మర్నాడు ఉదయాన్నే ఎప్పటిలాగా ఆర్టీసీ బస్సులో ఆఫీస్ కి స్టార్ట్ అయింది గానీ సగం దూరంలో బస్సు డ్రైవర్ పక్కనుంచి వెళుతున్న ఆటో కి డాష్ ఇవ్వడంతో ఆటో డ్రైవర్ కి బస్సు డ్రైవర్ కి గొడవ కావడంతో ఇలా అయితే లేట్ అవుతుందని కంగారుగా బస్సు దిగేసి తన ఆఫీసు వైపుగా వెళ్లే వెహికల్స్ ఏమైనా కనిపిస్తాయేమోనని పావుగంట పాటు నిలబడడంతో ఒక పెద్ద కారు అటువైపుగా వస్తూ కనిపించేసరికి చేయి అడ్డుపెట్టి “లిఫ్ట్ ప్లీజ్” అంది….