New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రాక్షస ప్రేమిక – 1

రాక్షస ప్రేమిక – 1

అరుణాచల శివ…ఓం నమః శివాయ..

 

“అమ్మ ప్లీజ్ అమ్మ ఈ ఒక్క సారికైన నా మాట కాదు అనకు…జస్ట్ చిన్న ట్రిప్ ఏ….ఇంకా మళ్ళీ ఎప్పుడూ వెళ్తాను చెప్పు!!??అయిన నేను వెళ్తాను అనేదే గుడికే కథ”అని బ్రతిమాలుతుంది “”అలకనంద“”….

 

గాయత్రి గారు తల అడ్డంగా ఊపుతూ…”నువ్వు ఎన్ని అయిన చెప్పు నందు…నువ్వు అక్కడికి వెళ్ళడం నాకు ఎందుకో కీడు సంకిస్తుంది….పైగా మీ డాడీ కూడా లేరు..నీకు ఏదైనా అయితే మాత్రం ఆయన నన్ను అంటారు!!”అని కూతురితో వద్దు అని వారిస్తారు….

 

 

నందు మాత్రం…”ప్లీజ్ అమ్మ…డాడీ ఎలానో బిజినెస్ ట్రిప్ మీద దుబాయ్ కి వెళ్లారు కదా….రావడానికి చాలానే టైమ్ పడుతుంది…ఈలోపు వెళ్ళి వచ్చేస్తా…తెలియకుండా…నువ్వే మేనేజ్ చెయ్య!!…మా బంగారం కదు…!డాడీ కూడా టెంపుల్ కి వెళ్ళాను అంటే ఏం అనరు”అని గడ్డం పట్టుకుని బ్రతిమాలేసరికి… ఇంక తప్పక కూతురిని ఏడిపించడం ఇష్టం లేక సరే అని ఒప్పుకుంటారు….

 

నందు సంతోషంగా గెంతుతూ….”థ్యాంక్ యూ అమ్మ!!థ్యాంక్ యూ సో మచ్!”అని చెప్పి అక్కడి నుండి పైన ఫ్లోర్ లో తన రూమ్ కి వెళ్ళి…ఫ్రెండ్స్ కి వాళ్ళ అమ్మ గారు ఒప్పుకునట్టు మెసేజ్ చేసి…ట్రిప్ కి సంబంధించినవి అన్ని సర్దుకుంటుంది నందు…

 

~~~~~~~~~~~~~

 

“సార్…ఎవరో మిమ్మల్ని ఫాలో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది… ఈ మినిట్ వాళ్ళని మీరు చూసినట్టు తెలిస్తే కచ్చితంగా మీ మీద ఎటాక్ జరుగుతుంది…అందుకే మీరు ఎలా అయిన డైవర్ట్ చేసి వాళ్ళని డీల్ చెయ్యండి!!”అని ఎక్కడో ఉన్న సెక్యూరిటీ టీం ఇన్ఫో ఇవ్వడం తో….

 

 

“ఒకే ఐ విల్ డీల్ ఇట్….మీరు రూట్స్ క్లోజ్ చేసేయండి!!”అని ఆర్డర్ పాస్ చేస్తాడు “”అతడు””…

 

వాళ్ళు సరే అని ట్రాక్ చేసి… రూట్స్ అన్ని క్లోజ్ చేసేసరికి…అతను గంభీరంగా అతనిని వెనక నుండి వెంబడించే వాళ్ళని…క్రూరంగా కిరాతకంగా శిక్షించాలి అని అనుకుంటాడు….కానీ అదే సమయం లో అతనికి గంట శబ్దం దూరం నుంచి వినపడటం తో….చెయ్యి ఆగిపోమంటూ సంకేతం ఇస్తుంటే…మొత్తానికి ఏదొక విధంగా అతను కళ్ళు మూసుకుని కోపపు జ్వాలలతో వొళ్ళు బుసలు కొడుతుంటే….దానిని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ….కళ్ళు తెరిచి వారి వైపు చూస్తూ…”ఇంకో సారి మీ చూపు నా మీద పడ్డ… మీ ప్రాణాలు నీ చేతిలో నుంచి జారిపోతాయి…మీ రాత బాగుండి బ్రతికిపోయారు పొండి!!”అని చెప్పేసరికి…

 

 

వాళ్లకి అతని కళ్ళల్లో ఉన్న కోపాన్ని చూసి అర్థం అవుతుంది అతడికి ఎంత శక్తి సామర్థ్యం ఉందనేది… బ్రతికి బాగుంటే చాలు అనుకుని అక్కడినుంచి ప్రాణం ప్రసాదించిన అతనికి కాళ్ళ మీద పడి అక్కడి నుండి వెళ్ళిపోతే….

 

అతడు అక్కడే చెట్టు దగ్గర…కళ్ళు మూసుకుని ధ్యానం లోకి వెళ్తున్నట్టుగా ఇంద్రియాలని కేంద్రీకరించి పూర్తిగా వేరే లోకం లో కి వెళ్ళిపోతున్నాడు అనే సమయంలో….ఒకేసారి అతని ఫోన్ మ్రోగేసరికి…కళ్ళు తెరిచి చూస్తాడు…

 

 

సెక్యూరిటీ టీం కాల్ చేసి…”అదేంటి సార్ వాళ్ళని వదిలేశారు… వాళ్లు ఎంత నీచులో మీకు తెలుసు కదా సార్… వాళ్లని పట్టుకోవడానికి చాలా టైం పడుతుంది…!!”అని అంటుంటే….

 

అతడు ఆకాశం లో కి అనుమానంగా చూస్తూ…”హ్మ్మ్…!!”అని ఒక మాట అనేసరికి…

 

సెక్యూరిటీ టీం..”సరే సార్ టేక్ కేర్… ప్యాలెస్ కి ఎప్పుడు వస్తున్నారు!?”అని అడుగుతారు…

 

అతడు ఏం చెప్పకుండా…”ఐ విల్ టెక్స్ట్ యు!” ఆన్ కాల్ కట్ చేసి…

 

 

అక్కడి నుండి కారు లో బెంగళూరు నుండి దూరంగా ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళడానికి లొకేషన్ ఆన్ చేసుకుంటాడు…..

 

