New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
నిన్ను చూసిన క్షణం 🤍 – 2

నిన్ను చూసిన క్షణం 🤍 – 2

 ఉదయం 8:00 గంటలు…

మధు 
అమ్మా…… ఇంకో ఐదు నిమిషాలే ప్లీజ్! 😴
అంటూ దుప్పటిని పూర్తిగా మీదకు లాక్కుని మళ్లీ నిద్రలోకి జారుకున్నాను.
అంతలో…
ధడామ్!
నా గది తలుపు గోడకు తగిలిన శబ్దానికి ఉలిక్కిపడి లేచాను.
ఎదురుగా మా నాన్నగారు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు.
నాన్న: మధూ… టైమ్ ఎంతైందో తెలుసా తల్లీ?
నేను: (కళ్ళు నలుపుకుంటూ) గుడ్ మార్నింగ్ నాన్నా… 🥱
నాన్న: గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ బై చెప్పేలా ఉన్నావ్ కాలేజీకి! ఇంకో పది నిమిషాల్లో రెడీ కాకపోతే ఈరోజు ఇంట్లోనే ఉండు.
నేను: అబ్బా నాన్నా! 😳
అంటూ ఒక్కసారిగా మంచం మీద నుంచి దూకాను.
నేను: నాన్నా… నా ఫ్రెండ్స్ ఎక్కడ?
నాన్న: నీకంటే ముందే లేచి రెడీ అయిపోయారు. నిన్ను లేపలేక ఇద్దరూ కింద కూర్చుని నీ మీద కంప్లైంట్స్ ఇస్తున్నారు.
అంతే! నా పరువు మొత్తం పోయినట్టే! 😂
నేను: ఆ ఇద్దరూ నా ఫ్రెండ్సా? శత్రువులా?
నాన్న: ముందు నువ్వు తయారవ్వు తల్లీ. తర్వాత వాళ్లతో యుద్ధం చేసుకో!
అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు.
నేను మాత్రం బాత్రూమ్‌లోకి పరుగెత్తాను.
@@@
 కింద హాల్లో…
సత్య, అను ఇద్దరూ సోఫాలో కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారు.
సత్య: అంకుల్! మీ అమ్మాయికి ఒక మంచి అవార్డు ఇవ్వాలి.
నాన్న: దేనికి తల్లీ?
సత్య: ప్రపంచంలోనే అత్యంత బద్ధకస్తురాలు అయినందుకు! 😂
అను: ఆ అవార్డుతో పాటు నిద్రలోనే కాలేజీకి వెళ్లగలిగే బెస్ట్ టాలెంట్ అవార్డు కూడా ఇవ్వాలి అంకుల్!
నాన్న: హహహా! నిజమేనమ్మా!
అప్పుడే మెట్ల మీద నుంచి నా గొంతు వినిపించింది.
నేను: ఏయ్… మీ ఇద్దరూ ఆగండే! 😤
వాళ్లిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.
నేను కిందకు వచ్చి వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాను.
నేను: అసలు మీకు సిగ్గుందా? నా ఫ్రెండ్స్ అయి ఉండి నన్నే తిడతారా?
సత్య: నువ్వు మా ఫ్రెండ్‌వే కాబట్టి తిడుతున్నాం. లేకపోతే నిన్ను లేపడానికి మా విలువైన నిద్రను ఎందుకు త్యాగం చేస్తాం చెప్పు? 😌
అను: అవును బేబీ! నీ మీద మాకున్న ప్రేమను నువ్వు అర్థం చేసుకోవాలి.
నేను: ఛీ! మీ ప్రేమా… మీ తలకాయా!
అంటూ ఇద్దరి మధ్యలో కూర్చున్నాను.
వెంటనే సత్య నా బుగ్గ గిల్లింది.
సత్య: అబ్బో! మా బంగారు తల్లికి కోపం వచ్చిందే!
నేను: వదలవే! బుగ్గలు నొప్పి పెడుతున్నాయి!
అను: అయ్యో పాపం! మా బేబీకి నొప్పి వచ్చిందా?
అంటూ మరో బుగ్గ గిల్లింది.
నేను: అమ్మా… నాన్నా… నన్ను ఈ రాక్షసుల నుంచి కాపాడండి! 🤣
నాన్న మమ్మల్ని చూసి నవ్వుతూ తల ఊపారు.
