మనస💞వాచా – 2
టు మినిట్స్ వెయిట్ చెయ్ అని వెనకే ఉన్న రాయల్ పీకాక్ దివాన్ మీద తనని కూర్చోబెట్టి పేరెంట్స్ ని పిలిచి ఇక వెళ్తాము అనడంతో.. ఇద్దరికీ రిచ్యువల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి రెస్ట్ తీసుకోమని రూమ్స్ కి పంపారు.
దీని కోసమే వెయిట్ చేస్తున్న మేఘ ముఖంలో అందమైన కన్నింగ్ స్మైల్. కాళ్ళు నొప్పి ఎగిరిపోయి బూస్ట్ బేబీల ఫాస్ట్ గా తన రూమ్ కి చేరింది.
మేఘనా తో పాటే రూమ్ కి వచ్చిన రుపా గారు తనని ఫ్రెండ్స్ నుంచి కాస్త పక్కకు తీసుకువచ్చి మళ్ళీ ఎటువంటి గొడవ చేసిన ఊరుకునేది లేదు. ఈసారి ఏదైనా పిచ్చి పని చేశావో కచ్చితంగా నా చావు చూస్తావు.
మీ నాన్నగారి పరువు పోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను అని నవ్వు ముఖంతోనే చెవిలో చిన్నగా హెచ్చరించి భోజనం పంపిస్తాను చూసుకోండి అని ఫ్రెండ్స్ తో అనేసి వెళ్లారు.
వెళ్తున్న తల్లిని కోపంగా చూస్తూ పిడికిలి బిగించింది మేఘన.
తెల్లవారి జాము 4:18కి ముహూర్తం.
భోజనాలు పూర్తవుగానే ఆల్మోస్ట్ అందరూ పడుకున్నారు.
రూప గారు మధ్యలో రెండు సార్లు వచ్చి ఫ్రెండ్స్ తో పాటు పడుకున్న మేఘా ని చూసుకొని వెళ్లారు.
మూడింటికి మళ్ళీ రిచ్వువల్స్ స్టార్ట్ అయ్యాయి.
పీటల మీద కూర్చున్న రిత్విక్ తో గణపతి పూజ చేపిస్తున్నారు పూజారయ్య.
మేఘ కోసం రూమ్ లోకి వచ్చిన రూపా గారికి మెలకువగా ఉన్న ఇద్దరి ఫ్రెండ్స్ మోహాలు నల్లబడి కనిపించాయి.
ఏమైంది అని కంగారుగా అడిగితే వాష్ రూమ్ డోర్ లాక్ స్ట్రక్ అయింది ఆంటీ. కాసేపటి వరకు ఓపెన్ చేయడానికి చాలా ట్రై చేసింది.
ఇప్పుడు లోపల నుంచి సౌండ్స్ కూడా లేవు. టెన్షన్ గా ఉంది భయంతో అన్ కాన్షియస్ అయిందేమో.. అని వాళ్లు గంగుర్లు పోతే చెప్తుంటే
నా కూతురికి భయమా.. దెయ్యాలు కూడా దాన్ని చూసి భయపడి పారిపోతాయి అని తన అనుమానం నిజం కాకూడదు అనుకుంటూనే గట్టి గట్టిగా తలుపు కొడుతూ మేఘ ఉన్నావా లేదా..?? అని ఎంత అరిచిన లోపల నుంచి రెస్పాన్స్ లేదు.
చేసేసింది.. అది చేయాలనుకున్నది చేసేసింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారికి నేను ఏం చెప్పాలి..?? అని నెత్తి నోరు కొట్టుకుంటూ వాష్ రూమ్ దగ్గరే కుప్ప కూలిపోయారు రూప.
ఫంక్షన్ హాల్ మొత్తం ఒక లాంటి ఘంబీర్యం అల్లేసుకుంది.
ఎవరి మొఖాలలో ప్రశాంతత లేదు.
జితేంద్ర వర్మ కోపంతో భార్య మీద రంకెలు వేస్తున్నాడు.