~~~~~~~~~~~~~~

 

గాయత్రి గారు చెప్పడం అయితే చెప్పారు కానీ ఆవిడకి భయంగానే ఉంది…అదే గుడికి వెళ్తాను అని ఎందుకు కూతురు మొండికేస్తుందో ఆవిడకి అర్థం కావట్లేదు…వాళ్ళ అత్తగారు…వాళ్ళకి పెళ్ళి అయ్యిన కొత్తలో అక్కడికి వెళ్ళి తిరిగి రాలేదు ….ఇప్పుడు మళ్ళీ దూరపు కొండ లోయలు మధ్య ఉన్న శివాలయం గురించి అసలు అలకనంద కి ఎవరో చెప్పారో అర్ధం కాకపోతే….పైగా వద్దు అంటే ఎంత మొండికేస్తుందో అని తప్పక ఒప్పుకుంటారు…

 

 

కానీ అదే విషయం గౌతమ్ గారికి తెలిస్తే ఏం అవుతుందో అని అనుకుని టెన్షన్ పడతారు…ఏం జరగకుండా కాపాడవయ్య ఈశ్వర అని దండం పెట్టుకుని…కూతురికి రాత్రి కి టిఫెన్ పెడతారు…

 

అలకనంద తింటూ….”అమ్మ నీకొక విషయం తెలుసా నాకు మొన్న రాత్రి నేను వెళ్లబోతున్న ఊరు గురించి కల వచ్చింది… సాక్షాత్తు ఆ శివ లింగమే కలలో కనిపించింది అమ్మ!”అని చెప్తుంటే….

 

 

గాయత్రి గారు తింటుంటే…పూలమారుతూ…”అవునా..అసలు ఈ ట్రిప్ ఎవరు ప్లాన్ చేశారు తల్లి!?”అని అడుగుతారు…

 

అలకనంద మాట్లాడుతూ…”నేనే మా ఫ్రెండ్స్ తో వెళ్దాము అని చెప్పాను…అక్కడ కొండలు ఎక్కితే అడ్వెంచరస్ గా ఉంటుంది…పైగా ఆ శివయ్య పిలుపు వచ్చింది ఏమో అని అనిపించింది”అని చెప్తుంది….

 

 

గాయత్రి గారు ఇంకేం మాట్లాడలేక…”ఎప్పుడూ రా వెళ్ళేది!?”అని అడుగుతారు…

 

అలకనంద…”రేపు తెల్లారు జామునే మా ఫ్రెండ్స్ కారు తెస్తారు అన్నారు అమ్మ!!!…ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ అవుతాం”అని చెప్తుంది…

 

