New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నిన్ను చూసిన క్షణం 🤍

నిన్ను చూసిన క్షణం 🤍

మిడ్‌నైట్… చుట్టూ ఎక్కడ చూసినా మంచు ముత్యాల్లా రాలిపోతున్నాయి …
 చలిగాలి మెల్లగా వీస్తుంటే, ఆ మంచు తెరల మధ్య ప్రకృతి ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది….
అంతటి చలిలో కూడా వైట్ కలర్ చుడీదార్ వేసుకుని, అందమైన చిరునవ్వుతో మెల్లగా నడుస్తున్నాను….
నా చుట్టూ కురుస్తున్న మంచుతో పోటీ పడుతూ నా అడుగులు ముందుకు సాగుతున్నాయి…
 రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. చుట్టుపక్కల ఎవరూ లేరు…
ఆ నిశ్శబ్దంలో మంచు కురుస్తున్న శబ్దం కూడా ఎంతో మధురంగా అనిపిస్తోంది….
ఆకాశం నుంచి జారిపడుతున్న మంచు ముత్యాలు నా మీద పడుతుంటే, ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నాను…
వైట్ డ్రెస్‌లో మంచు మధ్య నడుస్తున్న నన్ను చూస్తే, ఈ భూమి మీదకు దిగివచ్చిన ఏంజెల్‌లా అనిపిస్తుందేమో!
నా చిరునవ్వులో పసిపిల్లల అమాయకత్వం ఉందని నా ఫ్రెండ్స్ అంటుంటారు….
 గాలికి ఎగురుతున్న నా జుట్టును సరిచేసుకుంటూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను….
కానీ నా వెనక ఇద్దరు ప్రాణాలు మాత్రం చలికి వణికిపోతూ నన్ను తిట్టుకుంటున్నారు….
అవును! నా ప్రాణ స్నేహితులు సత్య, అను నా వెనకే వస్తున్నారు…
సత్య: ఏంటే మధు! నీకు ప్రకృతి అంటే ఇష్టం, మంచు అంటే ఇష్టం…