నాన్న: మీ ముగ్గురినీ ఒకే కాలేజీలో చేర్పించడం నా తప్పేమో!
మేము ముగ్గురం ఒకేసారి…
మేము: అవును అంకుల్! 😂😂
అంటూ పగలబడి నవ్వుకున్నాం.
🤍🤍🤍🤍🤍
మా నాన్న డ్రైవర్‌తో కారును పంపించారు.
కారులో కూర్చున్నాక కూడా మా అల్లరి ఆగలేదు.
సత్య: మధూ… ఈరోజు కాలేజీలో కొత్త స్టూడెంట్స్ వస్తున్నారట!
నేను: అయితే?
అను: అయితే ఏంటే? అందులో హ్యాండ్సమ్ బాయ్స్ ఉంటే మన కాలేజీ కళకళలాడిపోతుంది! 😜
నేను: ఓహో! అందుకేనా మీ ఇద్దరూ ఈరోజు ఇంత అందంగా రెడీ అయ్యారు?
సత్య: ఏంటే! మేమెప్పుడూ అందంగానే ఉంటాం.
నేను: అవును… అందగత్తెలు కాబట్టే మీ ఇద్దరినీ నా ఫ్రెండ్స్‌గా సెలెక్ట్ చేసుకున్నాను.
అను: ఆపు బేబీ! నీ పొగడ్తలు వింటే నాకు అనుమానంగా ఉంది.
నేను: ఎందుకే?
అను: నువ్వేమైనా మమ్మల్ని చూసి ఈర్ష్య పడుతున్నావా? 😏
నేను: ఛీ! మీ మొహాలు చూసి ఈర్ష్య పడాలా?
అంటూ వాళ్లిద్దరి మధ్యలో ఉన్న పాప్‌కార్న్ ప్యాకెట్ లాక్కున్నాను.
సత్య: ఒసేయ్! మా పాప్‌కార్న్ ఇవ్వవే!
నేను: ముందు నన్ను పట్టుకోండి!
అంటూ కారు సీట్లోనే అటూ ఇటూ కదులుతూ వాళ్లను ఆటపట్టించాను.
డ్రైవర్ అంకుల్ అద్దంలో మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు.
డ్రైవర్: అమ్మా… కాలేజీకి వెళ్లేలోపు కారునే కాలేజీ గ్రౌండ్ చేయకండి!
ముగ్గురం: హహహహా! 😂
కాలేజీ గేటు దగ్గర…
కారు కాలేజీ గేటు ముందు ఆగింది.
నేను బయటకు దిగగానే చల్లని గాలి నా ముఖాన్ని తాకింది.
తెల్లని చుడీదార్, భుజాల మీదుగా జారుతున్న నా పొడవాటి జుట్టు, పెదవులపై చిన్న చిరునవ్వు…
నేను కాలేజీ వైపు అడుగులు వేస్తుంటే సత్య, అను నా రెండు చేతులు పట్టుకున్నారు.
అను: మధూ… ఈరోజు నుంచి మన కాలేజీ లైఫ్ స్టార్ట్!
సత్య: మనం ముగ్గురం ఒకే క్లాస్‌లో ఉండాలి. ఎవరు ఎక్కడికి వెళ్లినా మిగతా ఇద్దరినీ మర్చిపోకూడదు.
నేను: పిచ్చిదానా! మనం ఎప్పటికీ కలిసే ఉంటాం కదా!
అంటూ వాళ్లిద్దరినీ దగ్గరకు తీసుకున్నాను.
కానీ…
మా మాటలు విన్నట్టుగా, కొంచెం దూరంలో నిలబడి ఉన్న ఒక అబ్బాయి మా వైపు చూశాడు.
అతని చూపు నా మీద ఒక్క క్షణం ఆగిపోయింది.
అతని పక్కనే ఉన్న మరో అబ్బాయి అతని భుజం తట్టాడు.
అబ్బాయి 2: రేయ్ ఆదిత్యా… ఎవర్రా ఆ అమ్మాయి?
ఆదిత్య: తెలియదు.
అబ్బాయి 2: తెలియకపోతే అలా ఎందుకు చూస్తున్నావ్ రా? 😏
ఆదిత్య: నేను చూస్తే నీకేంటి?
