పార్వతి పరిణయం – 1
కొన్ని పరిచయాలు పరిచయాల్లాగే మిగిలిపోతాయి… కొన్ని పరిచయాలు జీవితాన్నే మార్చేస్తాయి. మరికొన్ని పరిచయాలు మాత్రం అసలు కలవకూడదనుకున్న ఇద్దరినీ విధి ఒక్కటిగా కలిపేస్తాయి!
ఒకవైపు పల్లెటూరి వాతావరణంలో పెరిగిన స్వచ్ఛమైన మనసున్న అమ్మాయి పార్వతి. చూడటానికి ఎంతో మెతకగా, మాటకు మాట తిరిగి చెప్పలేని అమాయకత్వం ఉన్నా, తెలివితేటల్లో మాత్రం ఎవరికీ తీసిపోదు. తన కుటుంబం, తన ఊరు, తన వాళ్లే తన ప్రపంచంగా బతికే అమ్మాయి. పెద్దల మాటకు విలువిచ్చే మనస్తత్వం, సంప్రదాయాల మీద గౌరవం, తనకంటూ కొన్ని ఆశయాలు ఉన్న అమ్మాయి.
మరోవైపు… పట్నం జీవితానికి అలవాటుపడిన ఓ మోడరన్ అబ్బాయి. డబ్బు, హోదా, అందం, అహంకారం అన్నీ కలగలిసిన వ్యక్తిత్వం. తన మాటే నెగ్గాలనుకునే మొండితనం, ఎదుటివాళ్లను తక్కువ అంచనా వేసే స్వభావం. ముఖ్యంగా అమ్మాయిలంటే తన చుట్టూ తిరగాలని అనుకునే రకం. అలాంటి వాడి జీవితంలోకి పార్వతి అడుగుపెడితే?
అక్కడ మొదలవుతాయి అసలైన గొడవలు!
పల్లెటూరి పిల్లకు పట్నంలో ఏం పని? అసలు పార్వతి తన ఊరిని, తన వాళ్లను వదిలి నగరానికి ఎందుకు వచ్చింది? ఆమె రాక వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? అనుకోకుండా ఎదురుపడిన ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు మొదలైంది? ఒకరంటే ఒకరికి అస్సలు పడని పరిస్థితి నుంచి వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి?
ఇదంతా ఒక ఎత్తయితే… పార్వతి జీవితంలో మరో పెళ్లి సంబంధం ఉంది. తనకు నచ్చిన వ్యక్తితో, తన కుటుంబం చూసిన సంబంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటుంది. కానీ సరిగ్గా పెళ్లి సమయానికి ఈ మోడరన్ అబ్బాయి ఎందుకు అడ్డుపడ్డాడు? పార్వతికి కాబోయే పెళ్లిని ఆపాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది?
అసలు పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకోవడం వెనుక ప్రేమ ఉందా? పంతం ఉందా? లేక మరేదైనా రహస్యం దాగి ఉందా?
ఇద్దరికీ ఇష్టం లేకుండానే మొదలైన ఓ బంధం… గొడవల మధ్య జరిగిన ఓ పెళ్లి… ఒకరికొకరు నచ్చని ఇద్దరు వ్యక్తులు ఒకే ఇంట్లో, ఒకే జీవితంలో ఎలా ప్రయాణం మొదలుపెట్టారు?
అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే పోరాటంలో ప్రేమ పుడుతుందా? లేక వారి మధ్య దూరం మరింత పెరుగుతుందా?
ఒక పల్లెటూరి పిల్ల జీవితంలోకి వచ్చిన పట్నం అబ్బాయి… అతని జీవితాన్ని మార్చబోతున్నాడా? లేక ఆమె జీవితమే తలకిందులు చేయబోతున్నాడా?
తెలుసుకోవాలంటే చదవండి…
గొడవలతో మొదలైన ఓ వింత బంధం… ప్రేమగా మారుతుందో లేదో తెలియని ఓ అందమైన ప్రయానం…..
“పార్వతికి చిన్నప్పుడే వాళ్ళు అమ్మా నాన్న చనిపోతారు”……… (వాళ్ళు ఎందుకు చనిపోయారు అనేది సస్పెన్స్ ).
అయితే పార్వతి తల్లితండ్రులు చనిపోవడానికి ఒక వ్యక్తి కారణం అతనే పార్వతిని ఒక గుడ్డలో చుట్టి పూల బుట్టలో పెట్టి నడి రోడ్డుపై వదిలేసి వెళ్ళిపోతాడు………..
