన ముందుకి తీసుకొస్తున్న ఎంతో మంది రచయితలు వాళ్లలోని భావాలే కథల రూపంలో మనకి తెలుపుతుంటారు కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న పదాలుప్రతి ఒక్కరి మనసుకి హత్తుకునేట్టు ఉంటాయి ఎంతోమంది మనకి తెలియకపోవచ్చు ఈ యాప్ లో కానీ వాళ్ళ కథల ద్వారా మనకి చాలా మంది నా మనసులో దగ్గరికి వచ్చేస్తున్నారు మీ అందరిలో ఒక అమ్మాయిగా నేను కూడా తోడుగా ఉండాలని అనుకుంటున్నాను 

 

ఎక్కడ ఒక చోట ఒక కథ మొదలైంది అంటే అది కచ్చితంగా జరిగే ఉంటుంది లేకపోతే జరగబోయే ఏదైనా అయి ఉంటుంది కానీ కథ అనేది మాత్రం కల్పితం కాదు అని నేను నమ్ముతాను కానీ నిజజీవితంలో చేయలేని ఎన్నో పనులు గాని మనలో నేను రావాలి గాని ఈ కథల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూనే ఉంటాం ఒక మనిషి గురించి తెలియాలంటే తన పక్కన ఉంటేనే కాదు తన ప్రతి మాటలను ప్రతి పథంలోనూ ప్రతి భావంలోనూ అర్థం చేసుకోగలుగుతాం అంత గొప్పగా ఇలాంటి ఎన్నో పదాలు రాసిన ఎంతో మంది రచయితల మనసులను కూడా మనం అర్థం చేసుకోగలం ఒక మనిషి గురించి తెలియాలి అంటే 

 

 

తన గురించి తన పక్కన ఉండి తనని గమనిస్తూ ఉండాల్సిన అవసరం లేదు కానీ భావాన్ని తెలిపితే చాలు తానేంటో అర్థం అవుతుంది అని నేను నమ్ముతాను అలాంటి గొప్ప గొప్ప కథలు కొన్ని బంధాలతో  కూడిన కథలు ఇంకొన్ని ప్రేమ తో కూడిన కథలు ఇంకొన్ని మోసంతో కూడిన కథలు కానీ ప్రతి కథ లో ఎంతో గొప్ప అర్థాలు ఉంటాయి అలానే ఎంతో జీవితాలకి కనెక్ట్ అయి ఉంటుంది 

 

ఇలా ప్రతి కథకి ఒక గుర్తింపు  గుర్తింపుకు తగ్గ విలవ  ఇంతకుమచి   ఏమీ ఆశించని ఎంతోమంది లైఫ్లో ఏమీ సాధించలేక అవ్వాలి అనుకున్న ఎంతోమంది ఇలా చిన్నచిన్న వాటిలో సంతోషం పొందుతున్నారు మన నుంచి వాళ్ళు ఏమి ఆశించడం లేదు ఒక చిన్న ప్రోత్సాహం ఆ కథ చదివిన తర్వాత మనలో కలిగిన భావం ఇంతే ఇంకేమీ అక్కర్లేదు…

 

ఇలానే ఎంతోమంది ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరికి చేరువవుతున్నారు అలానే నన్ను మీలో ఒక దానికా చూస్తారని అనుకుంటున్నాను ఇప్పటిదాకా ఎన్నో పాత్రలు వహించిన నేను ఒక ఒక కూతురిగా ఒక సోదరిగా ఒక భార్యగా ఒక తల్లిగా ఒక కోడలిగా ఇలా ఎన్నో పాత్రలు వహించిన నేను నా పాత్రలని మీ ముందుకు తీసుకొస్తున్నాను సంతోషంగా నన్ను కూడా మీలో ఒక దాన్ని చేసుకుంటారని కోరుకుంటున్నాను 🙏                             

 

                                         mouni🥰