New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మధురమే ఈ హృదయం – 3

మధురమే ఈ హృదయం – 3

నీ నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్న రా.. నా పాత సిద్ నాకు కావాలని ఎమోషనల్ గా సిద్ ని హాగ్ చేసుకున్న ప్రభాత్ ముందు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించుకోడు…

 

 

ఫుల్ లోడేది ట్రక్ వాళ్ళ వైపే దూసుకురావడం గమనించిన సిద్ ప్రభాత్ ని అలెర్ట్ చేసేసరికి అతను దాన్ని తప్పించడానికి స్టీరింగ్ పక్కకు తిప్పేస్తాడు…

 

 

నేరుగా ట్రక్ గుద్దడం తప్పించాడు కాని దానికి పక్కనుండి రాసుకుంటూ వెళ్ళి పక్కనున్న పెద్ద చెట్టుకి కొడతాడు ప్రభాత్…

 

 

అది హైలీ సెక్యూర్డ్ కార్ కాబట్టి వేంటనే ఎయిర్ బల్లూన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది…

 

 

నీ… మూడ్ బాగోక నీ మొహానికి డ్రైవింగ్ అప్పచెప్తే నీ ఎమోషన్స్ తో పడేక్కించేయాలని ఫిక్స్ అయ్యావా…

 

 

అది కాదురా ఏదో కాస్త ఫీల్ అయ్యాను.ఇలా అవుతుందని ఊహించలేదు రా…

 

 

అదృష్టవశాత్తు చిన్నగానే తగిలిన దెబ్బలకి కార్ ని అక్కడే వదిలేసి లిఫ్ట్ కోసం రోడ్ మీదకు వస్తారు ఇద్దరు…

 

 

కాస్త ముందుకు నడిచిన వాళ్ళకి దగ్గర్లో ఓ టీ స్టాల్ కనిపించి చల్లటి వెథెర్ కి వెచ్చగా టీ గొంతులో పోసుకోడానికి ఆగుతారు…

 

 

టీ తాగుతున్నంత సేపు ప్రభాత్ ని కొరకొర చూస్తున్న సిద్ క్యాబ్ బుక్ చెయ్యడానికి చూస్తాడు…

 

 

రిమోట్ ఏరియా అవ్వడం వల్ల అక్కడ ఎలాంటి క్యాబ్ ఫెసిలిటీ లేక లిఫ్ట్ కోసం వచ్చేపోయే వెహికల్స్ ని లిఫ్ట్ అడగమని ప్రభాత్ ని ముందుకు తోస్తాడు సిద్…

 

 

వీడితో ప్రేమగా ఉన్నా డేంజరే అనుకుంటూ వస్తున్న ఓ కార్ లిఫ్ట్ కోసం అపుతాడు ప్రభాత్…

 

 

దూరం నుండి ప్రభాత్ ని చూసి కార్ ఆపమని డ్రైవర్ కి చెప్పిన అమ్మాయి అతడు ప్రభాత్ దగ్గరకొచ్చి స్లో చేశాక కార్ గ్లాస్ కిందకి దించుతుంది…

 

 

కార్ లో ఉన్న అమ్మాయిని చూసి ఓహ్ గాడ్ అనుకున్న ప్రభాత్ ఇదేంటి ఇక్కడుంది అనుకుని భయంగా సిద్ వైపు చూస్తాడు …

 

 

ప్రభాత్ ని చూసి ఎక్సయిటింగ్ గా కార్ దిగిన సమన్విత…. హే ప్రభ నువ్వెంటి ఇక్కడని అడుగుతుంది…

 

 

నా కర్మ కాలి ఉన్నానులే…

 

 

నువ్వెంటి ఇక్కడ?? ఎక్కడ నుండి వస్తున్నావని సీరియస్ గా అడుగుతాడు ప్రభాత్…

 

 

ఫ్రెండ్స్ తో ట్రిప్ కి వచ్చాను. కాని ఎందుకో కొంచెం అన్ఈజీ గా అనిపించి రిటర్న్ అయిపోతున్నా…

 

 

సరే హైదరాబాద్ ఏగా మమ్మల్ని కూడా డ్రాప్ చేయ్…

 

 

మిమ్మల్నా?? ఇక్కడ నువ్వొక్కడివే ఉన్నావ్ గా??

