మనస💞వాచా – 3
చివరి హోప్ గా బావకు చెప్పాను. నీ ప్రేమ కోసం నువ్వు చూసుకున్నట్టే నా ప్రేమ కోసం నేను చూసుకుంటాను అని కొటేషన్స్ కొట్టాడు.
మీరు మీ స్వార్థం చూసుకున్నట్టే నేను నా స్వార్థం చూసుకున్నాను. అని తండ్రికి తగ్గట్టే ఆన్సర్ ఇచ్చింది మేఘ.
అసలు ఎవడ్రా నువ్వు.. నా కూతుర్ని నాకే ఎగైనెస్ట్ గా మాయ చేసావు అని కూతురి సమాధానం రుచించక మరింత ఆవేశ పడ్డాడు జితేంద్ర.
రిత్విక్ పేరెంట్స్ ఆయన్ని హోల్డ్ చేస్తుంటే.. నీ క్యారెక్టర్ కరెక్టుగా లేదని నేను మేఘా ను వార్న్ చేశాను. అయినా చీట్ చేసి నువ్వు అనుకున్నది సాధించావు.
యు ఇడియట్, ఇక్కడితో నిన్ను వదలను.. అంటూ అర్జున్ మీదకి దూసుకొచ్చాడు రిత్విక్.
అతని స్పీడ్ కి అడుగు ముందుకు వేసిన అర్జున్.. భార్యను తన భుజం వెనక్కి నిలుపుకుంటూ రిత్విక్ కాలర్ పట్టి ఆపి.. నా భార్య ప్రేమ కోసం నేను ఏం చేశానో నా భార్యకు తెలుసు. కూరలో కరివేపాకు లాంటి నీకు ఇక్కడ క్వశ్చన్ చేసే రైట్ లేదు అని రిత్విక్ ని పక్కకు తోసేసాడు.
కోపంతో అరుస్తూ మళ్ళీ మీదికి వస్తున్న రిత్విక్ ని అతని ఫ్రెండ్స్ కంట్రోల్ చేస్తున్నారు.
నా కూతురి జీవితం గురించి అడిగే రైట్ అన్ని విధాల నాకు ఉంది.. అంటూ మరుక్షణమే మీదికి వచ్చారు జితేంద్ర.
చూడండి మామయ్య.. రూల్స్ ప్రకారం చూసిన ఎమోషన్ ప్రకారం చూసిన నేను తాళి కట్టకు ముందు వరకు మేఘ మీ కూతురు. ఇప్పుడు తను నా భార్య, నా సొత్తు. శాస్త్రోక్తంగా మీ అందరి కళ్ళముందే మేఘ కోరినట్టు తన మెడలో తాళి కట్టి నా సొంతం చేసుకున్నాను.
నా పేరు అర్జున్, ఇప్పటివరకు మీ కూతురుగా ఉన్న మేఘన వర్మ ఇకమీదట నా భార్య మేఘ అర్జున్.
తనతోనే నా ప్రపంచం పరిపూర్ణమైంది, ఇకమీదట తన వెనుక ఉన్న మీరంతా కూడా నా వాల్లే.. అని గౌరవం గాంబీర్యం కలిపి జితేంద్రకు కావలసిన అన్ని వివరాలు చెప్పాడు అర్జున్.
క్షణం అయోమయంగా మొహాలు చూసుకున్న అందరిలో అర్జున్ పట్ల ఒక లాంటి తేలిక భావం.
నువ్వు.. నువ్వు అనాధవా..?? అని ఒక్కసారిగా అర్జున్ మీదకు వచ్చి పట్టు బట్టల్లో ఉన్న అతని కాలర్ బిగించి వెనక ముందు ఎవ్వరూ లేని నీలాంటి వీధి కుక్క నా కూతురు జీవితంలో ఉండడానికి వీల్లేదు అని అరుస్తుంటే
రెప్పపాటు కాలంలో తండ్రి చేతుల్ని విడిపించి వెనక్కి తోసిన మేఘ.. నేను ఉండగా నా భర్త అనాధ కాదు. మీరు మర్యాద మర్చిపోతే నాకు తండ్రి అన్న విషయం నేను కూడా మర్చిపోతాను.. అని గట్టిగా అరిచి చెప్తూనే తల్లిని చూసి గడప దాటితే చచ్చిపోతానని నన్నే బెదిరించావు కదమ్మా, ఇన్ని సంవత్సరాలు అన్ని సుఖసంతోషాలు అనుభవించావు.