రిత్విక్ ఇంకా అతని పేరెంట్స్ జితేంద్ర ని ఆపడానికి ట్రై చేస్తున్నారు.
తిని మత్తుగా నిద్రపోతున్న బంధువులందరూ గుంపులు గుంపులుగా చేరి పెళ్లికూతురు లేచిపోయింది అని మీటింగ్ లు పెట్టారు.
రిత్విక్ ముఖంలో నెత్తురు చుక్క లేదు.
కదిలితే కొట్టేలా ఉన్న అతని కోపానికి అతని ఫ్రెండ్స్ అందరు దూరంగా ఉన్నారు.
సరిగ్గా 4:18 ఎవరు ఊహించని విధంగా మండపంలో మంగళవాద్యాలు వినిపించడమే అందరూ స్తంభించిపోయారు.
ఇటు చూడండి అని ఎవరో గట్టిగా అరిచిన అరుపుకి మండపంలో వాదులాడుకుంటున్న అందరూ పరుగులు మీద వచ్చేసరికి.. మేఘ మెడలో మూడు ముళ్ళు వేయడం పూర్తయిపోయింది.
జితేంద్ర ఫంక్షన్ హాల్ తో గాని అక్కడ పంతులుగారు లేదా మేళం వాళ్లతో సంబంధం లేకుండా.. మరొక మినీ మ్యారేజ్ సెట్ అప్ అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
నార్త్ ఇండియన్ రెడ్ లెహంగా వెడ్డింగ్ డ్రెస్ లో ఉండవలసిన మేఘన సౌత్ ఇండియన్ తెల్లని తలంబ్రాల బట్టలలో అర్జున్ చేతిని పట్టుకొని బెదురు సంతోషం కలిసిన ఒకలాంటి ఉద్వేగంతో ఉంది.
కోటేరు ముక్కు, కంప్లీట్ కాన్ఫిడెన్స్ తో కూడిన పదునైన చూపులు, పెదవుల మీద కని కనిపించని నవ్వు, రఫ్ లుక్స్ తో ట్రిమ్ చేసిన మిసకట్టు, మేఘ కన్నా కాస్త రంగు తక్కువైన ఆరు అడుగుల అతని నిలువెత్తు రూపంలో ఏదో బలమైన ఆకర్షణ.
మేఘ చేతి వేళ్లను లాక్ చేసి నా సొత్తు అన్నట్టు అందరిని పాయింట్ చేస్తున్న అర్జున్ చురుకైన చూపులకి ఆవేశంతో ఎగిరి పడుతూ ఎవడ్రా నువ్వు..?? అని అరిచారు జితేంద్ర.
అర్జున్.. మన మేఘ ప్రేమించిన అర్జున్ అని రూప గారు బెదిరిపోతూ చెప్పారు.
ఎంత ధైర్యం ఉంటే నా కూతురిని మాయ చేసి నీ వలలో వేసుకుంటావు..?? అని అరుస్తున్నాడు జితేంద్ర.
మాయలో పడే వయసు కాదు అప్పా నాది. ప్రేమిస్తున్న అంటే మీరు వినిపించుకోలేదు, కనీసం ఒక్క మాట కూడా అడగలేదు అమ్మకు చెప్తే అప్ప చెప్పిందే ఫైనల్ అని గిరి గీసి నన్ను బంధించింది.
చివరి హోప్ గా బావకు చెప్పాను. నీ ప్రేమ కోసం నువ్వు చూసుకున్నట్టే నా ప్రేమ కోసం నేను చూసుకుంటాను అని కొటేషన్స్ కొట్టాడు.
మీరు మీ స్వార్థం చూసుకున్నట్టే నేను నా స్వార్థం చూసుకున్నాను. అని తండ్రికి తగ్గట్టే ఆన్సర్ ఇచ్చింది మేఘ.
ππππππππππππππππππππππππππππππππππ
చదివి రేటింగ్ ఇవ్వండి అలాగే కామెంట్స్ లో చెప్పండి స్టోరీ ఎలా ఉందని…
ఏ ఒక్కరు మిస్ చేయొద్దు..🫶💖🫶
__వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages