మధురమే ఈ హృదయం – 2
అతడు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆగకుండా మొగుతున్న తన మొబైల్ ని విసుగ్గా చూస్తూ లిఫ్ట్ చేసిన అతడికి అవతల వాళ్ళు చెప్పింది విని టెంపర్ మీటర్ పెరిగిపోతుంది…
ఫాస్ట్ గా రెడీ అయ్యి తన కార్ కీస్ తీసుకొని రూం దాటి బయటకు వచ్చిన తనని కనీసం బ్రేక్ఫాస్ట్ చేయ్యి అనే మనిషి కూడా లేక మాడుతున్న కడుపులోకి ఫ్రిడ్జ్ లోని చల్లటి బీర్ ఎత్తబోయి మళ్ళీ దాన్ని తీసిన చోటే పెట్టేస్తాడు ఇచ్చిన మాట గుర్తొచ్చి…
పక్కనే టెట్రా ప్యాక్ లో ఉన్న జ్యూస్ గ్లాస్ లోకి కూడా ఒంపకుండా అలానే తాగేసి డబ్బా అవతల పడేసి తన దారిన తను వెళ్ళిపోతాడు కనీసం ఇంటికి లాక్ కూడా వెయ్యకుండా…
అతడు వెళ్లిన కాసేపటికి వచ్చిన మెయిడ్ ఇల్లు మొత్తం క్లీన్ చేసినా అతడి రూంలోకి మాత్రం వెళ్లకుండా హాల్ లో ఉన్న మోషీ ఫోటో కూడా తుడిచి ఫోటో కి దండేసి దీపం పెడితే సిద్ ఆమె నెత్తి మీద దీపం పెట్టి అగరత్తులు వెలిగిస్తాడని అవగాహన ఉండి కామ్ గా డోర్స్ వేసేసి తనకు తెలిసిన పాస్వర్డ్ తో ఇల్లు లాక్ చేసి వెళ్ళిపోతుంది…
అతడి కార్ ఆ ఇల్లు దాటి బయటకు వచ్చి కూర్గ్ రోడ్స్ మీద పరుగులు పెడుతుంటే తన కోసమే వెయిట్ చేస్తున్న అతడి కజిన్ ముందు కార్ తీసుకొచ్చి ఆపుతాడు…
కార్ ఎక్కిన ప్రభాత్ ని కనీసం చూడకుండా తిరిగి కార్ స్టార్ట్ చేసిన సిద్ గమ్యం హైదరాబాద్ లోని మూన్ లైట్ టేల్స్… కాగా సీరియస్ గా ఉన్న అతడ్ని కదిలించే ప్రయత్నం చేస్తాడు ప్రభాత్…
సిద్…
మౌనం అతడి సమాధానం…
సిద్.. పిలిచేది నిన్నే…
హమ్…
అదే మహా భాగ్యం అనుకున్న ప్రభాత్ ఏం ఆలోచిస్తున్నావు రా అని అడుగుతాడు అతడ్ని…
నిన్ను రన్నింగ్ కార్ నుండి తోసెయ్యాలా లేక కొండ పైకి తీసుకెళ్లి తోసెయ్యాలా అని ఆలోచిస్తున్నాను…
అందేంట్రా పుసుక్కున అంత మాట అనేసావ్??
