New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ప్రేమ vs పంతం – 2

ప్రేమ vs పంతం – 2

రామ్ జాను మొహం లో రంగులు మారడం గమనించి జాను అంటూ పిలవడం తో మళ్ళీ నార్మల్ గా ” నేను వెళ్లి రెడీ అయ్యి వస్తాను రామ్ గారు ” అంటూ లేచి వెళ్ళిపోతుంది.

 

 

రామ్ మాత్రం జాను అలా కోప్పడడానికి కారణం తెలుసు కాబట్టి నార్మల్ గా తన ఆఫీస్ రూమ్ కి వెళ్ళిపోతాడు.

 

 

జాను ఫ్రెష్ అయ్యి వచ్చి సైలెంట్ గా టిఫిన్ ప్లేట్ , తన  మెడికల్ కిట్ తీసుకుని గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక రూమ్ లో  పూర్తిగా  హాస్పిటల్  ఈక్వయిప్మెంట్ (equipment) తో బెడ్ మీద చలనం లేకుండా ఉన్న మీనాక్షి గారిని చూడగానే జాను మనసు బాధగా ములుగుతుంది.

 

 

జాను విన్నంత వరకు మీనాక్షి గారు చాలా మంచి వారు , డబ్బు ఉన్న కూడా ఎవరిని చిన్న చూపు చూడని మనుసు ఉన్నవారు అని తెలిసినప్పటి నుంచి తన వల్ల అయినంతవరకు తన ప్రయత్నం తను చేస్తుంది.

 

 

ఆమె గురించి బాధపడుతూ వచ్చి ముందుగా పేషెంట్ కేర్ టేకర్  సహాయం తో  డైలీ  రొటీన్ పూర్తిచేసి షుగర్ లెవెల్స్ , హార్టబీట్ చెక్ చేసాక అన్ని నార్మల్ గా ఉండడం తో ఆమె కి టిఫిన్ తినిపించి , టాబ్లెట్స్ వేస్తుంది.

 

 

మీనాక్షి గారు పరిస్థితి ఎలా ఉంది అంటే ఆమె చూడగలరు, వినగలరు కానీ మాట్లాడలేరు. ఆమె ఏదో చెప్పాలని అప్పుడప్పుడు ట్రై చేసిన స్ట్రెస్ తీసుకోవడం వల్ల స్పృహ కోల్పోతుంటారు. అందుకే ఆమెను ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉండమని జాను మరి మరి చెప్పి ఆమెని సైలెంట్ చేస్తుంది.

 

 

జాను ఆమె దగ్గర ఉన్న కేర్ టేకర్ కి జాగ్రత్తలు చెప్పి రామ్ దగ్గరకు వస్తుంది. రామ్ సీరియస్ గా వర్క్ చేస్తున్న కూడా అతను జాను కోసమే వెయిట్ చేస్తున్నాడు.

 

 

జాను సైలెంట్ గా వచ్చి రామ్ ఎదురుగ నిలబడి మీనాక్షి గారి హెల్త్ రిపోర్ట్ గురించి చెప్తుంది.

 

 

అవన్నీ రోజు వినేవి అయినా రామ్ పట్టించుకోనట్టే విని లాప్టాప్ క్లోజ్ చేసి ” వెళదామా ” అని లేచి బయటకు వెళ్ళిపోతుంటాడు.

 

 

జాను కూడా ఇది తనకు అలవాటే అన్నట్టు తను కూడా సైలెంట్ గా రామ్ ని ఫాలో అవుతూ వెళ్లి కార్ లో కూర్చుంటుంది.

 

 

సడన్ గా ఏదో గుర్తుకు వచ్చినట్టు డ్రైవింగ్ లో ఉన్న రామ్ వైపు తిరిగి ” రామ్ గారు.. , నేను అర్జెంటు గా హాస్పిటల్ కి వెళ్ళాలి….. నన్ను అక్కడ డ్రాప్ చెయ్యండి ప్లీజ్….” అంటూ రామ్ ని పట్టుకొని కుదిపేస్తుంది.

 

 

రామ్ కార్ ని సైడ్ కి ఆపేసి ” ఏమైంది జాను , ఇంత సడన్ గా హాస్పిటల్ కి వెళ్ళాలి అంటున్నావు ఏంటి ” అంటూ కొంచెం సీరియస్ అవ్వడం తో 

 

 

జాను కొంచం రామ్ వైపు జరిగి ” చాలా ఎమర్జెన్సీ కేస్ రామ్ గారు…. , అర్ధం చేసుకోండి…. ప్లీజ్….. ” అంటూ అతని చుబుకం పట్టుకొని ముద్దు గా బ్రతిమిలాడుతుంది.