అంటూ అతను ముఖం తిప్పుకున్నాడు.
కానీ మరుక్షణమే అతని చూపు మళ్లీ నా వైపే వెళ్లింది.
అదే సమయంలో నేను కూడా అనుకోకుండా అతని వైపు చూశాను.
మా చూపులు ఒక్క క్షణం కలిశాయి.
అతని ముఖంలో ఏదో తెలియని భావం…
నాకు మాత్రం ఎందుకో అతను ఇంతకుముందే పరిచయం ఉన్నవాడిలా అనిపించాడు.
‘వీడెవడో కొత్తగా ఉన్నాడు… కానీ ఎందుకో చూసినట్టుగా అనిపిస్తోందే!’ అని మనసులో అనుకున్నాను.
నేను అతని వైపు చూస్తూ ఉండటం గమనించిన సత్య నా భుజం మీద తట్టింది.
సత్య: ఏంటే మధూ… ఎవర్ని చూస్తున్నావ్? 👀
నేను: ఎవర్నీ చూడట్లేదు!
అను: అబద్ధం! నీ కళ్ళు అటే చూస్తున్నాయి.
నేను: అబ్బా! మీ ఇద్దరికీ ఇంకో పని లేదా?
అంటూ వాళ్ల చేతులు పట్టుకుని లోపలికి లాక్కెళ్లాను.
కానీ వెనక్కి తిరిగి చూసినప్పుడు…
ఆదిత్య ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు.
నన్నే చూస్తూ…
మేము క్లాస్‌రూమ్‌లోకి వెళ్లేసరికి చాలా మంది స్టూడెంట్స్ వచ్చేశారు.
ముగ్గురం చివరి బెంచ్‌లో కూర్చోబోతుండగా…
ఒక గొంతు వినిపించింది.
“ఎక్స్క్యూజ్ మీ… ఈ సీట్ ఖాళీగా ఉందా?”
తిరిగి చూశాను.
ఎదురుగా ఒక అందమైన అబ్బాయి నిలబడి ఉన్నాడు.
నేను: అవును… ఖాళీగానే ఉంది.
అతను కూర్చోబోతుండగా సత్య వెంటనే మాట్లాడింది.
సత్య: సారీ! ఈ సీట్ మా ఫ్రెండ్ కోసం.
అబ్బాయి: మీ ఫ్రెండ్ ఎక్కడ?
సత్య: ఇదిగో… మా మధు!
నేను: ఏంటే?! నేనిక్కడే ఉన్నానే! 😳
అను నవ్వు ఆపుకోలేక నా భుజం మీద వాలిపోయింది.
అబ్బాయి చిరునవ్వుతో నా వైపు చూశాడు.
అబ్బాయి: ఓహ్! అయితే మధుగారి పక్కన కూర్చోవడానికి పర్మిషన్ లేదా?
నేను: పర్మిషన్ కావాలంటే ముందుగా మీ పేరు చెప్పాలి కదా!
అబ్బాయి: నా పేరు విక్రమ్.
నేను: సరే విక్రమ్ గారు… కూర్చోండి.
విక్రమ్: థాంక్యూ, మధుగారు!
అను నా చెవిలో నెమ్మదిగా…
అను: మధూ… మొదటి రోజే పరిచయాలు బాగానే పెంచుకుంటున్నావే! 😉
నేను: నోర్ముయ్!
సత్య: ఏయ్ విక్రమ్! మా మధు చాలా మంచిది. కానీ దానికి కోపం వస్తే మాత్రం…
నేను వెంటనే సత్య నోరు మూసేశాను.
నేను: చాలు! నా గురించి ఇంటర్వ్యూ ఇవ్వడం ఆపు!
విక్రమ్ మమ్మల్ని చూసి నవ్వుకున్నాడు.
విక్రమ్: మీ ముగ్గురి స్నేహం చూస్తుంటే చాలా బాగుంది.
ఆ మాట వినగానే నా ముఖంలో చిరునవ్వు వచ్చింది.
నేను: థాంక్యూ! మేము ముగ్గురం ఎప్పటికీ ఇలాగే ఉంటాం.
కానీ ఆ మాటలు చెప్పినప్పుడు… మా స్నేహాన్ని పరీక్షించే రోజులు ఇంత దగ్గరలో ఉన్నాయని నాకు తెలియదు ??