నిన్ను చూసిన క్షణం 🤍 – 3
ఆదిత్య తన ఫోన్‌లో ఒక పాత ఫోటో చూస్తున్నాడు.
ఆ ఫోటోలో చిన్నపిల్లలా నవ్వుతూ ఉన్న ఒక అమ్మాయి…
ఆమె చేతికి ఒక చిన్న బ్రేస్‌లెట్ ఉంది.
ఆదిత్య ఆ ఫోటోను చూస్తూ నెమ్మదిగా అన్నాడు.
ఆదిత్య: ఇన్నాళ్లకు… నువ్వు కనిపించావు.
అంతలో అతని స్నేహితుడు అక్కడికి వచ్చాడు.
స్నేహితుడు: రేయ్ ఆదిత్యా! ఎవరితో మాట్లాడుతున్నావ్?
ఆదిత్య వెంటనే ఫోన్ లాక్ చేశాడు.
ఆదిత్య: ఎవరితోనూ కాదు.
స్నేహితుడు: ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు రా?
ఆదిత్య కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయాడు.
తర్వాత చిన్నగా నవ్వాడు.
ఆదిత్య: నా గతం.
స్నేహితుడు: అంటే?
ఆదిత్య: తెలుసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్తాను.
అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
కానీ అతని మనసులో మాత్రం ఒకటే ప్రశ్న…
‘మధూ… నువ్వు నన్ను గుర్తుపట్టావా?’
క్లాస్‌లో నేను, సత్య, అను ముగ్గురం కూర్చుని నవ్వుకుంటున్నాం.
విక్రమ్ మా పక్కనే ఉన్నాడు.
కానీ క్లాస్‌రూమ్ తలుపు దగ్గర నిలబడి ఉన్న ఆదిత్య చూపు మాత్రం నన్ను వెతుకుతోంది.
ఒకవైపు నాకు కొత్తగా పరిచయమైన విక్రమ్…
మరోవైపు నన్ను చూసినప్పటి నుంచి ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్న ఆదిత్య…
వీళ్లిద్దరిలో నా జీవితాన్ని మార్చబోయేది ఎవరు?
అసలు ఆదిత్యకు నాకు మధ్య గతంలో ఏదైనా సంబంధం ఉందా?
ముఖ్యంగా… మా ముగ్గురి స్నేహం ముందు నిలబడబోయే మొదటి పర
🤍 మధు • సత్య • అను • ఆదిత్య • విక్రమ్ 🤍
నేను క్లాస్‌లో కూర్చొని పెన్నుతో డెస్క్ మీద ఏదో గీస్తున్నాను.
సత్య నా పక్కన కూర్చుని చిప్స్ తింటోంది. అను మాత్రం అద్దంలో తన జుట్టు సరిచేసుకుంటోంది.
నేను: ఏయ్ సత్యా… నాకు కూడా చిప్స్ ఇవ్వవే! 😋
సత్య: నీ బ్యాగ్‌లో ఉన్నాయిగా!
నేను: అవి నావి కదా! నువ్వు ఇచ్చేవి వేరు! 😂
సత్య: నీకు తినడానికి సిగ్గులేదేంటే?!
నేను: ఆకలికి సిగ్గెందుకే బంగారం! ప్రేమగా ఇవ్వు! 🥹💕
అను: ఛీ ఛీ! మీ ఇద్దరినీ చూస్తుంటే ఫ్రెండ్షిప్ మీదే నమ్మకం పోతోంది!
నేను: నీకు మాత్రం చాలా నమ్మకం ఉన్నట్టుందే! రోజూ నా లిప్‌స్టిక్ తీసుకుని తిరిగి ఇవ్వవు!
అను: అది మన స్నేహానికి గుర్తు!
నేను: అయితే నా చెప్పులు కూడా తీసుకెళ్లి వేసుకో! స్నేహం ఇంకా బలపడుతుంది! 🤣
సత్య పగలబడి నవ్వింది.
అంతలో మా క్లాస్‌లోకి లెక్చరర్ వచ్చారు.
లెక్చరర్: మధూ!
నేను వెంటనే లేచి నిలబడ్డాను.
నేను: యెస్ సార్! 🙋🏻♀️
లెక్చరర్: నేను క్లాస్‌లోకి వచ్చినప్పటి నుంచి మీ బెంచ్ దగ్గరే శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతోంది?
నేను: సార్… మేము చదువు మీద డిస్కషన్ చేస్తున్నాం!
లెక్చరర్: అవునా? మరి ఏ సబ్జెక్ట్?