బట్ నేను ఇప్పుడే నా లైఫ్ స్టార్ట్ చేశాను, నీ భర్త గౌరవం కోసం నన్ను బెదిరించి భయపెట్టి మీ ఇష్టానికి పెళ్లి చేయాలని చూశారు కదా..
అందుకే చెప్తున్నాను, మీ ఆయన గౌరవం కోసం ఇప్పుడు నువ్వు చచ్చిపో.. అని తల్లికి చెప్పిన మేఘ మీ గౌరవం కోసం ఇక నన్ను మర్చిపోండి.. అని తండ్రికి కూడా చెప్పి రిత్విక్ ని చూస్తూ.. నీ ప్రేమ గెలవాలని నీ స్వార్థం కోసం నన్ను నీ పక్కన కదలకుండా కట్టేసావు.
బట్ నా ప్రేమ గెలవాలంటే నేను ఎక్కడున్నా అర్జున్ నా పక్కనే ఉంటాడు. దట్ ఇస్ మై అర్జున్.
ఇది మీ అందరికీ తెలియాలనే ఇక్కడే మీ అందరి ముందు ఇలా పెళ్లి చేసుకున్నాను. ఇక నేనెవరిని పట్టించుకోను.
అర్జున్ తప్ప ఇక ఎవరు నాకు అక్కర్లేదు అని భర్త చేతిని బలంగా బిగించి అందర్నీ బెదురు వదిలేసిన కోపంతో చూస్తున్న భార్యని చెప్పవలసింది చెప్పేసి తీసుకువెళ్లాడు అర్జున్.
సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత..
అర్జున్ మేఘ లా పెళ్లిరోజు. ఫ్యామిలీ కోర్టులో జడ్జి గారి ముందు పక్క పక్కగా నిలబడ్డారు ఇద్దరు.
ఎంతటి ఆవేశంతో ఆరోజు తల్లి తండ్రి తన వాళ్ళందరినీ ఎదిరించి అర్జున్ చేయి పట్టుకొని వచ్చేసిందో ఇప్పుడు అంతకు రెండింతల దుఃఖంతో అర్జున్ ని చూడడానికి కూడా ఇష్టం లేని కోపం అసహ్యంతో ఉంది మేఘ.
తల దించి ఉన్న అర్జున్ కళ్ళు బంగారు మెట్టెలతో మెరుస్తున్న మేఘ గులాబీ రంగు వేళ్ళ మీద నిలిచి ఉన్నాయి.
మౌనంగా ఉన్న అర్జున్ గుండె లో కల్లోలంగా విరుచుకుపడుతున్న కడలి హోరు.
డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసిన జడ్జ్ గారు.. మ్యూచువల్ డివర్స్ కోసం ఇక్కడ నిలబడిన మీ ఇద్దరు అన్ని విషయాలు చర్చించుకున్నారా..?? ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కోర్టు ముందు చెప్పొచ్చు అని ఇద్దరినీ ఉద్దేశించి చెప్పారు.
అర్జున్ భారమైన ఊపిరితో తలెత్తి ముందుగా జడ్జ్ గారిని తరువాత మేఘ ను చూశాడు తన రెస్పాన్స్ కోసం.
చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధమే లేనట్టు తనలో తానే తగలబడి పోతున్న మేఘ జడ్జ్ మీదే కళ్ళు నిలిపి.. ఇంకా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. అతని నుంచి నాకు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించండి అని చెప్పింది.
మేఘ ఆన్సర్ తప్ప అర్జున్ చెవులకు ఇంకా ఏది వినిపించలేదు.
పగబట్టిన నిశ్శబ్దాన్ని చీల్చినట్టు.. నాకు ఇష్టమే అని ఒకటే ఆన్సర్ ఇచ్చాడు అర్జున్.
ππππππππππππππππππππππππππππππππππ
కామెంట్స్ మస్ట్ బేబీస్..
ఏ ఒక్కరు మిస్ చేయొద్దు..🫶💖🫶
__వర్ణ.
Swipe left/right or tap the sides to turn pages