 

 

సిద్ కూడా ఉన్నాడని వెనక్కి తిరిగిన అతడికి సిద్ అక్కడెక్కడ కనిపించకుంటే ఇప్పటివరకు ఇక్కడే ఉండాలిగా అనుకుంటూ చుట్టూ చూస్తాడు….

 

 

కానీ ఎక్కడా అతడి జాడ కనపడక సిద్ కి కాల్ చేస్తాడు ప్రభాత్…

 

 

అతడు లిఫ్ట్ చెయ్యకుండా కట్ చేస్తున్నందుకు అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం అయ్యి నువ్వు వెళ్ళిపో సమన్వి నేను తర్వాత వస్తానని చెప్పి ఆమెను పంపించేసే ప్రయత్నం చేస్తాడు ప్రభాత్…

 

 

అతడ్ని పక్కకు తోసి టీ స్టాల్ వెనక్కి వెళ్లిన సమన్వితకి పిడికిలి బిగించి తన కోపాన్ని అణుచుకుంటూ కనిపిస్తాడు సిద్…

 

 

అన్నయ్య …

 

 

వెళ్ళిపో… వెనక్కి తిరక్కుండానే కోపంగా అతడి నుండి వచ్చిన గొంతుకి నువ్వు కూడా నాతో రా అన్నయ్య అని పిలుస్తుంది భయాన్ని పక్కన పెట్టి…

 

 

సమన్వి విసికించకుండా వెళ్ళిపో…

 

 

నువ్వొస్తేనే నేను వెళ్తాను. లేకుంటే ఇక్కడే నీతో పాటే ఇలాగే ఉంటానని మొండిగా చెప్తుంది సమన్వి…

 

 

గో టూ హెల్… అని అరిచి అతడు ముందుకు వెళ్లిపోతుంటే అతడి వెనకే వెళ్తున్న సమన్వి కాలికి ఉన్న హీల్ రాళ్ల మధ్యలో పడి స్లిప్ అయ్యి కాళ్ళు బెణుకుతుంది…

 

 

అన్నయ్య అని ఆమె అరిచిని అరుపుకి వెనక్కి తిరిగిన సిద్ కి ఆమె కిందపడి ఏడిస్తూ కనిపించి సామ్… ఏమైందని అడుగుతాడు కంగారుగా…

 

 

చాలా కాలం తరువాత తన అన్న నుండి సామ్ అన్న పిలుపుకి నొప్పిని మర్చిపోయి ఈసారి ఆనందంగా ఏడ్చి అతడ్ని గట్టిగా హత్తుకుంటుంది సామ్…

 

 

ఐ మిస్ యు వెరీ మచ్ అన్నయ్య… అని గుక్కపట్టి ఏడుస్తున్న ఆమెను రెండు చేతుల్లోకి ఎత్తుకొని కార్ వైపు తీసుకెళ్తాడు ఏం మాట్లాడకుండా…

 

 

ఆమెని కార్ లో కూర్చోపెట్టి ప్రభాత్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళమని చెప్పి అతడు అక్కడ నుండి వెళ్లిపోతుంటే వెళ్ళనివ్వకుండా గట్టిగా అతడి చెయ్యి పట్టుకొని ఆపేస్తుంది సమన్వి…

 

 

చెయ్యి వదులు సామ్…

 

 

నువ్వు నాతో రా సిద్…

 

 

నాకు ఎవరితో రావాలని లేదు…

 

 

ఈ గోడ్జిల్లాతో మాత్రం తిరుగుతావ??

 

 

ఎవరినే నువ్విప్పుడు గోడ్జిల్లా అన్నది..??

 

 

అతడి మాటలు వినిపించుకోకుండా చెప్పు సిద్ నాతో వస్తావా రావా అని ఈసారి గట్టిగా అడుగుతుంది…

నువ్వు ఇప్పుడు రాకుంటే ఎప్పటికి నీతో మాట్లాడను…

 

 

సామ్… ఎందుకే అందరూ నన్నిలా టార్చర్ చేస్తున్నారు? నాపాటికి నన్ను వదిలేయచ్చు కదా… అసహనంతో కూడిన బాధ అతడి గొంతులో…

 

 

సశేషం…❤️