ప్రియమైన శత్రువు💘 – 3
పెద్దవి అవుతున్న కళ్ళతో అతని స్థితిని అంచన వేస్తున్న ప్రియా మెడలో రఫ్ గా తెలుస్తున్న స్పర్శకి తల ఎత్తి చూస్తే పట్టు బట్టల్లో ఉన్న వ్యక్తి తన మెడలో మూడు ముడులు వేశాడు.
తల దించి తన గుండెల మీదకు చేరిన మొదటి సూత్రాన్ని చూస్తూనే ఉంది మండుతున్న అగ్నిసాక్షిగా పూజారి గారి చేతిలో ఉన్న రెండవ సూత్రాన్ని కూడా ఫోర్సుగా తీసుకున్న అతను లేవటానికి ట్రై చేస్తున్న ప్రియా భుజాన్ని నొక్కి కిందికి తోసి మళ్లీ మూడు ముడులు వేసి ఆమె పక్కనే పీటల మీద కూర్చొన్నాడు.
నిమిషం ముందు వరకు అందరిలో ఒకడిగా పట్టు బట్టల్లో పెద్ద మనుషుల మధ్య బుద్ధిమంతుడిలా కూర్చున్న ఆ వ్యక్తి నల్లద్ధాల వెనుక నుంచి తీక్షణమైన చూపులతో వదు వరుల ప్రతి చిన్న కదలికను కూడా అతి జాగ్రత్తగా ఫాలో అవుతున్నాడు.
సరిగ్గా అలోక్ అత్తింటి సూత్రం అందుకొని ప్రియా మెడలో మూడు ముళ్ళు వేయడానికి ఒంగిన క్షణం.. వాయువేగంతో మండపం మిదకి దూసుకు వచ్చాడు.
అప్పటికే జరుగుతున్న పెళ్లి తంతుకి దీవెనలుగా అందరూ అక్షింతలు చల్లుతున్నారు.
అతని వేగాన్ని గమనించి అడ్డుకునే లోపే.. ఏయ్ ఏంటి అని ప్రశ్నిస్తున్న అక్షరాలు మండపం మీద ఉన్న వారి పెదవుల నుంచి బయటికి వచ్చే లోపే అలోక్ మెడ పట్టి పక్కకు లాగేసి అతని చేతుల నుంచి గాలిలోకి ఎగిరిన మంగళసూత్రాన్ని తన చేతితో అందుకుంటూ రెండో చేతితో అలోక్ ని మండపం ముందు వైపుకి విసిరి కొట్టాడు.
అతని బలానికి అందరూ నోర్లు వదిలేసి కళ్ళు తేలేసి జరుగుతున్న వింతకి స్తంభించిపోయి సెన్స్ లేస్ గా మారిపోయిన ఆ క్షణం పీటల మీద కూర్చున్న అతని రూపం అందరిని మూర్చపోయేలా చేసింది.
ప్రియా తన చుట్టూ జరుగుతున్నది తెలుసుకొనే లోపే అత్తింటి సూత్రం పుట్టింటి సూత్రం అందుకొని తన మెడలో ముచ్చటగా మూడు ముళ్ళు వేసి హక్కు అధికారం అన్నట్టు ఆమె చేతిని బిగించి కూర్చున్నాడు.
తను ప్రేమించిన అలోక్ కి సొంతమవుతున్న క్షణలను ఈ విధంగా సర్వనాశనం చేసి మరొక వ్యక్తి తన మెడలో మూడు ముళ్ళు వేయడం ఇంకా నిజం అని నమ్మలేకపోతోంది ప్రియా.
నేల మీద పడడమే స్ప్రింగ్ లా బౌన్స్ అయిన అలోక్ ఏయ్.. అని అరుస్తూ ఆవేశంగా ముందుకు వేసినా అడుగు అతని రూపాన్ని చూడటమే ఆగిపోతే ముందుకి చాపిన చెయ్యి అలాగే పాయింట్ చేస్తూ నిలిచిపోయింది.
తను ప్రేమించిన అమ్మాయి పక్కన ఉన్నది శత్రువు కాదు శత్రువు లాంటివాడే, తన కన్న ముందు పుట్టిన తన వాడే.. కలలో కూడా ఊహించలేదు అలోక్.