 సరే! మరి మమ్మల్ని ఎందుకే ఇలా చంపుతున్నావ్? పాపమే మేము రాక్షసి 
అను: ఇప్పుడు టైమ్ ఎంతైందో తెలుసా, రాక్షసి? ఇంత చలిలో ఇక్కడే ఉంటే మేమిద్దరం గడ్డకట్టుకుపోతాం. 
అప్పుడు నువ్వు హ్యాపీగా మంచును ఎంజాయ్ చేసుకోవచ్చు!
వాళ్ల మాటలకు నాకు నవ్వాగలేదు. ముద్దుగా నవ్వుతూ ఇద్దరి వైపు చూశాను….
నేను: అయ్యో! నా బేబీస్‌కి ఎంత కష్టమొచ్చిందే! రండి రండి, నా బంగారు తల్లులూ!
సత్య: నీ ముద్దు మాటలతోనే అందరినీ పడేస్తావు రాక్షసి! నిన్ను చూస్తే చాలు, మా కోపం మొత్తం మాయమైపోతుంది.
అను: మధూ! మిడ్‌నైట్‌కి బయటికి వచ్చాం. ఇప్పుడు నాలుగు గంటలైంది….
ఇంకాసేపు ఉంటే తెల్లారిపోతుంది. నీకు మీ నాన్న సపోర్ట్ ఉంది. మరి మాకు ఎవరు ఉన్నారు బేబీ?
నేను: మీ నాన్నల సంగతి నేను చూసుకుంటానులే!
సత్య: ముందు మా అమ్మ సంగతి చూడు. తెల్లవారేసరికి ఇంటికి వెళ్లకపోతే చీపురుకట్టతో తిరగబడుతుంది నామీద . పదవే, వెళ్దాం!
నేను: ఇంకా కాసేపు ఉండొచ్చుగా!
అను: ఇంకా కాసేపా? బాబోయ్ మధూ! నీకు దండం పెడతాను. రేపు మళ్లీ వద్దాం. ఇప్పుడు పద!
నేను బుంగమూతి పెట్టుకుని మరోవైపు తిరిగాను.
సత్య: ఏంటే అను, ఇప్పుడు ఇది అలిగింది!
అను: అలిగావా పాపా? సరే, నువ్వు వస్తే రా. లేకపోతే మేము వెళ్తాం!
నేను: హ్మ్! సరే, వస్తాను.
సత్య: హిహిహి! అలిగినప్పుడు కూడా ఎంత క్యూట్‌గా ఉంటావే!
నేను: సరే, అయితే ఐస్‌క్రీమ్ తిందామా?
అను, సత్య: ఏంటి? ఈ చలిలో ఐస్‌క్రీమా?!
నేను: ఉహు… ఉహు… నాకు కావాలి!
సత్య: అసలు నీ కంటికి మేమెలా కనిపిస్తున్నామే? ఒక్కసారి గట్టిగా అరిస్తే సరిపోతుంది!
నేను: మ్మ్… నా బేబీస్ ఇద్దరూ చాలా ముద్దుగా కనిపిస్తున్నారు!
వాళ్లిద్దరూ కోపంగా నా వెనక పరుగెత్తుకొచ్చారు.
అను: ఒసేయ్ మధూ! ఆగవే! దొరికావంటే నీ పని అయిపోయిందే!
నేను: హిహిహి! రండి రండి! నన్ను పట్టుకోండి!
నేను నవ్వుకుంటూ పరుగెత్తాను. వాళ్లిద్దరూ నన్ను పట్టుకోవడానికి వెంబడించారు... కాసేపటికి అలసిపోయి నేను ఆగిపోయాను….
అదే అదనుగా తీసుకుని సత్య, అను పరుగున వచ్చి నన్ను చుట్టుముట్టారు…
సత్య: దొరికావా రాక్షసి! ఎంత పరిగెత్తించావే మమ్మల్ని!
అంటూ నా నడుము పట్టుకుని ఆయాసం తీర్చుకుంటోంది…
నేను వెంటనే క్యూట్‌గా నవ్వుతూ  చెవులు పట్టుకుని 
 సారీ చెప్పాను…
నేను: సారీ నా బేబీస్! మీరు చాలా మంచివాళ్లు. గుడ్ గర్ల్స్!
అను: ఇలాంటి ముద్దు మాటలతోనే అందరినీ పడేస్తావు రాక్షసి!
సత్య నా బుగ్గ మీద ముద్దు పెట్టింది. అను కూడా  నాకు మరోపక్క వచ్చి  నా  బేబీ అని మరో బుగ్గ మీద ముద్దు పెట్టింది ….
ఆ క్షణంలో నాకు చాలా సంతోషంగా అనిపించింది… నేను కుడా నా బేబీస్ కి బుగ్గలు మీదా ముద్దు పెట్టాను ఇద్దరికి ..
నేను: నా మదిలో ఆలోచన ఎందుకో ఈమధ్య మేము దూరంగా ఉన్నట్టు కలలు వస్తున్నాయి…
 అదే విషయం వాళ్ళకి చెప్పకుండా  మాములుగా అడిగాను ..  ” సత్యా… అను… మనం ఎప్పటికీ విడిపోముగా?
నా మాట వినగానే వాళ్లిద్దరి ముఖాల్లోని నవ్వు మాయమైంది…
అను: ఇప్పుడెందుకే అలాంటి మాటలు మాట్లాడుతున్నావ్? ఏమైంది మధూ?
సత్య: మన ముగ్గురం ఎప్పటికీ విడిపోం. మనం ముగ్గురం ప్రాణ స్నేహితులం కదా!
నేను: ఏమోనే… ఎందుకో మీ ఇద్దరినీ వదిలి ఉండాల్సి వస్తుందేమోనని బెంగగా ఉంది. నాకు ఎప్పుడూ మీతోనే ఉండాలని ఉంది…
వాళ్లిద్దరూ నా చేతులు పట్టుకున్నారు… 
అను: అలా ఏమీ జరగదు బంగారం. అయినా ఉన్నట్టుండి నీకు ఇలాంటి ఆలోచనలు ఎందుకొచ్చాయి?
సత్య: సరే, నీకంత బాధగా ఉంటే ఒక పని చేద్దాం. ముగ్గురం ఒకే మొగుణ్ణి చేసుకుందాం! అప్పుడు ఎప్పటికీ కలిసే ఉండొచ్చు!
అను: బేబీ, నీకేమైనా అభ్యంతరమా?
నేను: మీ ఇద్దరికీ ఓకే అయితే నాకూ ఓకే!
వాళ్లిద్దరూ ఒకేసారి కన్నుకొట్టి నన్ను ఆటపట్టించారు.
సత్య, అను: మాకు ఇష్టమే మధు బంగారం! నీదే లేట్!
నేను: ఛీ! ఆపండి మీ వేషాలు! పోండి, నాకు మీరెవరూ వద్దు!
మేము ముగ్గురం ఒకరినొకరం చూసుకుని పగలబడి నవ్వుకున్నాం…
అలా సరదాగా ఐస్‌క్రీమ్ తిని, సత్య, అను ఇద్దరూ నాతోపాటు మా ఇంటికి వచ్చారు…
మాకు ఇదేమీ కొత్త కాదు. రాత్రిపూట ఒకరి ఇంట్లో మరొకరం ఉండటం ఎన్నోసార్లు  ఉన్నాము ..
ఎవరైనా అడిగితే, సత్య వాళ్లింట్లో ఉన్నానని నేను  సత్య అను ఏమో మా ఇంట్లో ఉన్నాము అని వాళ్లు చెబుతారు….
హిహిహి! మేము చాలా మంచి పిల్లలం కదా!
నా ఫ్రెండ్స్ నా ప్రాణం. వాళ్లకి నేనంటే ప్రాణం. మా ముగ్గురి స్నేహం ఇలాగే జీవితాంతం కొనసాగుతుందా?
 లేక కాలేజీ జీవితం మా జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకొస్తుందా?
🤍🤍🤍🤍🤍
హే క్యూటీస్  థిస్ ఇస్ మై ఫస్ట్  న్యూ స్టోరీ 
 మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను ☺️☺️
మధు, సత్య, అను అల్లరి చూడాలంటే స్టోరీని ఫాలో అవ్వండి. 😉😉
 మీ కామెంట్స్, రేటింగ్స్‌తో నన్ను ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 😘😘