నువ్వే కావాలి ❤️ – 2
“చాలా థాంక్స్ అక్క… నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను” అని చెప్పడంతో “ఇంత చిన్న విషయానికి అంతా పెద్ద మాట ఎందుకులే… బెస్ట్ ఆఫ్ లక్” అని చెప్పి ఫోన్ కట్ చేసింది ఆ అమ్మాయి….
వెంటనే అప్పటికప్పుడు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్లి అక్కడ తన రెస్యూమ్ రెడీ చేయించుకుని నెక్స్ట్ డే ఉన్న ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఇంటికొచ్చేసింది…
యూట్యూబ్ ఓపెన్ చేసుకుని కొన్ని బేసిక్ వీడియోస్ చూస్తూ ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అయింది….. ఆరోజు రాత్రి తల్లి సుమతి భోజనానికి పిలిచినా కూడా వస్తున్నాను వస్తున్నానని రాజి చెబుతోంది కానీ అందరూ భోజనం చేశాక కూడా కూతురు బయటకు రాకపోవడంతో కూతురు గదిలోకి వచ్చింది తల్లి….
ఏదో సీరియస్ గా యూట్యూబ్లో చూస్తూ ప్రిపేర్ అవ్వడం చూసి “ఏంటే ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా?” అని అడగడంతో “లేదు!!! రేపు ఇంటర్వ్యూ ఉందని” చెప్పింది….
“ఇంటర్వ్యూ ఉండడం ఏంటని?” ఆవిడ అయోమయంగా అడగడంతో రాజీ సైలెంట్ అయిపోతే “సమాధానం చెప్పవే…. ఎగ్జామ్స్ అయిపోయే వరకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఇంటర్వ్యూలు స్టార్ట్ అవ్వవు అని చెప్పావు కదా…. మరి ఇంత హడావిడిగా ఇంటర్వ్యూ అంటావేంటి… పైగా రేపు అందరూ టూర్ కి వెళ్తూ ఉంటే ఇప్పుడు నీకు ఇంటర్వ్యూ పెట్టేది ఎవరు?” అంది ఆవిడ…..
“ఇంట్లో పరిస్థితులు చూసావు కదమ్మా…. ఒక టూర్ కి డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో డాడీ ఉన్నప్పుడు నేను అయినా సహాయం చేయాలి కదా” అనగానే “నువ్వు ముందు చదువు మీద దృష్టి పెట్టు చాలు…. ఉద్యోగం చేయడానికి ఇంకా టైం ఉందని” అంది ఆవిడ…
“టైం ఇంకా లేదు” అని రాజీ చెప్పడంతో సుమతి కూతురు వైపు చూస్తే “మరొక ఆరు నెలల్లో నాకు జాబ్ రాకపోయిందంటే ఇలాగే నేను మళ్ళీ ఫైల్స్ పట్టుకుని తిరగాలి…. అదేదో ఇప్పటినుంచే ప్రయత్నిస్తే మంచిది కదా” అంది….
“అలా కాదే… చివరి సెమిస్టర్ లో నువ్వు ఎలా ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటే చదువు మీద దృష్టి పోతుంది” అనగానే “అర్థరాత్రి చదువుకుంటాను…. పగలంతా జాబ్ చేసి సాయంత్రం కొద్దిసేపు పడుకుని నైట్ టైం చదువుకుంటాను సరేనా” అంది…..
“నీ ఇష్టం మొండి దానివి…. చెప్పిన ఏ మాట వినిపించుకోవు కదా” అని ఆవిడ కోపంగా భోజనం ప్లేట్ తీసుకొచ్చి “అన్నం తిని ఏమైనా చేసుకో” అని చెప్పి వెళ్ళిపోయింది….
*******************
“బావ!!!!! మందు పార్టీ కావాలని” అడుగుతున్న అత్త కొడుకు వైపు కోపంగా చూసి “డోంట్ యూ హావ్ టైం సెన్స్ ఇడియట్….” అన్నాడు విరాట్…
ఆరడుగుల కటౌట్ తో, శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించేలా, అమ్మాయిల గుండెల్లో సెగలు రప్పించేలా ఉంటుంది విరాట్ స్వరూపం….
వన్ ఆఫ్ ది ఇండియాస్ టాప్ మోస్ట్ బిజినెస్ మాన్ శేఖర్ చంద్ర గారి ముద్దుల కొడుకు విరాట్…..
లండన్ లో ఎమ్మెస్ కంప్లీట్ చేసుకుని వచ్చి త్రీ ఇయర్స్ బ్యాక్ తండ్రి హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కి విస్తరించాడు…..
కొడుకు ఎబిలిటీ మీద మొదటి నుంచి శేఖర్ చంద్ర గారికి మంచి నమ్మకం ఉన్నా కూడా ఆ నమ్మకం నుంచి ఒక గర్వాన్ని ఒక కాన్ఫిడెన్స్ ని పెంచాడు విరాట్….
“మందు తాగడానికి టైం ఎందుకురా…. పైగా ఇప్పుడు డిన్నర్ టైం కాబట్టి మంచి టైం” అనగానే “డాడీ మామయ్య చూసారంటే నిన్ను ఇరగ్గొట్టి డాగ్స్ కి వేస్తాడు” అన్నాడు…..
“మావయ్య నేను మందు తాగుతున్నాను లేదంటే డాడీ మందు తాగుతున్నాను అని వాళ్ళ ఎదురుగా చూపించుకుంటూ మందు తాగుతానా ఏంటి? ప్లీజ్ మామ” అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే “ఐ హావ్ టు అటెండ్ మీటింగ్స్ టుమారో…. ఐ డోంట్ హావ్ ఎనీ ఇంట్రెస్ట్ టు డ్రింక్ టుడే” అన్నాడు….
“నువ్వు పెద్ద దొంగవి అని నాకు తెలుసు రా” అన్నాడు విరాట్ అత్త కొడుకు కార్తీక్….
విరాట్ కోపంగా చూడడంతో “నీ రూమ్లో కాస్ట్లీ స్కాచ్ బాటిల్స్ స్టాక్ ఉంటాయని నాకు తెలుసు…. నీకు సీరియస్ గా ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు లేదంటే చిరాకుగా ఉన్నప్పుడు మందు బాటిల్ మీద బాటిల్ కొడతావని కూడా నాకు తెలుసు… నాకు ఏదైనా కొనివ్వాలి అంటేనే ఏడ్చి చస్తావని” అన్నాడు…..
విరాట్ మాత్రం కార్తీక్ మాటలు ఏ మాత్రం పట్టించుకోకుండా తన ట్యాబ్లో బిజినెస్ కి సంబంధించిన డేటా చెక్ చేస్తూ ఉంటే “పోరా” అని కార్తీక్ అలిగినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు…..
విరాట్ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ… ముగ్గురు పెదనాన్నలు ముగ్గురు అత్తయ్యలు శేఖర్ చంద్ర విరాట్ వాళ్ళ నాన్నగారు… ఇలా అందరూ ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటారు….
సో కజిన్స్ అందరూ తరచూ ఒకరి ఇంట్లో ఒకరు కలుస్తూనే ఉంటారు…. విరాట్ కి ఒక అక్క ఉంది…. తను కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంటిలిజెంట్ బిజినెస్ విమెన్ గా పేరు తెచ్చుకుంది….
కంటిన్యూస్!!!!
Swipe left/right or tap the sides to turn pages