New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమ vs పంతం – 1

ప్రేమ vs పంతం – 1

ముంబై 

 

రాత్రి 8:47 నిమిషాల సమయం 

 

పది ఎకరాల విస్తీర్ణం లో ఒక విశాలవంతమైన విల్లా చుట్టూ పూల మొక్కలు, అందమైన చెట్లు, పోదలు గార్డెన్ మొత్తం పచ్చని గడ్డి తో ఎంతో అందం గా, ముచ్చటగా ఉంది ఆ విల్లా.

 

ఇక గేట్ ఎంట్రన్స్ ఎదురుగ ఒక పెద్ద ఫౌంటైన్ మరియు విల్లా   ఎదురుగ మురళి కృష్ణుని శిల్పం ఎంతో అందం గా ఉంది.

 

లోపలకి వెళ్తే ముందు గా పెద్ద హాల్ దర్శనం ఇస్తుంది. అది హాల్ అనడం కంటే ఒక స్టేడియం అనచ్చు, ఆ స్టేడియం లో… చి చి.. అదే ఆ హాల్ లో ఒక పక్క హోమ్ థియేటర్, మరో పక్క పెద్దగా, మెత్తగా ఉండే సోఫా సెట్లు వాటి మధ్య లో ఒక గ్లాస్ టీ టేబుల్ ఉన్నాయి.

 

హాల్ కి రైట్ సైడ్ మూడు గదులు వాటి తరవాత పెద్ద కిచెన్, లెఫ్ట్ సైడ్ మూడు గదులు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో మొత్తం ఆరు విశాలామైన గదులు ఉన్నయి. సెకండ్ ఫ్లోర్ లో మాత్రం మొత్తం క్రింసన్ రెడ్ కలర్ థీమ్ లో చాలా భయంకరంగా ఉంది. మొత్తం నాలుగు రూమ్స్ తో ఉంటుంది ఆ ఫ్లోర్.

 

ఇక థర్డ్ ఫ్లోర్ మొత్తం కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్ లో చాలా అందం ఉంది. అది చుసిన వారికీ ప్రశాంతం అయినా పవిత్రమైన స్థలం ల అనిపిస్తుంది. 

 

అక్కడ రెండు బెడ్ రూమ్స్, జిమ్ రూమ్, ఆఫీస్ రూమ్ అండ్ రెండు గదులు ఉన్నాయి. బట్ అక్కడ ఏం ఉంది అనేది మాత్రం ఆ ఇంట్లో వాళ్ళకి తెలీదు కొంత మందికి మాత్రం తెలుసు కానీ వాళ్ళు ఎవ్వరికి చెప్పారు.

 

ఆ ఇంట్లో  ఎంతో కాలంగా నమ్మకస్థుల్లా ఉన్న పనివాళ్ళు ఉన్నారు. వాళ్లకి ఆ కుటుంబం గురుంచి కొన్ని విషయాలు తెలిసే ఉండడం తో రామ్ ముందు జాగ్రత్తగా వాళ్ళకి విల్లా వెనక క్వార్టర్స్ ఇచ్చాడు.

 

థర్డ్ ఫ్లోర్ లోని మెయిన్ బెడ్ రూమ్ లో కింగ్ సైజు బెడ్ మీద     

దేవకన్య ను తలపించి ఒక అమ్మాయి పోడుకొని ఉంది. కానీ తాను నిద్ర పొవట్లేదు. మౌనం గా ఏడుస్తూ తన మీద ఉన్న అతని చూస్తూ ఉంది. ఆ చూపు లో కోపం, నిస్సహాయత, బాధ చాలా స్పష్టంగా ఉన్నాయి.

 

కానీ ఆ అమ్మాయిని గాఢంగా హత్తుకొని పొడుకున్న అతను మాత్రం చలనం లేకుండా చాలా ప్రశాంతం గా నిద్ర పోతున్నడు. అతనే మన హీరో బాబు. ఇక బాబు గారి కౌగిలిలో అప్పడం లా నలిగిపోతన్న అమ్మాయి మన హీరోయిన్.

 

ఏడుపు శబ్దం వినిపిస్తున్న కూడా దాన్ని పట్టించుకోకుండా ఇంకా తన పొదువుకుంటున్న అతన్ని చూస్తుంటే తనకి మండిపోతున్న ఏమి చెయ్యలేని నిస్సహాయతతో అతని చేతుల్ని నిదానంగా విడిపించుకొని పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే తన మణికట్టు పొట్టుకొని అతని మీదకు లగేసాడు.

 

షాక్ అయిపోయి చూస్తూ ఏడుపు మొహం పెట్టుకొని ” రామ్ గారు….ప్లీజ్ అండి… ఫ్రెష్ అయ్యి ప్రోటీన్ డ్రింక్ తీసుకురావాలి కదా…” అంటూ అతన్నించి విడిపించుకొనే ప్రయత్నం చేస్తుంది.

 

అతను విసుగ్గా ” ఇంకా ఎందుకు ఆ ఏడుపు…. ఇప్పటి వరకు ఏడ్చావు గా….. ” అంటూ విసురుగా వదిలేసి జిమ్ రూమ్ కి వెళ్ళిపోయాడు రామ్.

 

ఆమె ఫోర్స్ గా వచ్చి ఫ్లోర్ మీద పడింది.

 

అతన్ని కొన్ని క్షణాలు చూసి వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. వెంటనే ఫ్రెష్ అయ్యి థర్డ్ ఫ్లోర్ నుంచి మెట్ల నుంచి స్పీడ్ గా దిగుతూ ఈరోజు చేయవలిసిన టిఫిన్ ప్రేపరషన్ గురించి ఆలోచిస్తూ  కిందకి వచ్చి ప్రోటీన్ డ్రింక్ తో వెళ్ళింది 

 

తాను వెళ్లే సరికి పుల్ అప్స్ తీస్తూ అక్కడ ఆమెను చూడగానే కొంటె ఆలోచన వచ్చిన రామ్ అక్కడ డ్రింక్ పెట్టి వెళ్తున్న ఆమెని జాను అని గట్టిగ పిలిచాడు.

