ముందు రోజు రాత్రి జరిగిన గొడవ కారణంగా ఆ రూంలో పగిలిపోయిన ఉన్న ఫ్లవర్ వాస్ సీసాలు అవి నీట్ గా క్లీన్ చేసి రూం అంతా సర్దుతూ ఉండగా అంతలో ఎవరో వచ్చి వాళ్ళు ఉన్న రూం డోర్ కొట్టారు….అభి కొంచం భయంగా , బెరుకుగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది…..
అభి డోర్ ఓపెన్ చేయగానే రాత్రి జరిగిన విషయం చెప్పి జానకమ్మ గారు వాళ్ళు ఈ రోజు సాయంత్రం కి ఇంటికి వస్తారు అంట…..మీకు కావలసినవి అన్నీ కనుక్కొని చేసి పెట్టమని చెప్పారు….ఇడ్లీ , దోశ , వడ చేశాము….మీరు ఏం తింటారో చెప్తే అది కూడా చేస్తాను…అని చెప్పింది….