రాక్షస ప్రేమిక – 3
రక్తం ఇంకా కారుతుంటే…కార్ లో మొత్తం వెతుకుతాడు…కనీసం టిస్యూ పేపర్ కూడా లేకపోవడం తో…అతడు వేసుకున్న షర్ట్ బటన్స్ తీసేసి…చిన్న ముక్కగా చేసి చేతికి కట్టిన రక్తం ఆగకపోయేసరికి…షర్ట్ అంతా చేతికి గట్టిగా ముడి వేసేసరికి…అతడికి గుండె వేగం పెరుగుతుంది…ఇంక కార్ స్టార్ట్ చేసి… ఏసీ ఆన్ చేస్తాడు…కాస్త దూరం వెళ్తూ పక్కకి చూసిన అతనికి…ఊపిరి కష్టంగా తీసుకుంటున్న అలకనంద కనిపించగానే.. ఏం చెయ్యాలో అర్థమే కాదు…కానీ తనని బ్రతికించాలి అనే ఆశ మాత్రం ఉండడం తో…పక్క సీటు లో తన చేతికి తాకకుండా….ముందుకి వంగి అలకనంద వైపు చూస్తాడు…
ఆమె ఊపిరి అందక అవస్థలు పడుతుంటే…ఒక డీప్ బ్రీత్ తీసుకుని తన పెదవులు అందుకుని అతడి ఊపిరిని ఆమెకి జత చేస్తాడు… కాస్తా ఊపిరి అందింది ఏమో…నార్మల్ అయ్యేసరికి…ఈసారి పక్కన డ్రైవింగ్ సీటు లోకి వెళ్ళి…స్పీడ్ గా డ్రైవ్ చేద్దాం అనుకున్న ముందు తనకి ట్రీట్మెంట్ అవసరం అని…ఫస్ట్ ఎయిడ్ తనకి వచ్చినట్టుగా చేసి… ఆ తర్వాత కార్ నీ జెట్ స్పీడ్ లో అతడి మాన్షన్ వైపుకు పోనిస్తు….
తనకి తెలిసిన లేడీ డాక్టర్ కి కాల్ చేసీ…”హలో మ్యామ్…ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో వస్తారా..చిన్న ఎమర్జన్సీ…నేను కావాలంటే వెహికల్ పంపుతాను!”అని చెప్తాడు…
ఆమె చిన్నగా నవ్వుకుని…”ఇట్స్ ఒకే మిస్టర్..ఐ విల్ కమ్ బై మై సెల్ఫ్!”అని చెప్పి కాల్ కట్ చేస్తే…
టెన్షన్ కంగారు కోపం…తొందర…ఇలా మిక్స్డ్ ఎమోషన్స్ అతని మైండ్ లో రన్ అవుతూ ఉంటే… అలాంటి టైంలో కచ్చితంగా డ్రింక్ ఆర్ స్మోక్ చేసే అతడు…మొదటి సారి తనని తాను కంట్రోల్ చేసుకుంటూ…. గేర్ వేస్తున్న సమయం లో అలకనంద కుడి చెయ్యి అతడికి తగలగానే…ఏదో తెలియని కామ్ నెస్… ఆశ్చర్యంగా ఒకసారి పక్కకి చూసి…తప్పని తెలిసిన తన కుడి చేతిని అతని ఎడమ చేతిలోకి తీసుకుంటాడు…ఒక సారిగా అతని కోపం చల్లారుతున్నట్టు అనిపిస్తుంటే…హార్ట్ బీట్ నార్మల్ కి రావడం గమనిస్తాడు…
అతనికే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అది అంతా….తొందరగా డ్రైవ్ చేస్తూ మాన్షన్ ఎంట్రన్స్ కి వచ్చిన అతడి కారు చూసి…పెద్ద పెద్ద డోర్స్ నీ ఓపెన్ చెయ్యగానే…లోపలికి డ్రైవ్ చేసుకుని కార్ నీ పార్క్ కూడా చెయ్యకుండా కంగారుగా అలకనంద నీ ఎత్తుకుని..చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ వైపు చూసి… కీస్ విసిరేసరికి… అతనికర్థమైపోతుంది కార్ పార్క్ చేయాలని….