 

 

రామ్ కూడా ఎమర్జెన్సీ అనేసరికి కాదు అనలేక గాఢంగా నిట్టూర్చి ” ఓకే, వెళ్ళు ” అనగానే రామ్ తను చెప్పిన దానికి ఒప్పుకున్నాడు అన్న హ్యాపీనెస్ లో రామ్ బుగ్గ పై గట్టిగ ముద్దుపెట్టి తరువాత తను చెయ్యాల్సిన పని గురించి ఫారిన్ డాక్టర్స్ కి మెయిల్ పంపిస్తుంటుంది.

 

 

జాను ముద్దు కి మనోడికి ఏదో ఏదో అయిపోయి రెండు నిమిషాలు పాటు తనని తను కంట్రోల్ చేసుకొని కార్ స్టార్ట్ చేస్తాడు.

 

 

అందరికి మెయిల్ పంపించక ఫోన్ పక్కకు పెట్టి రామ్ ని చుసిన జాను కి రామ్ బుగ్గ పై కనిపించిన పీచ్ కలర్ లిప్ బామ్ కనిపించగానే తను ఏం చేసిందో గుర్తుకు వచ్చి తనని తను తిట్టుకుంటుంది.

 

 

ఇక సైలెంట్ గా ఇద్దరి ప్రయాణం హాస్పిటల్ కి చేరగా ” జాగ్రత్త …రామ్ గారు… ” డోర్ ఓపెన్ చేయబోతున్న జాను చెయ్యి పట్టుకొని ఒక్కసారి గా గుంజుకొని తన రెండు చేతులతో బంధీ చేసుకుంటాడు.

 

 

క్షణాల వ్యవధి లో ఏం జరిగిందో అర్ధం అయ్యేలోపు జాను వచ్చి రామ్ వడిలో వాలాగా రామ్ తనని గాడంగా హత్తుకొని తనలో కలిగిన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు.

 

 

రామ్ పరిస్థితి తెలిసి తను అలా చెయ్యడం తప్పు అని తను కూడా గిల్టీ ఫీలింగ్ తో రామ్ మెడ చుట్టూ చేతిని వేసి హాగ్ చేసుకొని మరొక చేతిని అతని జుట్టు లోపల వేళ్ళతో నెమ్మదిగా నిమిరుతూ నుదురు పై ముద్దు పెట్టి మళ్ళీ గట్టిగ హాగ్ చేసుకుని అలాగే ఉండిపోతుంది.

 

 

ఐదు నిమిషాల తరువాత జాను ఫోన్ కి వచ్చిన నోటిఫికేషన్ వల్ల ఇద్దరు తమ ప్రపంచం నుంచి బయటకు వస్తారు.

 

 

రామ్ సైలెంట్ గా తన ని వదిలి వెనక్కి వాళిపోతే, జాను కార్ డోర్ తీసుకోని ఎవరైనా చూశారేమో అని చెక్ చేసుకొని దిగి రామ్ ని చూస్తూ ఉండగానే రామ్ కార్ వెళ్ళిపోతుంది.

 

 

జాను కూడా డల్ గా హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. జాను వెనుక తన  అసిస్టెంట్ కోమలి కూడా వస్తుంది. జాను తన కేబిన్ కి వెళ్లే వరకు స్టాఫ్ అందరూ ‘గుడ్ మార్నింగ్ మేడం ‘ అంటూ విష్ చేస్తుంటే అందరికి ఒక చిన్న స్మైల్ ఇచ్చి కేబిన్ కి వెళ్లి వన్ హౌర్ వరుకు ఓ. పి తీసుకురావద్దు అని కోమలి కి చెప్పేసి వీడియో కాల్ అటెండ్ అవుతుంది.

 

 

ఇద్దరు ఫారిన్ డాక్టర్స్ తో పాటు జాను ప్రాక్టీస్ హెల్ప్ చేసిన ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా కాల్ అటెండ్ అయ్యారు.

 

 

ఆ కాన్ఫరెన్స్ కాల్ ముఖ్య ఉదేశం రామ్ బిహేవియర్ లో జాను నోటీస్ చేసిన చేంజెస్ ని సీనియర్ డాక్టర్స్ చెప్తూ ” కొంచం భయం గా ఉంది సార్….. ” అంటూ జయశంకర్ గారికి భయం గా చెప్తుంటుంది.

 

 

అసలు రామ్ ఏం జరిగింది…..?

జాను ఎవరు…..?

మీనాక్షి గారు ఎవరు……?

 

 

ఆన్సర్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చెయ్యండి…☺️☺️