మై మాన్స్టర్ 😈 – 2
హైదరాబాద్
సమయం సుమారు రాత్రి 11 గంటల 30 నిమిషాలు ఇంకొక అరగంటలో న్యూ ఇయర్ రాబోతుంది అని సిటీలో ఉన్న యువత మొత్తం పబ్స్ లోనే ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు
ది మిడ్ నైట్ క్రౌన్ అనే పబ్ లో
డిం లైట్ వెలుతురులో పాప్ మ్యూజిక్ పెట్టుకొని పబ్ మొత్తం మారు మ్రోగి పోయేలాగా సౌండింగ్ సిస్టమ్స్ అరేంజ్ చేసి ఉన్నారు
అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తేడా లేకుండా తాగుతూ అక్కడే ఫ్లోర్ మీద నిలబడి డాన్సులు చేస్తూ ఉన్నారు
అక్కడ అందరి మధ్యలో ఒక అమ్మాయి మాత్రం బ్లాక్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకొని చెవులకి సిల్వర్ కలర్ ఆక్సిడైజ్డ్ బుట్ట కమ్మలు పెట్టుకుని మెడలో కూడా ఆక్సిడైసేడ్ చిన్న నెక్లెస్ లాంటిది వేసుకొని రెండు చేతులకి మెటల్ గాజులు వేసుకుని వాళ్లతో అసలు తనకి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టు ఒక మూలకి నిలబడి అసహనంగా చూస్తూ ఉంది
బాబోయ్ ఇది ఫుల్లుగా తాగేస్తుంది ఇప్పుడు నేనే డ్రైవింగ్ చేసుకుని వెళ్లాలి దీన్ని అనుకుంటూ దూరంగా నిలబడి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి డాన్స్ చేస్తున్న తన ఫ్రెండ్ వైపు చూస్తూ గోర్లు కొరుక్కుంటూ ఉంది ఆ అమ్మాయి
ఇంతలో అక్కడికి వచ్చాడు ఒకడు హాయ్ బేబీ ఏంటి సింగిల్ గా ఉన్నావా రా మనం బెల్లీ డాన్స్ చేద్దాం అంటూ చొరవగా ఆమె చేతిని పట్టుకోపోయేంతలో ఆమె తన చేతిని వెనక్కి లాగేసుకొని సారీ నాట్ ఇంట్రెస్టేడ్ అని పొలైట్ గా సమాధానం చెప్పింది
అలా అంటే ఎలా అక్కడ చూడు అందరూ ఎలా డాన్స్ చేస్తున్నారు అని చూశాడు
ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడు తెలియదు కానీ అక్కడికి వచ్చిన ఒకడు బాస్ అమ్మాయి ఇష్టం లేదు అని చెప్తుంది కదా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అడిగాడు వాడి వైపు చూస్తూ
నా ఇష్టం నీకేంటి ప్రాబ్లం నువ్వు ఏమైనా దాని బాయ్ ఫ్రెండ్ వా లేదంటే దాని అన్నయ్యవా అడిగాడు. వాడు వచ్చిన అబ్బాయి వైపు చూస్తూ
ఎస్ నేను తన అన్నయ్యనే అయితే ఏంటి వెలవ్ అంటూ సీరియస్ గా చెప్పడంతో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వాడు
వాడు వెళ్లిపోయిన వెంటనే ఆ అమ్మాయి వచ్చిన అబ్బాయి వైపు చూస్తూ చాలా థాంక్స్ అన్నయ్య కృతజ్ఞతగా
ఆ అమ్మాయి వైపు చూసిన అబ్బాయి చిన్న చిరునవ్వు నవ్వి హాయ్ ఐ యాం చరణ్ అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు
సత్యభామ తన చెయ్యి ముందుకి చాపుతూ షేక్ హ్యాండ్ ఇచ్చింది సత్య
అసలు పబ్జి ఏమాత్రం సంబంధం లేనట్టున్నావ్ ఇక్కడేం చేస్తున్నావ్ రా అడిగాడు చరణ్ సత్య వైపు చూస్తూ
