ప్రేమే పునాదిగా 💖 – 3
ఒకగంట పాటు సరదాగా ఇద్దరు బయట తిరిగి తమ పెద్దవాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నందుకు ఆ హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారు…
గంట తరువాత బస్ కి టైమ్ అవుతుండడం తో ఒక రెస్టారెంట్ లో డిన్నర్ చేసేసి ఇద్దరు బస్ స్టాండ్ కి చేరుకుంటారు…
ఫిలన్ గా ఒకే స్వీట్ హగ్ ఇచ్చేసుకుని ఆద్య అర్జున్ కి సెండాఫ్ ఇవ్వగ అర్జున్ ఆద్యకి బాయ్ చెప్పి బస్ ఎక్కుతాడు…
బస్ స్టార్ట్ అయ్యాక అర్జున్ కనుమరుగయ్యేవరకు ఒకరిని ఒకరు చూసుకుని బస్ వెళ్ళిపోయాక ఆద్య అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది….
ఒకవారం రోజులు గడిచాక మంచి రోజు చూసుకుని ఆద్య పేరెంట్స్ అనుకున్నట్టుగానే పంతులుగారు నీ ఇంటికి పిలిపించి ముహుర్తాలు పెట్టిస్తారు….
ఆయన ఇద్దరి పేరుబలాలని బట్టి ముందుగా ఒక వారం లో ఎంగేజ్మెంట్ కి, ఒక ఇరవై రోజుల్లో పెళ్ళికి ముహుర్తాలు పెడతారు….
ఆయనకి సంభావన ఇచ్చి పంపించాక ఆద్య పేరెంట్స్ ఎంగేజ్మెంట్ కి ఎక్కువ టైమ్ లేదని ఆరోజు మంచిరోజే కావడం తో చుట్టు పక్కలా వున్న ఒక అయిదుగురు ముత్తయిదువలతో కలిసి పసుపు దంచిపించి మంగళకరం గా పెళ్ళి పనులు స్టార్ట్ చేస్తారు….
ఆ వచ్చిన ముత్తయిదువులకి ఆద్యతో తాంబూలం ఇచ్చి పంపుతారు…
ఆద్య అర్జున్ కి ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ కి పెళ్ళికి డేట్స్ ఫిక్స్ చేసిన విషయం చెప్పడం తో అర్జున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఇద్దరు కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకుంటారు…
తర్వాత రోజు నుండిఆద్య ఇంట్లో పెళ్ళి పనులు జోరందుకున్నాయి….ఇల్లు క్లీనింగ్, ఇంటికి రంగులు వేయించడం, ఇంటి ముందు, గార్డెన్ అంత శుభ్రం చేయించడం పూర్తి చేస్తారు…
సమయం తక్కువ ఉందని తమ బంధువుల అందరిని ఫోన్ లలోనే ఎంగేజ్మెంట్ కి పిలుపులు పిలిచేస్తారు…
ఎంగేజ్మెంట్ కోసం చీరలు, నగలు, మిగిలిన బట్టలు, కావాల్సిన వస్తువులు అన్ని షాపింగ్ చేసేస్తారు…
ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది… అర్జున్ ముందు రోజే ఊర్లోకి రావడం తో అతని ఫ్రెండ్స్ తో కలిసి అతను కూడా తన షాపింగ్ పూర్తిగా చేసేస్తాడు….
ఆద్య ఇల్లు ఎంగేజ్మెంట్ కోసం ఎంతో అందం గా ముస్తాబు అయ్యింది…
ఇంటి గుమ్మాలు అన్ని రంగు రంగుల పూలతో, పచ్చని మామిడి తోరనాలతో ఎంతో అందం గా అలంకరించారు…
ఇల్లంతా అందమైన రంగువల్లులు దిద్ది వున్నారు…
ఇంటి గార్డెన్ లో ముచ్చటగా స్టేజ్ సెట్ చేసి స్టేజ్ అంత అద్భుతంగా అలంకరించి వుంది…
ఆ ఏరియా అంత లైట్స్ తో మెరిసిపోతుంది…. బంధువులు ఒక్కొక్కరు వచ్చేసి పిల్ల, పెద్దలతో వాళ్ళు చేసే సందడితో హడావిడిగా వుంది…
అర్జున్ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడకి చేరుకున్నాడు… నేవీ బ్లూ సూట్ ప్యాంటు వేసుకుని ఎంతో హ్యాండ్సమ్ గా రెడీ అయి వున్నాడు…
ఆద్య కూడా డిసైనర్ శారీ విత్ బ్లౌజ్ దానికి తగ్గ జ్యుయలరీ వేసుకుని లైట్ మేకప్ తో , శారీ మాచింగ్ ఇయర్ రింగ్స్, బేంగిల్స్ అన్ని ధరించి అతిలోక సుందరి ల రెడీ అయింది…
ముహూర్తం సమయం అవడంతో పంతులుగారు ఇద్దరినీ కూర్చోపెట్టి సింపుల్ గా పూజ జరిపిస్తారు….