నేను: సార్… ఫ్రెండ్షిప్ సైన్స్! 😂
క్లాస్ మొత్తం నవ్వులతో మారుమోగిపోయింది.
లెక్చరర్ కూడా నవ్వు ఆపుకుంటూ…
లెక్చరర్: నువ్వు చదువుకుంటున్నావా? లేక కాలేజీని ఎంటర్‌టైన్ చేస్తున్నావా?
నేను: రెండూ సార్! టాలెంట్‌ని ఒక్కదానికే ఎందుకు పరిమితం చేయాలి? 😌
విక్రమ్ తన బెంచ్ మీద తల పెట్టుకుని నవ్వుతున్నాడు.
లెక్చరర్: సరే మేడమ్! ఇప్పుడు బోర్డు మీద ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పు.
నేను బోర్డు వైపు చూశాను.
ప్రశ్న చూసి నా ముఖంలో నవ్వు మాయమైంది.
నేను: సార్… ఈ ప్రశ్న నిన్ననే పుట్టిందా? 😭
లెక్చరర్: ఏంటి?!
నేను: అదే సార్… నాకు అసలు పరిచయమే లేదు దీనితో!
విక్రమ్: సార్, ఈమెకు ప్రశ్నతో పరిచయం చేయడానికి నేను హెల్ప్ చేస్తాను!
నేను వెనక్కి తిరిగి అతన్ని చూశాను.
నేను: ముందు నీకు పరిచయం ఉందో లేదో చెప్పు, హీరోగారూ! 😏
క్లాస్ మళ్లీ నవ్వులతో నిండిపోయింది.
లెక్చరర్: ఇద్దరూ కూర్చోండి! నా క్లాస్‌ని కామెడీ షో చేయకండి!
నేను: ఓకే సార్! ఇంటర్వెల్‌లో కొనసాగిస్తాం! 🤭
విక్రమ్: మధూ… నీకు భయం అనేదే లేదా?
నేను: ఉంది!
విక్రమ్: దేనికి?
నేను: ఇంట్లో అమ్మకి! మిగతావన్నీ నా ముందు చిన్నవే! 😂
విక్రమ్ నవ్వుతూ నా వైపు చూశాడు.
విక్రమ్: నువ్వు చాలా డేంజర్ అమ్మాయివి!
నేను: థాంక్యూ! ఈ విషయం మా కాలేజీ నోటీస్ బోర్డులో పెట్టించు! 🤣
ఇంటర్వెల్ బెల్ మోగగానే మేము ముగ్గురం క్యాంటీన్‌కి పరుగెత్తాం.
సత్య: మధూ! నాకు సమోసా కావాలి!
అను: నాకు పానీపూరీ!
నేను: నాకు బిర్యానీ కావాలి!
సత్య, అను ఇద్దరూ నన్ను ఒకేసారి చూశారు.
సత్య: ఏంటే?! ఇది క్యాంటీన్! పెళ్లి భోజనాల హాల్ కాదు!
నేను: నా కలలకి కూడా లిమిట్స్ పెట్టేస్తారా? 😭
అంతలో విక్రమ్ మా దగ్గరకు వచ్చాడు.
విక్రమ్: ఏంటి మేడమ్‌లు? ఏదైనా పార్టీనా?
నేను: అవును. మా ఆకలికి వీడ్కోలు పార్టీ!
విక్రమ్: సరే, ఏం కావాలో చెప్పండి. నేను తీసుకొస్తాను.
నేను వెంటనే చేతులు జోడించాను.
నేను: దేవుడా! ఇన్నాళ్లకు ఒక మంచి మనిషిని చూపించావు! 😂
విక్రమ్: ఆగు ఆగు! నేను ఏం కొనిపెడతానో ఇంకా చెప్పలేదు!
నేను: పర్లేదు. మంచి మనిషివని సర్టిఫికెట్ ఇచ్చేశాను. ఇప్పుడు వెనక్కి తగ్గితే నీ పరువే పోతుంది! 😌
విక్రమ్ నవ్వుతూ అందరికీ స్నాక్స్ తీసుకొచ్చాడు.
నేను నా ప్లేట్‌లోని సమోసా తీసుకుని తినబోతుండగా…
వెనక నుంచి ఒక చేయి వచ్చి నా సమోసా ఎత్తుకెళ్లింది!
నేను ఒక్కసారిగా తిరిగాను… షాక్ నేను ఎవరు ??
🤍🤍🤍🤍
మధు అల్లరి మీకు నచ్చిందా? 😂😂
Swipe left/right or tap the sides to turn pages