షర్ట్ లెస్ గా… సిక్స్ ప్యాక్ బాడీ తో…. షార్ప్ చూపుతో…చమటలు పట్టిన శరీరం తో…కంగారుగా ఉన్న అతని ఫేస్ ఎక్స్ప్రెషన్….నుదిటి మీద పడుతున్న సిల్కీ హెయిర్…గార్డ్స్ అందరూ నోటి మీద చెయ్యి వేసుకుంటే…వాళ్ళ వైపు ఒక చూపు చూస్తాడు అంతే…అందరూ వాళ్ల చూపుని మారిస్తే…
అలకనంద నీ తీసుకుని కుడి కాలు లోపల పెట్టిన అతనికి… సడన్ గా గాలి వచ్చి అతనిని హత్తుకుంటుగా అనిపిస్తే…. ఆటోమేటిక్గా లైట్స్ అలానే ఫాన్స్ ఆన్ అయితే… సోఫాలో ఉన్న డాక్టర్ని చూసి… “దిస్ వే డాక్టర్!” అని…గెస్ట్ రూమ్ వైపు అలకనంద నీ తీసుకుని వెళ్తాడు…
డాక్టర్ “రీతిక“…హ్యాండ్ కి అయిన ఇంజురీ నీ బాగా చెక్ చేసి…బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది… ఒక టు డేస్ హ్యాండ్ వాటర్ లో పెట్టకపోతే మంచిది… అలానే రేపు స్కానింగ్ తీయించాలి ఇంటర్నల్గా ఏమైనా ఇంజురీ అయిందేమో చెక్ చేస్తాను ప్రెసెంట్ అయితే బ్యాండేజ్ వేస్తాను రేపటి దాకా బానే ఉంటుంది… అలానే కొన్ని మెడిసిన్స్(సెడెటివ్స్ )ఇస్తాను బాగా మత్తగా ఉంటాయి మే బీ రేపటికి క్యూర్ అవ్వచ్చు..!!…అని చెప్తుంది…
అతడు..నవ్వి…”ఒకే డాక్టర్ థ్యాంక్ యూ… అడగగానే…ఈ టైమ్ లో కూడా వచ్చినందుకు!!”అని అంటే…
రీతిక నవ్వుతూ…”ఇట్స్ మై ప్లీసర్ మిస్టర్…రేపు హాస్పిటల్ కి మాత్రం తీసుకుని రండి!!”అని చెప్పి..అక్కడి నుండి వెళ్ళిపోతుంది…
అతడు టాబ్లెట్స్ నీ సెక్యూరిటీ తో తెప్పించి….వేసిన అతడు…చిరాకుగా అనిపించడం తో…..లిఫ్ట్ ఎక్కి పైన ఫ్లోర్ కి వెళ్తాడు….
ఏం చెయ్యాలి అనుకున్నాడు ఏం చేశాడు… ఆ అమ్మాయి ఎవరో..ఏమి తెలియకపోయినా…తన ప్లాన్స్ ఒకటి కూడా అవ్వకపోయేసరికి..ఇరియేట్ అవుతూ…ఇంకో సిగరెట్ ఊది పడుకుందాం..అనుకుని…జేబులో చెయ్యి పెట్టిన అతనికి… ఆ గోల్డ్ చైన్ తగలడం తో…
దానిని బయటకి తీసి…అందులో ఉన్న నేమ్…”అలకనంద”అని ఉండడం చూసి…
“అంటే తన పేరు అలకనందా నా!”అని అనుకుంటూ..దానిని భద్రంగా అతని లాకర్ లో పెట్టీ…ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తాడు…తల మీద చల్లని నీళ్ళు పడుతూ ఉంటే…అతని ఆలోచనలు కూడా ఒక్కకటి కనుమరుగు అవుతూ ఉంటే… కాస్త రిలీఫ్ గా ఫీల్ అయ్యి రూమ్ లోకి వచ్చి…వార్డ్రోబ్ ఓపెన్ చేసి… వైట్ షర్ట్ వేసుకుని…చేతులు కట్టుకుని బయటకి చూస్తాడు…టైమ్ అప్పటికే త్రీ అవ్వడం తో….”అసలు తను ఒంటరిగా హై వే మీద ఏం చేస్తుంది!?”….”తనని ఫాలో అయిన వాళ్ళు రౌడీలా… దీని వెనుక ఏదైనా గ్యాంగ్ ఉందా!?”…అని అనుకుంటూ….
సిస్టమ్ ఆన్ చేస్తాడు……
~~~~~~~~~~~~~~
స్టోరీ నచ్చితే కాస్త కామెంట్స్ మరియు రేటింగ్స్ ఇచ్చి మీ అభిప్రాయం తెలుపగలరు అని ఆశిస్తున్న…!!!..కాస్త కొత్త కథని ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను🥰
Swipe left/right or tap the sides to turn pages