నా రాక్షసుడు 😈🔥 – 1
నా రాక్షసుడు 😈🔥
I’m owned by the monster 🔥
అనన్య – క్యూట్, మిడిల్ క్లాస్, అమాయకమైన అమ్మాయి. కలలో కూడా అనుకోలేదు తన జీవితంలోకి ఒక రాక్షసుడు వస్తాడని.
రుద్ర – 1000 కోట్ల సామ్రాజ్యానికి వారసుడు, కోల్డ్, రూత్లెస్, డార్క్ వరల్డ్ కింగ్ 👑 .. అతను అనుకుంటే అది జరగాల్సిందే. అతని నిఘంటువులో NO అనే పదమే లేదు.
ఒక రోజు… ఒక వర్షం… ఒక తప్పుడు కలయిక…
ఆమె అతని ఆస్తి అయిపోయింది.
“Every inch of you is mine” – అతని డార్క్ డైలాగ్.
ఆమె తప్పించుకోగలదా? లేక ఆ రాక్షసుడికే సొంతం అయిపోతుందా?
ఇది సాధారణ ప్రేమ కథ కాదు… ఇది ఒక రాక్షసుడి ప్రేమ కథ.
హైదరాబాద్ – బంజారా హిల్స్ రోడ్ నెంబర్ రాత్రి 11 గంటలు. వర్షం పడుతోంది భయంకరంగా.
ఒక అమ్మాయి రోడ్డు మీద పరిగెత్తుతోంది. పేరు అనన్య. వయసు 23. ఒక ఊరు నుంచి హైదరాబాద్ వచ్చింది జాబ్ కోసం. చేతిలో ఒక చిన్న బ్యాగ్, చీర కట్టుకుంది ఎరుపు రంగు, జుట్టు చెదిరిపోయి, కళ్ళలో భయం.
వెనుక నలుగురు రౌడీలు తరుముతున్నారు, “ఏయ్ పిల్లా ఆగు, ఎక్కడికి పరిగెడతావు?” అని.
అనన్య ఏడుస్తూ పరిగెడుతోంది, కాలు జారి రోడ్డు మీద పడిపోయింది. రౌడీలు దగ్గరికి వచ్చారు.
అప్పుడే ఒక పెద్ద నల్ల కారు వచ్చి ఆగింది. బెంజ్. నెంబర్ 0001. కారు తలుపు తెరుచుకుంది. ఒక అబ్బాయి దిగాడు.
నల్ల సూట్, నల్ల షర్ట్, 6 ఫీట్ హైట్, కళ్ళు ఎరుపు రంగులో, గడ్డం, చేతిలో సిగరెట్, చూస్తేనే రాక్షసుడు లాగా.
అతని పేరు రుద్ర. వయసు 28. హైదరాబాద్ మాఫియా కింగ్. పేరు వింటేనే అందరూ భయపడతారు. అమ్మాయిల జోలికి వెళ్ళడు, కానీ తన కోసం ఆగడు..
రుద్ర రౌడీల వైపు చూసి ఒక్క మాట అన్నాడు, “ఏయ్”.
ఆ ఒక్క మాటకే నలుగురు రౌడీలు వణికిపోయారు.
“రు… రుద్ర అన్నా, మేము… మేము…” అని వణుకుతూ.
రుద్ర దగ్గరికి వచ్చి, ఒకడి కాలర్ పట్టుకుని, “ఈ పిల్ల నా ఏరియాలో ఎందుకు ఏడుస్తోంది? నా రోడ్డు మీద?” అన్నాడు, గొంతు చాలా నెమ్మదిగా, కానీ భయంకరంగా.
రౌడీ “అన్నా తెలియదు అన్నా, ఈ పిల్ల…” అని చెప్పేలోపే రుద్ర ఒక్క పంచ్ ఇచ్చాడు, వాడు కింద పడిపోయాడు, మిగతా ముగ్గురు పారిపోయారు.
అనన్య రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది, వణుకుతూ.
రుద్ర అనన్య వైపు చూసాడు. ఫస్ట్ టైం ఒక అమ్మాయిని అలా చూసాడు. ఎరుపు చీర, తడిచిపోయి, కళ్ళు పెద్దవి, భయంతో, అమాయకంగా తననే చూస్తుంది.
రుద్ర మనసులో ఒక్క మాట, “నాది”.
అనన్య లేవబోయింది, కాలు నొప్పి, “అమ్మా” అని అరిచింది.
రుద్ర దగ్గరికి వచ్చి, అనన్యని లేపకుండా, చేతుల్లోకి ఎత్తుకున్నాడు, ప్రిన్సెస్ లాగా.
అనన్య షాక్, “ఏయ్, ఎవరు నువ్వు? నన్ను దించు, నన్ను ముట్టుకోకు” అని కొట్టబోయింది.
రుద్ర అనన్య కళ్ళలోకి చూసి, “ష్, అరవకు, నేను నిన్ను ఏం చేయను, కానీ నిన్ను ఇక్కడ వదలను, నా కారులో కూర్చో” అన్నాడు.
అనన్య “నేను రాను, నువ్వు ఎవరు? రౌడీవా?” అంది.
