చుట్టూ ఉన్న ప్రపంచంతో సంబంధమే లేనట్టు తనలో తానే తగలబడి పోతున్న మేఘ జడ్జ్ మీదే కళ్ళు నిలిపి.. ఇంకా డిస్కస్ చేయడానికి ఏమీ లేదు. అతని నుంచి నాకు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించండి అని చెప్పింది. మేఘ ఆన్సర్ తప్ప అర్జున్ చెవులకు ఇంకా ఏది వినిపించలేదు. పగబట్టిన నిశ్శబ్దాన్ని చీల్చినట్టు.. నాకు ఇష్టమే అని ఒకటే ఆన్సర్ ఇచ్చాడు అర్జున్. ఇద్దరి యొక్క అభిప్రాయం మీద జడ్జ్ గారు ఇద్దరి వైపు ఉన్న లాయర్స్ తో మాట్లాడి నెక్స్ట్ మ…