సిటీలోని హేమాహేమీలు విఐపి లు, అతి ముఖ్యమైన బిజినెస్ పర్సన్స్, రాజకీయ వ్యక్తులు.. అందరి సమక్షంలో కేవలం ఒకే ఒక్క నిమిషంలో జరిగిన మాంగల్య ధారణ తో మండపం మొత్తం పిన్ డ్రాప్ సైలెన్స్ చుట్టేసింది.
కాలం ఆగిపోయినట్టు మండపంలోని ప్రతి ఒక్కరూ ఫ్రీజ్ అయిపోయారు.
ఆ సైలెన్స్ నచ్చలేదో, తన పెళ్లికి హడావిడి లేదనో, మరి తర్వాతి తంతు జరగడం లేదనో.. తెలియదు కానీ క్షణం చుట్టూ గమనించిన అతను అప్పటివరకు బ్యాక్ సైడ్ ఉంచిన గన్ తీసి గాలిలోకి షూట్ చేయడమే ఒక్కసారిగా ఆకాశానికి అంటిన ఆహాకారాలతో జనాలు పరుగులు పెట్టారు.
అప్పుడు నిజం లోకి వచ్చి అదిరిపడ్డ ప్రియా గట్టిగా చెవులు మూసుకుంది.
తన ప్రమేయం లేకుండానే నిజాన్ని అంగీకరించలేని ఆమె కళ్ళల్లో కన్నీళ్లు దారకట్టాయి.
గొప్పగా జరుగుతున్న పెళ్లికి ఘనంగా దక్షిణ తీసుకున్న ముగ్గురు పంతుల్లు పంచెలు పైకి పట్టుకొని దడ దడ లాడుతున్న గుండెతో పరుగులు పెట్టడానికి ప్రిపేర్ అవుతుంటే
ముగ్గురికి మూల పురుషుడు అయిన పెద్ద పంతులు కి గన్ టార్గెట్ చేసి కళ్ళతోనే కూర్చొని మిగిలిన తంతు పూర్తి చేయమని వార్న్ చేసాడు అతను.
అన్నయ్య.. అంటూ అప్పుడు ప్రతిధ్వనించింది అలోక్ గర్జన.
అలా పిలిచినందుకు కాబోలు.. కూర్చున్న చోటు నుంచి కదలకుండానే అలోక్ కాళ్లు మధ్యకి బుల్లెట్ వదిలాడు చెవులు మూసుకున్న ప్రియా చేతిని మళ్లీ తన చేతిలోకి బిగించుకుంటూ.
ఆ మరు క్షణం ప్రియా రెండవ చేయి అతని కాలర్ బిగించింది.
ఒకపక్క కన్నీళ్లు కారుతున్నాయి, మరొకపక్క కట్టెలు తెంచుకొని కోపంతో రగిలిపోతుంది.. అన్నిటికన్నా ముఖ్యంగా అలోక్ ని టార్గెట్ చేసిన అతనిని చంపేసే ఆవేశం.
అతని కాలర్ బిగించిన ప్రియ పారాని చేతిని ఐ కార్నర్ గా చూసిన అతని పెదవులు వంకరగా క్షణం పాటు సాగాయి.
ఇంప్రెస్సివ్ గా కళ్ళు పైకెత్తి ప్రియా కళ్ళల్లో నిలిపి.. ఫస్ట్ టైం వాడి కోసమే నన్ను టచ్ చేసావు, సెకండ్ టైం కూడా వాడి కోసమే నన్ను టచ్ చేసావు.
థిస్ ఇస్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్..అని స్మూత్ గా హెచ్చరిస్తున్న అతని వార్నింగ్ లోతు అర్థమయ్యే లోపే ప్రియా మెడలోని వరమాల పట్టి ముందుకు లాగి ఆవేశంతో వెచ్చగా సెగలు విడుస్తున్న తన పెదవులను అందుకున్నాడు.
వందల మంది ముందు అతను చేస్తున్న పని కొందరిలో ఆవేశాన్ని రగిలిస్తే మరికొందరిని సిగ్గుతో తల తిప్పుకునేలా చేసాయి.
అప్పటివరకు ఒకింత బెరుకుతో అర్థం కాని కన్ఫ్యూషన్ తో మిగిలిపోయిన పేరెంట్స్ మొత్తం కోపంతో కట్టలు తెంచుకున్నారు.
అటు ప్రియ పేరెంట్స్ ఇటు అలోక్ మదర్ అవంతిక గారు ఆపడానికి ప్రయత్నిస్తున్నారు.
¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢¢
కామెంట్స్ మస్ట్ బేబీస్..
మళ్లీ కలుద్దాం
_వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages