మావయ్య.. అయితే మీకు కూడా.. ఆనంద్ ప్రతాప్ గారి గురించి తెలీదా.. అంది మహా.
మీ అమ్మ చదివిన కాలేజీ లో ఎంక్వయిరీ చేశాను మహా… అతడు చాలా మంచి వాడని అందరూ చెప్పారు.. బాగా తెలిసిన ఒక స్నేహితుడు.. మీ అమ్మ సీతే అతడ్ని వదిలేసింది.. అన్నట్టు చెప్పారు.. నిజం ఏంటో మీ అమ్మ చెప్పదు.. మీ నాన్న ఊరొదిలి వెళ్ళిపోయాడు… అప్పుడు ఇప్పుడు ఉన్న అన్ని సదుపాయాలు లేవు.. మీ అమ్మ నాన్నల మధ్య ఏం జరిగిందో.. వాళ్ళిరువురికి ఆ దేవుడికి మాత్రమే తెలియాలి.. అన్నాడు సురేంద్ర.