 

అతడు పిలవగానే భయం తో బిగుసుకుపోయి వెంటనే తిరిగి ” ఏ.. ఏంటి… రామ్ గారు.. ” అని అడిగింది జాను.

 

” ఇలా రా ” దగ్గరకి పిలిచి “నా దగ్గర వెయిట్స్ సరిపోవట్లేదు…. నన్ను ఇలా గట్టిగ పట్టుకో ….” అని గంబీరంగా చెప్పి తన చేతుల్ని మెడ చుట్టూ వేయించుకున్నాక పుల్ అప్స్ తియ్యడం స్టార్ట్ చేసాడు కానీ ఇక్కడ జాను పరిస్థితి పట్టించుకోలేదు.

 

ఇక్కడ జాను కి మాత్రం అలా అంత దగ్గరగా రామ్ ని చూస్తుంటే నుదిటి మీద చెమటలు పట్టేస్తూ ఒళ్ళు చల్లాబడిపోయింది. 

 

భయంతో రామ్ మెడ చుట్టూ చేతులు బిగించి అతని మెడ వంపుల్లో మొహం దాచుకుంది.

 

ఇద్దరిలో చిన్న అలజడి రిగింది. జాను అక్కడికి వచ్చిన తరువాత ఇద్దరు స్పృహలో ఉండగా మొదటి సారి అంత దగ్గరగా ఉండటం.

 

రామ్ ఆ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తూ 20 పుల్ అప్స్ చేసి కిందకి వచ్చిన కూడా జాను అలాగే పట్టుకుని ఉండేసరికి రామ్ నవ్వు ఆపుకుంటూ ” నేను అంత నచ్చానా ఏంటి జాను….. వర్కౌట్ అయిపోయిన కూడా ఇంకా  చుట్టుకునే ఉన్నావ్….. ” అని చిలిపి నవ్వు తో అన్నాడు.

 

అప్పటి వరకు భయం తో బిగసుకుపోయి స్పృహ తప్పడానికి రెడీ గా ఉన్న జాను రామ్ అలా అనగానే వెంటనే చేతులు తీసేసి అతన్ని చూడలేక జిమ్ రూమ్ నుంచి బయటకి పరుగు పెట్టింది.

 

తను రూమ్ నుంచి బయటకు రాగానే రామ్ బయటకే గట్టిగ నవ్వేసాడు జాను అవస్థ చూసి. జాను మాత్రం అక్కడకి వచ్చిన నాలుగు నెలల నుంచి ఇప్పుడు స్వచ్చంగా నవ్వుతున్న రామ్ నవ్వు కి మైమరుపుగా వింటూ రూమ్ కి వచ్చి రామ్ కి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి వంట చెయ్యడానికి వెళ్ళింది.

 

రామ్ జిమ్ రూమ్ నుంచి బెడ్ రూమ్ కి వచ్చేసి అక్కడ ఉన్న డ్రెస్ చూసి స్మైల్ ఇచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. 20 మినిట్స్ హాట్ వాటర్ తో షవర్ చేసి జాను తీసిన డ్రెస్ లో రెడీ అయ్యి టిఫిన్ చెయ్యడానికి కిందకు వచ్చాడు.

 

జాను టిఫిన్ ప్లేట్ లో పెట్టి ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి సైలెంట్ గా రామ్ పక్కన నించోని ఆలోచిస్తూ ఉంది. 

 

రామ్ తనని పిలుస్తున్న కూడా వినిపించినంతగా ఆలోచనలలో మునిగిపోతుంది.

 

ఎంతసేపటికి తన నుంచి సమాధానం రావట్లేదు అని కోపం గా  ఎడమ చేత్తో తన బ్యాక్ మీద ఒక్కటి పీకాడు. అంతే ముందుకి తూలి మళ్ళీ సరిగా నించోని కోపం గా చూడటానికి ట్రై చేసింది కానీ రామ్ తన చూపుల్లో ఉన్న బాధని వెంటనే పసిగాట్టెడు.

 

జాను ని నెమ్మదిగా పక్క చైర్ లో కూర్చోపెట్టి చైర్ తన దగ్గరగా లాక్కొని బుజం చుట్టూ చెయ్యి వేసి తన గుండెల దగ్గర వల్చుకుంటూ ” ని ఫ్యామిలీ గురించి బాధ పడుతున్నావా…. ” అని చాలా స్మూత్ గా,లో వాయిస్ లో అడిగాడు.

 

అప్పటి వరకు పంటి బిగువునా ఆపుకున్న బాధ వెంటనే కన్నీళ్లు రూపం లో బయటకు వచ్చేసాయి జాను కి.తన వెన్ను నిమురుతూ తన ఆలోచనలు తాను చేస్తూ కాసేపటికి జాను ని పక్కకు జరిపి 

 

” ఏడవకు జాను…, వెళ్లి రెడీ అయ్యి రా… మనం ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి…” అని చెప్పాడు.

 

జాను అయోమయం గా చూస్తూ ఉండడం తో రామ్ మళ్ళీ 

” నా తమ్ముడు జయంత్…. హైదరాబాద్ నుంచి వస్తున్నాడు… “

అని చెప్పి జాను వైపు చూసేడు.

 

అప్పటి వరుకు బాధ తో ఏడ్చినా జాను మొహం లో రంగులు మారాయి.