New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమే పునాదిగా 💖 – 1

ప్రేమే పునాదిగా 💖 – 1

పసిడి మేని ఛాయతో, పెద్ద పెద్ద కళ్ళతో, కోటేరు లాంటి ముక్కు, చెర్రీస్ లాంటి ఎర్రటి పెదవులు, తాచు పాము లాంటి పొడవైన జడ, గుండ్రటి ముఖారవిందం తో  అజంతా శిల్పం లా ఉంది ఒక  అమ్మాయి…

 

ఆ అమ్మాయి వయసు 22 సంవత్సరాలు…

 

ఆ అమ్మాయి పేరు ఆద్య…

 

ఆద్య అమ్మ, నాన్నలకి తను ఒకటే  సంతానం…కొడుకయినా కూతురయిన ఆమె …

 

అందువల్ల ఆద్య పుట్టినప్పట్టి నుండీ నేటి వరకు తన తల్లిదండ్రులు ఇద్దరు ఆమెను ఎంతో అపురూపం గా, ప్రేమగా, తను కోరింది కాదు, లేదు అనకుండా అందించి, ఒక చిన్న సైజ్ ప్రిన్సెస్ లా చూసుకుంటూ ఉంటారు.. 

 

అలా అని ఆద్య పేరెంట్స్ బాగా రిచ్ అనుకుంటే పొరపాటే  సుమీ …

 

వాళ్ళది మధ్య తరగతి కుటుంబమే.. చిన్న బట్టల షాప్ పెట్టుకుని భార్య భర్తలు ఇద్దరు ఆ షాప్ చూసుకుంటూ అందులో వచ్చే ఆదాయం తోనే ఇంటిని చక్క బెట్టుకుంటూ ఆద్య నీ  యువ రాణి లా చూసుకునేవారు…

 

ఆద్య నీ ఎప్పుడు వాళ్ళు అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు అని,  అక్కడికి వెళ్ళకూడదు ఇక్కడకి వెళ్ళకూడదు అని రూల్ చేసేవారు కాదు..

 

ఆద్య కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు..

 

అలా తల్లిదండ్రులు  అంత స్వేచ్ఛ ఇచ్చారు కదా నేను ఏదయినా చేసేయొచ్చు అని ఆద్య ఏ రోజూ అనుకోలేదు..

 

అమ్మ, నాన్న లు  తనకి ఇచ్చిన ఫ్రీడమ్ నీ  ఎప్పుడు దుర్వినియోగం చేయలేదు…

 

ఎవరితో ఎంత చనువు గా ఉండాలో అంతలోనే ఉంటూ  కాలేజ్ కి వెళ్లి బుద్దిగా చదువుకుంటూ, తోటి వాళ్లకి చేతనంత సాయం చేస్తు, ఫ్రెండ్స్ తో సరదాగా గడుపుతూ ఎంతో సంతోషం గా తన కుటుంబం తో కాలం గడుపుతుంటుంది….

 

అలా కాలం సాఫీగా గడిచిపోతున్న సమయం లో వచ్చాడు ఆద్య లైఫ్ లోకి ఒక అబ్బాయి అతనే 

“అర్జున్ రెడ్డి”

 

 

ఆద్య కాలేజ్ లోనే జాయిన్ అయ్యాడు…  ఆరడుగుల ఎత్తు, ఎత్తుకి తగ్గ లావు, ముట్టుకుంటే మాసిపోయే  అంత వంటి రంగు,, డైలీ జిమ్ చేస్తాడేమో షర్ట్ పై నుండే అతని సిక్స్ ప్యాక్ స్పష్టంగా కనిపిస్తుంది….

 

 

మజిల్స్ ఓ షేప్ లో చూడగానే ఆకర్శించేలా దృఢమ్ గా ఉంటాయి…

 

ఒకరకంగా చెప్పాలంటే అర్జున్ ఆద్య కంటే  ఒకింత ఎక్కువ అందగాడు అన్నమాట…

 

అందానికి మించి అందమైన మంచి మనసున్న వాడు కూడా…

 

అది అర్జున్  కాలేజ్ లో జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే తెలుసుకుంది ఆద్య…

 

 

అతని అందానికి జస్ట్ కళ్ళు ఆకర్శిస్తే ఆ మంచి మనసు చూసి మన ఆద్య పాప  మనసు అర్జున్ కి ఫిదా అయిపొయింది….

