New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమే పునాదిగా 💖 – 2

ప్రేమే పునాదిగా 💖 – 2

ఆద్య నమ్మినట్టుగానే  వాళ్ళ కాలేజ్ లో ఆ జాబ్ కోసం ఎంత మంది ట్రై చేసిన జాబ్ అర్జున్ సొంతం అయ్యింది…

 

అర్జున్ యూర్ సెలెక్టెడ్ ఫర్ థిస్ జాబ్ అని ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన వాళ్ళు చెప్పగానే అర్జున్ కి మాటల్లో చెప్పలేని సంతోషం వేసింది….

 

థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ అని ఎంతో హ్యాపీగా  వాళ్ళకి థాంక్స్ చెప్పి ఆ రూమ్ నుండి బయటకి వచ్చి అక్కడ తను చెప్పే గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్న ఆద్య నీ గట్టిగా హగ్ చేస్కుని అతని హ్యాపీనెస్ నీ షేర్ చేసుకుంటాడు అర్జున్….

 

ఆద్య కూడా అతని మొహం లో కనిపిస్తున్న సంతోషానికి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అతన్ని మరింత గట్టిగ హత్తుకుని కంగ్రాట్స్ రా…ఐ నో  ఈ జాబ్ నీకే వస్తుందని నేను ముందే చెప్పాను కదా అంటూ నవ్వుతుంది…

 

హ్మ్ అంటు ఆ సంతోషాన్ని ఇద్దరు చిన్నగా సెలెబ్రేట్ చేసుకుంటారు…

 

 

రోజులు అలా సంతోషం గా గడుస్తూ ఉండగా ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి…

 

ఇద్దరు ఎంతో  శ్రద్దగా చదివి ఆ ఎగ్జామ్స్ కూడా రాసేస్తారు…

 

ఇద్దరికీ  మంచి మార్క్స్ వస్తాయి  కాలేజ్ ఫస్ట్ వస్తారు ఈక్వల్ మార్క్స్తో ..అలా ఇద్దరి చదువులు పూర్తయి పోతాయి….

 

అర్జున్ ఆఫర్ లెటర్ వచ్చిన వారానికి మంచిరోజు వెళ్లి జాబ్ లో జాయిన్ అవుతాడు…

 

ఆద్య అతన్ని దగ్గరుండి  సాగనంపుతుంది…

 

అర్జున్ తొందరగానే తనకున్న టాలెంట్ తో జాబ్ లో  నిలదొక్కుకుంటాడు…వర్క్ విషయంలో తనకంటూ మంచి పేరు కూడా తెచ్చుకుంటాడు….

 

అలా కాలం సాగిపోతు ఉండగా ఆద్య చదువు కూడా పూర్తవడంతో ఇంట్లో  ఆమె తల్లి తండ్రులు తనకి పెళ్ళి చేయాలనీ అనుకుంటుంటారు…

 

ఆ విషయం విన్న ఆద్య టెంక్షన్ పడిపోతు వెంటనే అర్జున్ కి కాల్ చేసి చెప్తుంది….

 

దానికి అర్జున్ ఆద్య నువ్వేం టెంక్షన్ పడిపోకు… మనం తొందర్లోనే మన విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకుందాం…

 

నేను త్వరలోనే ఊరికి వస్తాను… ఇద్దరం మాట్లాడదాము.. అప్పటివరకు  నువ్వు కాస్త కూల్ గా వుండు అని ఆమెకి సర్ది చెప్తాడు…

 

అర్జున్ మీద వున్న నమ్మకంతో ఆద్య కూడా సరే అని చెప్పి కాల్ కట్ చేస్తుంది…

 

అర్జున్  కూడా కాల్ కట్ అయ్యాక ఈ వారం లోనే ఊరికి వెళ్ళాలి అని ఫిక్స్ అయి తన వర్క్ లో పడిపోతాడు…

 

అర్జున్ అనుకున్నట్టుగానే  ఆ వీకెండ్ లో సీటీ నుండి తమ ఊరికి వస్తాడు…

 

రాగానే ఆద్యకి తను వచ్చిన విషయం చెప్తాడు… ఆద్య చాలా సంతోషపడిపోతుంది… అనుకున్నట్టే ఆద్య ఒకరోజు అర్జున్ నీ  తమ ఇంటికి పిలిపించి వాళ్ళ అమ్మ, నాన్నలకి  అర్జున్ నీ పరిచయం చేస్తుంది… 

