అప్పటివరకు ఒకింత బెరుకుతో అర్థం కాని కన్ఫ్యూషన్ తో మిగిలిపోయిన పేరెంట్స్ మొత్తం కోపంతో కట్టలు తెంచుకున్నారు. అటు ప్రియ పేరెంట్స్ ఇటు అలోక్ మదర్ అవంతిక గారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. రేణుక గారు తల కొట్టుకుంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే.. విరాజ్ అంటూ కూతురి కోసం దూసుకు వచ్చిన రవికాంత్ అతని కాలర్ బిగించాడు వెనుక నుంచి. కూతురి నుంచి విడదీయాలని చేసినా ఆయన ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు వీరాజ్ కుడి చేతితో ఆయ…