New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
మై మాన్స్టర్ 😈 – 3

మై మాన్స్టర్ 😈 – 3

 

 

 

 

 

 

 

విక్కీ కొట్టే కొట్టుడుకి వాళ్ల శరీరం నుంచి ధారగా రక్తం కారుతున్న కూడా అసలు కనికరం అన్నది ఏ మాత్రం లేకుండా ఇంకొకసారి మీలాంటి వాళ్లని మా దేశంలోకి పంపించాలంటే మీ దేశం వాళ్లు భయపడేలా చేస్తారా మీ చావు వాళ్ళ వెన్నులో వణుకు పుట్టేలా చేయకపోతే నా పేరు విక్రమ్ కృష్ణ నే కాదు అంటూ కోపంతో ఊగిపోతూ తన మనుషుల వైపు చూస్తూ ఆఫీసర్స్ వీళ్ళని తీసుకొని మన ప్లేస్ కి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని పంపించేసి అక్కడి నుంచి తను కూడా స్టార్ట్ అయ్యాడు  

 

వాళ్లని స్పెషల్ జైల్లో ఖైదు చేసి బయటికి వచ్చేసరికి టైం 1:30 అయింది 

 

న్యూ ఇయర్ కావడంతో చుట్టూ బైక్స్ మీద మీ యూత్ అంతా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే విక్కీ తన కార్లో  ఇంటికి స్టార్ట్ అయ్యాడు 

 

కార్లు ఎఫ్ఎం ఆన్ చేసి పాటలు వింటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నత నా మొబైల్ కి ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది 

 

హ్యాపీ న్యూ ఇయర్ సర్ అని ఉన్న మెసేజ్ చూసిన విక్కీ పెదవులు అందంగా విచ్చుకుంటే వెంటనే హ్యాపీ న్యూ ఇయర్ డార్లింగ్ ఇంతకీ ఈ రోజైనా తమరి దర్శన భాగ్యం నాకు దొరుకుతుందా అంటూ మెసేజ్ పెట్టాడు ఆ మాటకి అటు నుంచి అబ్బా నువ్వు రోజు నన్ను నా ఫొటోస్ అడగకుండా ఉండవా నాకు భయమేస్తుంది రా అంటూ మెసేజ్ పెట్టింది 

 

ఏయ్ సిక్స్ మంత్స్ నుంచి నాతో మాట్లాడుతున్న ఇంకా నా మీద నమ్మకం కలగలేదా కొంపతీసి నేను ఏమైనా నీ ఫొటోస్ చూసి వాటిని మార్ఫ్ చేసి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తాను అనుకుంటున్నావా ఏంటి అడిగాడు విక్కీ 

 

చ అంతలేదు కానీ నేను ఎక్కువ ఫొటోస్ దిగను నాకు నచ్చదు అంతే నువ్వు ఇంకొకసారి నన్ను ఫొటోస్ అడిగితే నిన్ను బ్లాక్ చేసేస్తా అంటూ రిప్లై వచ్చింది అటు నుంచి 

 

సరే సరే అడగనులే నీకు ఇష్టమైనప్పుడే నీ ఫోటో నాకు పంపించు అంటూ విక్కీ పెట్టిన మెసేజ్ కి నవ్వుతున్న సింబల్ పెట్టి ఏ పబ్లు తాగుతున్నావ్ అంటూ తిరిగి మెసేజ్ పెట్టింది 

 

విక్కీ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ డ్రైవింగ్ లో ఉన్నాను ఇంటికి వెళ్ళాక పింగ్ చేస్తాను అని మెసేజ్ పెట్టేసి ఫోన్ పక్క సీట్లోకి విసిరి డార్లింగ్ ఏంజెల్ నిన్ను ఎలా కనిపెట్టాలే నాకున్న సోర్స్ చేద్దామంటే వద్దులే నువ్వు ఎప్పుడు నీ నెంబర్ నీ ఫేస్ నాకు కనిపించాలి అనుకుంటావో అప్పుడే అవన్నీ అవుతాయి అంతవరకు ఇలా నిన్ను చూడకుండానే నీతో ట్రావెల్ చేస్తున్న అసలు ఇది ఏం ఫీలింగో కూడా నాకు అర్థం కావట్లేదు అనుకుంటూ తన ఇంటికి చేరుకున్నాడు 

 

 

@@@@@@@@ 

 

 

ఇక్కడ చరణ్ తన ఫ్రెండ్స్ తో ఇంకా పబ్ లోనే ఎంజాయ్ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చింది ఒక అమ్మాయి 