అటుగా ఎమ్మెల్యే డాన్స్ ప్రోగ్రాం అయిపోయి ఇంటికి వస్తున్న ఒక అనాధ మహిళ(ప్రైవేట్ డాన్సర్)పాపని చూసి పాటించుకోకుండా వెళ్ళిపోతుండగా, ఆమెకి ఎదో మెరిసే వస్తువుని చుసినట్లుగా అనిపిస్తుంది…..
దాంతో వెళ్ళొపోదాం అనుకున్నమ తిరిగి వెనక్కు వచ్చి “ఆ పాపని తీక్షణంగా చూస్తుంది.”
ఆ పాపం చేతికి బంగారపు కడియం ఉంది…..
అరరే…!అనవసరంగా నాకెదురుపడిన బంగారుబాతుని చెజేతులురా జారివిడుచుకోబోయనే ఛా…… అంటు ఆ పాపం చేతికున్న కడియం మాత్రం తీసుకుని ఏడుస్తున్న పాపను కనీసం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది……
“ఇదొక్క రాత్రి కానీ తెల్లారిందా ఇకంతే నా పంట పండినట్టే”…. ఈ కడియం అమ్మేసి లక్షధికారినైపోవచ్చు అయ్యో సంపద నువ్వు నిజంగానే సంపద ఉన్నదానివైపోతావే అంటూ తనలో తను మురిసిపోతు వెళ్తుండగా…..
సగం దూరం వెళ్ళాక ఏదో గుర్తొచ్చినట్లుగా గబా గబా వెనక్కి తిరిగి పాప వైపు పరుగులు తీసింది…..
నేనెంత మూర్కురాలినో పాప చేతికే ఇంత పెద్ద బంగారు కడియం ఉందంటే ఇక వీళ్ళ అమ్మ నాన్న ఎంత డబ్బున్న వాళ్ళైంటారు….. కానీ పాపని ఎందుకు వదిలేసారు ఆడపిల్లనా?
లేదా ఇంకేదైనా కారణముందా? అని ఆలోచిస్తూ సర్లే ఒకవేళ ఎప్పటికైనా పాపని వెతుకుంటూ వాళ్ళు రాకపోతారా లేకపోతే నేను అమ్ముకోక పోతాన….
తేరగా దొరికింది ఎంతోకంతకు అమ్మేస్కోవచ్చు అంటూ ఇంటికి తీసుకెళ్లిపోతుంది.
తెల్లవారగానే పాపని ఇంట్లోనే ఒక గది పాలుపొసి నిద్రపుచ్చి పాపం ఏడుపు బయటకు టీవీ ఆన్ చేసి మర్చిపోయినట్లుగా వెళ్ళిపోతుంది.
దగ్గరగా ఉన్న షాపులో అయితే దొరికిపోతనని,పల్లెటూరికి దూరంగా ఉన్న ఒక పెద్ద నగారనికి వెళ్ళింది.అక్కడ ఒక పెద్ద బంగారం షాపులోకి వెళ్లి ఓయ్!…. సేటు ఇట్రావయ్య…
అని పొగరుగా పిలుస్తుంది.
కానీ అక్కడ ఆల్రెడీ పెళ్ళి ఫంక్షన్లో సంపద చేసిన ఒక ధనవంతుల కుటుంబం బంగారం మొత్తాన్మి అమ్మడానికి వచ్చివుంటుంది.(హీరో కుటుంబ సభ్యులు )
తనని చూసి “సంపద నువ్వు అదే డాన్సర్ కదా ఏడేళ్ల క్రితం నేను పెళ్ళిలో డాన్స్ చేసావ్…”
అని అంటుండగానే,’ ఆ అవును ఎ నేను బంగారం కొనకూడద? లేదా అమ్మకూడద? అని వెటకారంగా సమాధానం చెప్తుంది.
సుధ తనతో మనకెదుకు వెళదాం పద అంటూ వాళ్ళ అత్తయ్య తీసుకుళ్ళిపోతుంది.
ఏయ్!..పిలుస్తుంటే నీక్కాదు.. అని షాప్ ఓనర్పై చిరాకుపడుతుంది.
“సారీ మేడం!ఏమి కావాలో చెప్పండి అని అడుగుతాడు.”
వెంటనే తన దగ్గర ఉన్న కడియం తీసి ఇస్తుంది. ఇది తీస్కొని ఎంత డబ్బులోస్తాయో ఇవ్వు అని టేబుల్ పైన విసిరేస్తుంది.
(ఆ తర్వాత ఏమైంది?షాప్ ఓనర్ ఏమన్నాడు?సంపద ధనవంతురాలైందా?లేదా? పాప పరిస్థితి ఏంటి?ఇలాంటి మరిన్ని ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ పార్ట్ లో చూద్దాము,, 👋👋
Swipe left/right or tap the sides to turn pages