ఆ తర్వాత ఇద్దరినీ స్టేజ్ ఎక్కించి అందులో వున్న సోఫా ఛైర్ లో కూర్చోపెట్టి రాక రకాల ఫోజు లో ఫోటోస్ తీస్తు ఇద్దరి నిలబెట్టి దండలు మార్పించి రింగ్స్ వాళ్ళ ముందు పెడతారు…
ఆద్య, అర్జున్ లు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుని ఎంతో ఆనందం గా రింగ్స్ పెట్టుకుంటారు….
అర్జున్, ఆద్య ఫ్రెండ్స్ అల్లరిల్లరి చేస్తుంటారు… పెద్దవాళ్లందరు ఆ ఇద్దరి జంటని ఆశీర్వదిస్తారు…
ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో ఫొటోస్ తీసుకున్నాక వచ్చిన వాళ్లందరికీ కడుపునిండుగా విందు భోజనం పెట్టి రిటర్న్స్ గిఫ్ట్ ఇచ్చి పంపుతారు…
అర్జున్ ఆద్య వంకే ప్రేమగా చూస్తు ఉంటాడు… అతని చూపులు గుచ్చుకుని ఆద్య అతని వంక చూసి ఏంటల చూస్తున్నావ్ అన్నట్టుగా సైగ చేస్తుంది….
యూర్ లుకింగ్ లైక్ ఏంజెల్ బంగారం.. చాలా ముద్దుగా వున్నావ్… ప్లీజ్ ఐ వన్నా కిస్ యూ అని చిన్నగా ఆమెకి మాత్రమే వినిపించేలా అడిగాడు అర్జున్….
అక్కడ అర్జున్, ఆద్య మాత్రమే వున్నారు కాస్త కార్నర్ లో.. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకి కొంచెం దూరం లో వున్నారు బంధువులతో, ఫ్రెండ్స్ తో బిజీ బిజీగా ఎవరి గోలలో వాళ్ళు ….
అందరిని గమనించే అర్జున్, ఆద్య తో అలా మాట్లాడాడు…
అర్జున్ సడన్ గా అలా మాట్లాడడం తో ఆద్య ముందుగా షాక్ అవుతుంది వెంటనే తేరుకుని చిన్నగా బ్లష్ అవుతూ అర్జున్ ఆర్ యూ క్రేజీ…
ఎం మాట్లాడు…తు…న్నావ్ నువ్వు… ఇక్కడ చూడు ఎంత మంది జనాలు వున్నారో.. చుట్టు ఇంతమందిని పెట్టుకుని కిస్ ఏంటి ఎవరైనా చూస్తే ఏమైనా వుందా.. బాబోయ్ ఆడేసుకుంటారు మనల్ని.. పెద్దవాళ్ళు చూస్తే అసలు బాగోదు అంటుంది చిన్నగా తడపాటుగా….
హహహ అంటే ఎవరు చూడకుంటే నీకు ఒకే నే కదా అని ఆద్య వంక కొంటెగా చూస్తు చిలిపిగా అంటాడు అర్జున్…
అతని చూపుల్లో కొంటెతనానికి, మాటల్లో వినిపిస్తున్న చిలిపి తనానికి ఆద్య కంగారుగా నో నో నేను అలా అనలేదు అర్జున్ అంటుంది….
అంటే ఏంటి బంగారం నీకు నేను నిన్ను కిస్ చేయడం ఇష్టం లేదా అని గారం గా అడుగుతాడు అర్జున్…
అతని మాటలకి ఆద్య అర్జున్ వైపు చూస్తు అలా అని నేను చెప్పలేదు గా అర్జున్ అంటుంది చిన్నగా….
హహహ అంటే నీకు కూడా నేను నిన్ను కిస్ చేయడం ఇష్టమేగా అంటాడు ఎక్సయిట్ అవుతూ…
ఓయ్ నేను ఇష్టం అని కూడా చెప్పలేదు గా అంటుంది ఆద్య కళ్లెగరెస్తూ నవ్వుతు…..
అచ్చ అవునా అంటు ఆద్య చేతిని పట్టుకుని వాళ్ళన్న కార్నర్ లో నుండి ఇంకాస్త వెనక్కి స్టేజ్ పక్కకి తీసుకెళ్లిపోతాడు అర్జున్….
ఏయ్ అర్జున్ ఎం చేస్తున్నావ్ నువ్వు … ఇలా మనం ఎవరి కంట్లో అయిన పడ్డామ్ అంటే ఎంత చండాలం గా ఉంటుందో తెలుసా అంటు వాళ్ళని ఎవరైనా చూశారేమో అని అటు ఇటు కంగారుగా చూస్తుంటుంది ఆద్య….
continued….
Swipe left/right or tap the sides to turn pages