 

హలో బాస్ ఎక్స్క్యూజ్మీ అంటూ చరణ్ ని దాటుకుని తాగుతూ వాడి ముందే కూర్చుని రేయ్ రోహిత్ యు ఇడియట్ నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది రా అని అప్పటికే బాగా తాగడంతో ఇంకా తాగుతూ మత్తుగా అరుస్తూ ఉంది ఆ అమ్మాయి 

 

తనని చూసిన చరణ్ ఏంటి లవ్ ఫెయిల్యూరా అడిగాడు మెల్లగా వైన్ తాగుతూ 

 

ఎవడ్రా నువ్వు నా గురించి నీకెందుకు ఎక్కువ తక్కువ మాట్లాడితే మూతి పళ్ళు రాలగొడతా వెధవ ఈ భూమి అంటే ఏమనుకుంటున్నావు చమడాలు వలిచేస్తా బిడ్డ అంటూ వేలు చూపించి బెదిరిస్తున్న భూమిక వైపు మొదటిసారి చూశాడు 

 

ఇంతకుముందు పెద్దగా గమనించలేదు కానీ ఎప్పుడు గమనిస్తుంటే మాత్రం భలే అనిపిస్తుంది చరణ్ కి 

 

అందమైన ముఖారవిందము పెద్దపెద్ద కలువ రేకు లాంటి కళ్ళు చక్కగా చెక్కినటువంటి చిన్ని ముక్కు లిప్స్టిక్ రాసుకున్న అందమైన పెదాలు మొత్తానికి చూడడానికి ఒక బుట్ట బొమ్మ లాగా ఉంది 

 

తనని చూసిన చరణ్ నాతో డాన్స్ చేస్తావా అడిగాడు ఒక రకమైన ట్రాన్స్లో 

 

రేయ్ ఏంట్రా పులిహోర కలుపుతున్నావా మూసుకొని దొబ్బెయ్ అని తను తీసుకున్న గ్లాస్ అయిపోవడంతో ఇంకొక క్లాస్ కోసం చెయ్యి వెనక్కి పెట్టింది భూమి 

 

అలా పెట్టిన భూమి చేతిని తన చేతుల్లోకి తీసుకొని కం లెట్స్ డాన్స్ అని బలవంతంగా తన చేయి పట్టుకొని డాన్సింగ్ ఫ్లోర్ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు 

 

భూమి వాడి మెడ చుట్టూ చేతులు వేసి ఏరా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అడిగింది మత్తుగా కళ్ళని మూస్తూ తెరుస్తూ 

 

ఆ మాటకి చరణ్ భూమి వైపు చూస్తూ నువ్వు ఎంత హాట్ గా ఉన్నావో తెలుసా నన్ను పెళ్లి చేసుకుంటావా అడిగాడు చరణ్ 

 

ఏంట్రా ఏదో అడుగుతున్నావ్ అడిగింది భూమి వినబడక 

 

నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నా అన్నాడు చరణ్ 

 

ఆ మాటకి మధ్యలో ఉన్న భూమి చూస్తూ వాడి పెదాలను అందుకుంది 

 

చరణ్ కూడా భూమి పెదాలను అందుకుని మంచి ఇంగ్లీష్ కిస్ ఒకటి లాగించేసి ఆ తర్వాత తనని దూరం చేసి ఫిక్స్ అయిపో నువ్వు మత్తులో చేశావో తెలిసి చేశావో తెలియక చేసావో నాకు అదంతా అనవసరం నన్ను ముద్దు పెట్టుకున్నావ్ నేను ముద్దు పెట్టుకున్నా నన్ను ముద్దు పెట్టుకున్న మొదటి అమ్మాయివి నువ్వే. సో చచ్చినంత వరకు ఇక నేను నీతో మాత్రమే ఉంటా నువ్వు నాకు మాత్రమే సొంతం. నీ తనువు నీ మనసు మొత్తం అన్ని నాకే ఫిక్స్ అయిపో బేబీ డాల్ అని తన నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని తనతో కలిసి హ్యాపీగా స్టెప్స్ వేస్తూ ఉన్నాడు చరణ్ 

 

వాడితో కలిసి భూమి కూడా మత్తులో ఏం చేస్తుందో తెలియక గెంతుతూ ఉంది 

 

 

(( కానీ అదే తన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అని ఆ క్షణంలో మన భూమి పాపకి అస్సలు తెలియదు ))

 

 

 

 

——–continues……………..

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