 

ప్రతిరోజు అర్జున్ నీ దూరం నుండీ దొంగ చూపులు చూస్తూ సైట్ కొట్టడం, ఖాళీగా ఉన్న టైమ్ లో అంత అర్జున్ వెనకే తిరుగుతూ అతన్ని గాఢంగా ఆరాధిస్తూ ఉండేది ఆద్య …

 

అలా కొద్దిరోజులు గడిచిపోయి ఆద్య చదువు కంప్లీట్ అయ్యే సమయంలో ఒకరోజు ధైర్యం చేసి ఆద్య నే వెళ్లి అర్జున్ కి ప్రపోజ్ చేస్తుంది…

 

ఎప్పుడు అబ్బాయిలే ముందు ప్రపోజ్ చేయాలి అని ఆలోచించే ఈరోజుల్లో ధైర్యం గా ఒక అమ్మాయి వచ్చి అలా ఐ లవ్ యూ చెప్పడంతో అర్జున్ కి ఆద్య డేర్  నచ్చుతుంది…

 

ముందుగానే ఆద్య మీద ఒక మంచి అభిప్రాయం వుంది అర్జున్ కి…

 

కాని సడన్ గా ఇలా వచ్చి తనకి ప్రపోజ్ చేస్తుంది అని ఎక్సపెక్ట్ చేయక పోవడం తో అర్జున్ ఒకింత షాక్ అవుతాడు…

 

అర్జున్  ముందు ఆమె సడన్ ప్రపోసల్ కి షాక్ అయిన వెంటనే తేరుకుని  ఆద్య వైపు చూస్తాడు…

 

అతనికి ఆమె చేసిన డేర్  అండ్ ఆమె కళ్ళల్లో అతని పై ఉన్న అంతులేని ప్రేమ కనిపించేసరికి అర్జున్  కి ఆమె మీద వుండే ఇష్టంతో, ఆమె క్యారెక్టర్ మీద వున్న నమ్మకం తో అసలు  ఇంక ఏ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి అమ్మాయిని మిస్ అవ్వకూడదు అని గట్టిగా ఫిక్స్ అయి ఆద్య  ప్రపోసల్ కి  వెంటనే ఓకే చెప్పేస్తాడు….

 

అర్జున్ తన లవ్ కి ఓకే చెప్పడంతో ఆద్య కి పట్టరాని సంతోషం వచ్చి చేరి మనసు ఆనందం తో ఉప్పొంగి పోతుండగా అర్జున్ ముందే పిచ్చి పిచ్చిగా డాన్స్ వేస్తూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అర్జున్ ఐ లవ్ యూ సో మచ్…టుడే మోస్ట్ మెమోరాబుల్ డే ఇన్ మై లైఫ్ అంటూ గెంతులు వేస్తుంది…

 

ఆద్య సంతోషాన్ని చూస్తున్న అర్జున్ కి ఆమె మొహం లో ఆమె కల్మషం లేని మనసు, స్వచ్ఛమైన ప్రేమ కనిపించి ఆమ్ వెరీ లక్కీ పర్సన్ అనుకుంటాడు….

 

ఆరోజు నుండీ కాలేజ్ పూర్తయ్యేవరకు అర్జున్, ఆద్య లు ఒక వైపు చదువుకుంటూనే మరో వైపు ఒకరి ప్రేమను మరొకరికి తెలుపుకుంటూ ఎంతో హ్యాపీగా ఉంటారు…

 

కాలేజ్ ఆఖరి డేస్ వచ్చేసాయి క్యాంపస్ ఇంటర్వ్యూ లు జరుగుతున్నయి…

 

ఒకటే ప్లేస్ మెంట్ ఉంది… దానికి చాలా మంది ట్రై చేసారు… బట్ ఆద్య వెళ్ళలేదు..

 

కారణం ఆ జాబ్ తప్పకుండ అర్జున్ కే వస్తుందని ఆద్యకి తెలుసు..

 

అర్జున్ వెరీ టాలెంటెడ్ పర్సన్ అందువల్ల ఆద్య  జాబ్ అతనికే అని ఫిక్స్ అయిపొయింది…

 

ఆద్య నమ్మినట్టుగానే  వాళ్ళ కాలేజ్ లో ఆ జాబ్ కోసం ఎంత మంది ట్రై చేసిన జాబ్ అర్జున్ సొంతం అయ్యింది…

 

continued….