రుద్ర నవ్వాడు, ఫస్ట్ టైం నవ్వాడు, “అవును, నేను రాక్షసుడిని, నీ రాక్షసుడిని” అన్నాడు, అనన్యని కారులో కూర్చోబెట్టాడు.
కారులో – ఏసీ, వర్షం శబ్దం, అనన్య భయంతో వణుకుతోంది.
రుద్ర డ్రైవ్ చేస్తూ, “పేరు ఏంటి?” అని అడిగాడు.
అనన్య చెప్పలేదు.
రుద్ర “పేరు చెప్పకపోతే నేనే పేరు పెడతా, బుజ్జి అని” అన్నాడు.
అనన్య “అనన్య, నా పేరు అనన్య” అంది భయంతో.
రుద్ర “అనన్య, బాగుంది, నా అనన్య” అన్నాడు.
అనన్య “నీ అనన్య కాదు, నేను ఎవరిదీ కాదు” అంది ధైర్యంగా.
రుద్ర కారు ఆపాడు, అనన్య వైపు తిరిగి, దగ్గరికి వచ్చి, “నువ్వు ఇప్పటి వరకు ఎవరిదానివి కాదు, ఇప్పటి నుంచి నాదానివి, నా సొంతం, అర్థమైందా?” అన్నాడు, కళ్ళలోకి చూస్తూ, చాలా దగ్గరగా.
అనన్య “నీకు పిచ్చా? నేను నీకు తెలియదు, నువ్వు నాకు తెలియదు, ఎలా నీ సొంతం అవుతాను?” అంది ఏడుస్తూ.
రుద్ర “తెలియాల్సిన అవసరం లేదు, నాకు నచ్చావు, అంతే, నాకు నచ్చింది నాది అవ్వాలి, అది నా రూల్” అన్నాడు, అనన్య చెంప మీద చేయి వేసాడు, నెమ్మదిగా.
అనన్య చేయి తీసేసి “వద్దు, ముట్టుకోకు” అంది.
రుద్ర “ఇప్పుడు వద్దు అంటున్నావు, రేపు నువ్వే ముట్టుకోమంటావు, చూద్దాము” అన్నాడు, కారు స్టార్ట్ చేసాడు.
అనన్య “నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నన్ను వదిలేయ్, నేను హాస్టల్ కి వెళ్ళాలి” అంది.
రుద్ర “హాస్టల్ లేదు, ఇప్పటి నుంచి నువ్వు నా ఇంట్లో ఉంటావు, నా కళ్ళ ముందు, నా ఇంట్లో, నా గదిలో” అన్నాడు.
అనన్య షాక్, “నీ ఇంట్లోనా? నేను రాను, నేను అరవతా, పోలీసులకి చెప్తా” అంది.
రుద్ర “అరవు, పోలీసులు కూడా నా మనుషులే, ఈ హైదరాబాద్ నాది, నువ్వు కూడా” అన్నాడు.
కారు ఒక పెద్ద బంగ్లా ముందు ఆగింది, బంజారా హిల్స్ లో, పెద్ద గేట్, గార్డ్స్.
రుద్ర అనన్యని మళ్ళీ చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళాడు, అనన్య కొట్టుకుంటూ, “వదిలేయ్, రాక్షసుడా, వదిలేయ్” అని.
ఇంట్లో – పెద్ద హాల్, నల్ల కలర్ ఇంటీరియర్, చీకటిగా.
రుద్ర అనన్యని సోఫాలో కూర్చోబెట్టి, “ఇది నీ ఇల్లు, ఇప్పటి నుంచి, నీకు ఏం కావాలన్నా అడుగు, కానీ బయటికి వెళ్ళాలని మాత్రం అడగకు, నువ్వు నా సొంతం, you’re Owned by the Monster” అన్నాడు.
అనన్య ఏడుస్తూ “నువ్వు రాక్షసుడివి, నిజంగా రాక్షసుడివి” అంది.
రుద్ర అనన్య దగ్గరికి వచ్చి, కన్నీళ్ళు తుడిచి, “అవును, నేను రాక్షసుడిని, నీ రాక్షసుడిని, నీకు మాత్రమే” అన్నాడు, నుదుటి మీద కిస్ పెట్టబోయాడు, అనన్య పక్కకి జరిగింది.
రుద్ర “పర్లేదు, ఈ రోజు వద్దు అంటున్నావు, తర్వాత నువ్వే వస్తావు, నా దగ్గరికి” అని, లేచి వెళ్ళిపోయాడు, తలుపు లాక్ చేసి.
అనన్య ఒంటరిగా, పెద్ద ఇంట్లో, ఏడుస్తూ, “అమ్మా, నన్ను ఈ రాక్షసుడి నుంచి కాపాడు” అని.
రేపు ఏం జరుగుతుంది? రుద్ర అనన్యని ఏం చేస్తాడు? అనన్య తప్పించుకుంటుందా? లేక రాక్షసుడిని ప్రేమిస్తుందా?
😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈😈
ఇట్స్ మై న్యూ స్టోరీ
ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ఫాలో మీ.
కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయం తెలుపండి.
రవళి ..
Swipe left/right or tap the sides to turn pages