వీధిలో వాళ్ళు అమ్మాయి గారు రాలేదు అని చెవులు కొరికేసుకుంటున్నారమ్మా “ ఏయ్.. గౌరీ.. ఇందాకే చెప్పా కదే.. తనకి ఆరోగ్యం బాలేక గది బయటకి రాలేదు.. ఈ రోజు ప్రొద్దునే చిన్నా బెంగళూరు తీసుకు వెళ్ళాడు.. అని మళ్ళీ ఏంటి నీ ఆరాలు.. ఏమి లేదు పెద్దమ్మ గారు… అని తను గిన్నెలు కడగడానికి వెళ్తే.. ” ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా మీకు అంటూ కోడళ్ళ వైపు చూస్తారు భానుమతి గారు హ్మ్.. అని ఇద్దరు ఒకేసారి…