“ఆ రికార్డుల్లో ఒక ముఖ్యమైన పేజీ లేదు సార్. ఆ పేజీ కోసం ఇంతకుముందు ముగ్గురు అమ్మాయిలు కూడా వచ్చారట. వాళ్లు తమను జర్నలిస్టులమని చెప్పి, ఆ తేదీకి సంబంధించిన రికార్డులు అడిగారట. చివరికి ఆ పేజీని చింపి తీసుకెళ్లిపోయారట.” ఆ మాటలు విన్న కార్తీక్ కాసేపు మౌనంగా ఉండిపోతాడు. “ఏంటి? హాస్పిటల్ రికార్డుల్లో నుంచి పేజీని చింపి తీసుకెళ్లిపోయారా?” “అవును సార్. ఆ పేజీలో ఏముందో నాకు తెలియదు. కానీ అది మా అక్కకు సంబంధించిన రికార్డు కావడ…