ఆవిడ “సరే రా…తినేసి తొందరగా పడుకో!”అని చెప్పి గాయత్రి గారు కూడా తింటారు…

 

~~~~~~~~~~~~

 

సరిగ్గా రెండు రోజుల తర్వాత….నలుగురు రౌడీ లు…..ఒక అమ్మాయి తరుముతూ….”రేయ్ దానిని పట్టుకోండి రా…ఈరోజు ఎలాగైనా సరే దీనిని కిడ్నాప్ చెయ్యాలి!!”అని గుస గుసగా తమిళం లో మాట్లాడుకుని…

 

 

ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న తన వైపుకు అడుగులు వేసేసరికి…. అది గమనించని వాళ్ళు ఇంకా ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుని…నవ్వుకుంటూ ఉండగా…అందులో ఒక అమ్మాయి వాళ్ళ వైపే వస్తున్న వింత వ్యక్తులను చూసి…”ఎవరే వాళ్ళు!?”అని అడుగుతుంది….

 

ఇంకో అమ్మాయి వెనక్కి తిరిగి…”ఏమోనే అనేసరికి…!!”….

 

ఇంతలో ఆ రౌడీలు వాళ్ళ వైపే పరిగెత్తే సరికి…చెరొక వైపుకు పరిగెడతారు అమ్మాయిలు…అందులో అలకనంద కంగారు పడుతూ…ముందుకు పరిగెడుతూ…తన చేతిలో ఉన్న ఫోన్ నీ కూడా జరవిడిచి….ఇంకా స్పీడ్ గా పరిగెత్తేసరికి…

 

 

వాళ్ళు తనని వెంబదించడం గమనించి అక్కడ నుండి ఒకసారి వెన్నక్కి తిరిగి ఇంకా ఫాస్ట్ గా పరిగెడుతుంది…సమయం..రాత్రి పదకొండు అవ్వడం తో…తను హైవే రోడ్ మీదకి వచ్చేయడం తో…ఒక్క మానవ పురుగు అక్కడ లేకపోవడం తో…కనీసం తన మిత్రులు తనని చేరుకోలేకపోయేశారికి….భయం తో గుండె వేగం పెరుగుతుంటే….ఏం చెయ్యాలో అర్థం కాక…ఇంకా పరిగెడుతున్న సమయం లో…ఒకడు తన చెయ్యి పట్టుకుని క్రూరంగా నవ్వేసరికి…

 

మిగిలిన వాళ్ళు తనని చుట్టు ముడతారు…..తన గుండె పారామీటర్ వంద దాటేస్తే…

 

 

వాళ్ళు తన వైపే చూసే చూపే అర్ధం అవుతుంది తన జీవితాన్ని వాళ్ళు నాశనం చేసేవిధంగా ఉన్నాయి అని….అలకనంద భయం ప్రదర్శిస్తే….వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు కాబట్టి….ముందుకి ఒక అడుగు వేసి చుట్టు చూసేలోపు…ఒకడు అతడి చేతిలో ఉన్న ఇంజెక్షన్ నీ నందు చేతికి గుచ్చేస్తాడు…మిగిలిన వాళ్ళు అందరూ క్రూరంగా పశువులలాగా నవ్వుతుంటే….

 

నందు ఎంత వదలమని ప్రాధేయపడిన…వాళ్ళు వదలక పోతే…తన చేతికి చెవులకి ఉన్నవి అన్ని తీసి వాళ్ళ చేతిలో పెట్టిన వాళ్ళు అక్కడి నుండి కదలకపోయేసరికి…

 

 

నందు ఒకడి చేతిలో కత్తి నీ తీసుకుని…వాళ్ళ వైపు గురి పెడుతుంది…అందరూ ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటూ…..”ఇది మనల్ని ఏం చేస్తుంది రా!!”అని అనుకుంటూ ఉంటే….

 

ఇంకొకడు…”అవును రా….ఇది ఇలా కత్తి చూపిస్తే…మనం ఏమైనా భయపడతామా ఏంటి!!?”అని వెకిలిగా నవ్వుతాడు…

 

 

ఇంకొకడు…”ఎందుకు రా సోది చెప్పి టైమ్ వేస్ట్ చేస్తారు!! ఈపాటికే మత్తు ఎక్కి ఉంటుంది…పని చూడండి ముందు!”అని తమిళం లో అనేసరికి…

 

వాళ్ళ మాటలు అర్ధం కాకపోయినా వాళ్ళ ప్రవర్తనల బట్టి…అదే తనకి ఆఖరి రోజు అని అర్థం చేసుకుని…

 

 

 

అలకనంద గట్టిగా కళ్ళు మూసుకుని ఒక డీప్ బ్రీత్ తీసుకుని…”థ్యాంక్ యూ ఫర్ థిస్ లైఫ్ శివయ్య!!…విల్ మిస్ యూ”…అని అంటూ…తన ఎడమ చెయ్యి ముందుకి పెట్టీ…గట్టిగా తన చేతి నరం కోసేసుకుంటుంది….రక్తం దారాలనంగా కిందకి పడుతుంటే…మెల్లగా తన కన్నులు మసకబారుతుంటే కళ్ళు మూస్తూ రోడ్ మీద కుప్ప కూలి పడిపోతుంది

 

~~~~~~~~~~~~

 

అందరికీ నమస్కారం…నా కొత్త కథ ఇది… చాలా వింత క్యారెక్టర్స్,విభిన్న కథనం,సరికొత్త అలవాట్లు,చాలా డిఫరెంట్ స్టోరీ నేను రాసే వాటి అన్నింటికంటే…థిస్ కంటైన్స్ వయోలెన్స్ అండ్ డార్క్ లవ్..🖤🦋..మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్న 

 

మరి ఈ రాక్షస ప్రేమిక నీ సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్న…ప్రేమతో మీ “నవ్య వర్ణిక”