 

 

చిన్నగా అర్జున్, ఆద్య ఇద్దరు కలిసి వాళ్ళ ప్రేమ విషయం చెప్పేస్తారు …

 

ముందు పేరెంట్స్  ఇద్దరు షాక్ అయిన వెంటనే తేరుకుంటారు ఈరోజుల్లో ఇవన్నీ మాములే అన్నట్టుగా…

 

ముందు లవ్, అర్జున్ కి ఎవరు లేరు అనగానే  ఆమె  పేరెంట్స్ కాస్త సంశయించిన  అర్జున్ మాట తీరు, పద్ధతి, చదువు, సంస్కారం చూసాక అబ్బాయి మంచివాడు,  మంచి జాబ్  కూడా ఉంది, అంతకు మించి మన అమ్మాయి అంటే  చెప్పలేనంత ప్రేమ ఉంది…

 

అది అతని మాటల్లోనే కనిపిస్తుంది… మా అమ్మాయి అంటే ఎంత ప్రేమ లేకుంటే  ఇంటికి వాసిబిఐ ధైర్యం గా తమ ప్రేమతో విషయం చెప్పి మమ్మల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు…

 

మనం ఎవరిని తెచ్చి చేసిన మన బిడ్డ సంతోషం గా ఉండడమే కదా మనకి కావాలి, అదేదో తనని అర్ధం చేసుకునేవాడికే ఇచ్చి చేస్తే మంచిది కదా అని అమ్మ, నాన్నలు ఇద్దరు కాసేపు మాట్లాడుకుని ఆద్య, అర్జున్ లా ప్రేమని ఒప్పుకుంటారు….

 

 

ఆద్య పేరంట్స్  తమ ప్రేమని ఒప్పుకోగానే అర్జున్, ఆద్య ల ఆనందానికి అవధులు లేవు…

 

ఇద్దరు తమ కళ్ళతోనే తమ సంతోషాన్ని పంచుకుంటారు…

 

అర్జున్ ఇద్దరి కాళ్ళకి నమస్కరించి చాలా థాంక్స్ ఆంటీ, అంకుల్.. పెద్ద మనసు చేసుకుని మా ఇద్దరి ప్రేమని అంగీకరించినందుకు…

 

నేను ఒక అనాధని అని, నాకంటూ వెనక ముందు ఎవరు లేరని, ఆస్థి అంతస్థులు లేవని ఎక్కడ మీరు మా పెళ్ళికి ఒప్పుకోరు అనీ చాలా భయం వేసింది…

 

మీరు అవేమీ పట్టించుకోకుండా  నిస్వార్థం గా న ప్రేమని ఒప్పుకున్నారు… ఈ జన్మంతా నేను మీకు రుణపడి వుంటాను….

 

ఆద్య అంటే నాకు ప్రాణం ఈ ప్రపంచం లో నాకంటూ వున్న ఒకే ఒక్క బంధం తను.. ఎక్కడ  మీరు ఒప్పుకోకుంటే తను నాకు దూరం అవుతుందో అని కంగారు పడ్డాను..  

 

ఇప్పుడు నా మనసు ఎంత ప్రశాంతం గా ఉందొ మాటల్లో చెప్పలేను… మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోడానికి నా సాయి శక్తుల ప్రయత్నిస్తాను అని చెప్తాడు అర్జున్….

 

 

అతని మాటలకి తృప్తిగా తలూపి మాకు మాత్రం మా ఆద్య తప్ప ఎవరున్నారు బాబు.. తన సంతోషమే కదా మేము కోరుకునేది అంటు సరే బాబు మంచి ముహూర్తం చూసి   కబురు పెడతాము…

 

మీరు సెలవు పెట్టుకుని రండి.. ఈలోపు ఇక్కడ ఏర్పాట్లు అన్ని మేము చూసుకుంటాం అని చెప్తారు ఆద్య పేరెంట్స్…

 

ఒకే అండీ థాంక్స్ అని మరొకసారి చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అర్జున్…

 

అర్జున్ ఆహ్ నైట్ కె వెళ్ళిపోవాలి అనుకోవడంతో ఆద్య అర్జున్ నీ పంపించడానికి వస్తుంది…

 

ఒకగంట పాటు సరదాగా ఇద్దరు బయట తిరిగి తమ పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఆ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు…

 

continued….