అదిగో అక్కడ దూరంగా డాన్స్ చేస్తుంది కదా బ్లాక్ కలర్ జీన్స్ లో తను నా ఫ్రెండ్ అన్నయ్య అది బలవంతం పెడితేనే ఇక తప్పక ఇక్కడ వరకు వచ్చాను ఇప్పుడేమో అది కనీసం నన్ను పట్టించుకోకుండా దాని బాయ్ ఫ్రెండ్ తో డాన్సులు వేస్తోంది వెళ్లిపోదామంటే మళ్ళీ ఒక్కరితే అయిపోతుంది అని ఆలోచిస్తున్నా అంది సత్య
అవునా ఎప్పుడైనా స్ట్రాంగ్ గా ఉండు రా ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ లో ఎదవలు ఎక్కువగా ఉంటారు కాబట్టి కొంచెం నువ్వు మీ జాగ్రత్తలో ఉంటే మంచిది అన్నాడు చరణ్
అలాగే అన్నయ్య అని చిన్న చిరునవ్వుతో చెప్పింది
ఇంతలో టైం 12 అవడంతో ఒక్కసారిగా మ్యూజిక్ ఆగిపోయి పెద్ద పెద్ద టపాసుల పేలుడుతో హ్యాపీ న్యూ ఇయర్ అని వెనకనుంచి గట్టిగా అరుపులు డిజె సౌండ్స్ రావడంతో అందరూ ఒకరికి ఒకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ ఉన్నారు
సత్య చరణ్ వైపు చూస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అన్నయ్య అంది చిరునవ్వుతో
హ్యాపీ న్యూ ఇయర్ రా ఈ న్యూ ఇయర్ నాకు వస్తూ వస్తువుని నాకు ఒక చెల్లిని తీసుకొచ్చింది అని నవ్వుతూ చెప్పాడు చరణ్
నాక్కూడా ఒక మంచి అన్నయ్యని ఇచ్చింది. అంది సత్య
వీళ్లు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన సత్య ఫ్రెండ్ మమ్మీ ఫోన్ చేస్తుంది అక్కడి నుంచి లాక్కొని వెళ్ళిపోతే సత్య వెనక్కి తిరిగి చరణ్ కి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది
క్రేజీ గర్ల్ అనుకుంటూ నవ్వుకొని అక్కడి నుంచి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు చరణ్
ఏంట్రా ఎవరో అమ్మాయితో ఇప్పటివరకు మాట్లాడుతున్నట్టు ఉన్నావ్ ఎవరు ఆ అమ్మాయి అడిగాడు తన ఫ్రెండ్
చెల్లి అని చెప్పేసి వాళ్ళ పక్కనే కూర్చుని బీర్ తాగుతూ ఉన్నాడు
@@@@@
న్యూ ఢిల్లీ
అర్థరాత్రి నేను మనుష్యంగా ఉన్న రోడ్డు మీద కాళ్ళ మీద కూర్చోబెట్టి ఏరా మీరు ఏం చేసినా ఇక్కడ అందరూ మూసుకొని కూర్చుంటారు అని అనుకుంటున్నారా ఇక్కడ ఉన్నది ఏజెంట్ విక్రమ్ అయినా మీకు ఎప్పుడూ దొంగ దెబ్బతీసే అలవాటేనేంట్రా ఒక్కసారి కూడా నిజాయితీగా ముందు నుంచి ఎటాక్ చేయలేరా అంటూ వాళ్ల మీద అరుస్తూ వాళ్లని అదే రోడ్డు మీద కొట్టడం మొదలుపెట్టాడు
విక్కీ కొట్టే కొట్టుడుకి వాళ్ల శరీరం నుంచి ధారగా రక్తం కారుతున్న కూడా అసలు కనికరం అన్నది ఏ మాత్రం లేకుండా ఇంకొకసారి మీలాంటి వాళ్లని మా దేశంలోకి పంపించాలంటే మీ దేశం వాళ్లు భయపడేలా చేస్తారా మీ చావు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేలా చేయకపోతే నా పేరు విక్రమ్ కృష్ణ నే కాదు అంటూ కోపంతో ఊగిపోతూ తన మనుషుల వైపు చూస్తూ ఆఫీసర్స్ వీళ్ళని తీసుకొని మన ప్లేస్ కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి అక్కడి నుంచి తను కూడా స్టార్ట్ అయ్యాడు
——–continues………………..
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ
Swipe left/right or tap the sides to turn pages