సడన్ బ్రేక్ తో కార్ ఆపిన సిద్ లాగి పెట్టి ప్రభాత్ చెంప పగలకొడతాడు…
చెంపన చెయ్యి పెట్టుకొని కనీసం అతడికి ఎదురు కూడా మాట్లాడకుండా బిక్క మొహం వేసుకొని చూస్తున్న అతడి ఇన్నోసెన్స్ కి ఇంత జరుగుతుంటే నాకు ఇప్పుడా నువ్వు చెప్పేదని అరుస్తాడు…
నాకు రాత్రే తెలిసింది. తెలియగానే నీకే కాల్ చేశాను. కానీ నువ్వు నా కాల్ లిఫ్ట్ చేయలేదు అంటాడు…
అతడిలో ఉన్న ఆ షార్ట్ టెంపర్ నే తనకి ఎన్ని ప్రోబ్లమ్స్ తెస్తున్నా అది వదులుకోలేని అతడి వీక్నెస్ కి అతడు కోల్పోయింది తను ప్రాణంగా అనుకున్న తన ప్రేమ, తన జీవితం అనుకున్న తన ప్యాషన్ …
మోషీ రాసిన బుక్ ఇంకొకరు కంటిన్యూ చెయ్యడం నాకు ఇష్టం లేదు. అదే వచ్చి ఆ బుక్ ని కంప్లీట్ చేస్తుంది…
పిచ్చిగా మాట్లాడకు సిద్. చనిపోయిన మోషిత వచ్చి ఎలా బుక్ ని కంప్లీట్ చేస్తుంది…
మరు నిమిషం ప్రభాత్ గొంతు సిద్ పిడికిట్లో బిగుసుపోతుంటే సిద్ ప్లీజ్ వదులు అంటాడు ఊపిరి భారంగా మారుతుంటే…
అతడ్ని విసురుగా వదిలి మోషితా బతికే ఉంది. ఇంకోసారి తను చనిపోయిందన్న ప్రస్తావన వస్తే నిన్ను తుంగలో తొక్కుతా మైండ్ ఇట్ అని అరిచి టెంపర్ కి తలంతా దిమ్మెక్కి పోతుంటే కార్ డ్రైవ్ చెయ్యమని ప్రభాత్ కి చెప్పి పాసెంజర్ సీట్ లోకి మారతాడు అతడు…
ఫస్ట్ నుండి కుటుంబం, మ్యూజిక్, చదువు, కొన్ని గొడవలు ఇదే తన జీవితం…
కానీ మోషితా వచ్చి తన లైఫ్ మీటర్ పూర్తిగా డిస్టర్బ్ చేసేసి మొత్తాన్ని తనే ఆక్రమించేసింది…
ఎంతలా అంటే తను చనిపోయిందని ఇంట్లో అందరూ అంటున్నారని వాళ్ళని వదిలేసి దూరంగా కూర్గ్ వచ్చేసేంత,,ఏ మ్యూజిక్ షోకి వెళ్లినా తనని చూసే జాలి చూపు భరించలేక, మోషితా లేదని పదే పదే గుర్తు చేస్తున్న మీడియా మీద విసుగుతో తన మ్యూజిక్ ని వదిలేశాడు…
కార్ డ్రైవ్ చేస్తున్న ప్రభాత్ సిద్ నిన్ను ఒక ప్రశ్న అడగనా అంటాడు అతడి మూడ్ ని అంచనా వేస్తూ…
హ్మ్…
అందరూ మోషీ లేదని నమ్ముతుంటే నువ్వు మాత్రమే తనింకా బతికుందని ఎలా అనుకుంటున్నావు??
ఎందుకంటే తను నా ప్రాణం,నేనింకా బతికే ఉన్నా కాబట్టి అది కూడా ఎక్కడో ఓ చోట బతికుంటుందని సుత్తి నేను వాగను..తను లేక్ లో పడిపోయిన దగ్గరనుండి ఇప్పటివరకు తన బాడీ ఎవరూ ఐడెంటిఫై చెయ్యలేదు. ఎక్కడికైనా కొట్టుకుపోవడానికి అది రివర్ కాదు లేక్.. మనుషులని తినే ఫిషస్ కూడా అక్కడ ఉండవు… థట్ టూ చనిపోయిన బాడీ డెన్సిటీ కొన్ని గంటలకు వాటర్ కంటే తక్కువగా ఉంటుంది.సో పైకి తేలాలి.. అలా జరగలేదు… నేను స్పృహ తప్పేలోపు తను వాటర్ లో పడింది. కానీ నాకు పడిన సౌండ్ మాత్రమే కాకుండా ఎవరో వాటర్ మీద కొడుతున్న సౌండ్ చాలా సేపు వినిపించింది …
కానీ కళ్ళు తెరిచేసరికి నేను హాస్పిటల్ లో ఉన్నాను. నా ముందు అందరూ ఉన్నారు కానీ అది లేదు. అడిగితే లేక్ లో పడి చనిపోయింది బాడీ దొరకలేదని అబద్దం చెప్పారు…వాళ్ళ అబద్దం నేను నమ్మలేదని పదే పదే అదే చెప్పి నా బ్రెయిన్ ట్యూన్ చెయ్యడానికి ట్రై చేశారు. అది నాకు నచ్చలేదు. అందుకే అందరికి దూరంగా వచ్చేశాను.కానీ అదెక్కడో బతికే ఉందని నా నమ్మకం…
నమ్మకాలు నిజాలు అవ్వాల్సిన అవసరం లేదేమో సిద్…
పదే పదే ఒకే అబద్దం జపిస్తే అబద్దాలు కూడా నిజాలు కావాలని లేదు ప్రభ…
నీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్న రా.. నా పాత సిద్ నాకు కావాలని ఎమోషనల్ గా సిద్ ని హాగ్ చేసుకున్న ప్రభాత్ ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించుకోడు…
సశేషం… ❤️
Swipe left/right or tap the sides to turn pages