New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ మొగుడు – 1

రౌడీ మొగుడు – 1

విశాఖపట్నం గాదిరాజు ప్యాలెస్ 
అందమైన సాగర తీరానికి ఎదురుగా ఉన్న గాలి రాజు బ్యాలెన్స్ ని అత్యంత అందంగా సుమనోహరంగా అలంకరించి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు 
సాయంత్రం 6:30 అవుతుండగా మెల్లగా చీకటి పడుతుంటే లైటింగ్ లో ఆ ప్యాలస్ మరింత అందంగా కనిపిస్తూ వచ్చే వాళ్ళకి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తూ ఉంది 
ఒకపక్క కార్లు అన్ని పార్కింగ్ చేస్తూ ఉంటే బంధుమిత్రులు అందరూ లోపలికి వస్తూ కనిపించారు 
మొత్తానికి నీ కూతురి పెళ్లి చాలా ఘనంగా చేస్తున్నావు భాస్కర్ అంటూ బంధువులు పొగుడుతూ ఉంటే 
అంత దాని అదృష్టం అన్నారు భాస్కర్ గారు 
పెళ్లికూతురు గదిలో 24 క్యారెట్ గోల్డ్ తో నేయించిన పట్టుచీరని తట్టుకొని మెడలో బంగారం ఇంకా డైమండ్స్ తో చేసిన ఆభరణాలు వేసుకొని తలకి మేలి ముసుగు కప్పుకొని ఉంది ఒక అమ్మాయి 
చూస్తూ ఉంటే ఆమె కళ్ళల్లో ఏదో టెన్షన్ సోనీ అదేపనిగా చూస్తోంది నువ్వు ఇక్కడే ఉండు నేను బయటకు వెళ్తున్నాను నేను ఇలా నీ దగ్గర ఉంటే బాగోదు కదా నేను వెళ్లి చెల్లిని పంపిస్తాను సరేనా అని కూతురికి చెప్పేసి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు ఆ అమ్మాయి తల్లి సుమలత గారు 
సుమలత గారు వెళ్ళిన ఒక రెండు నిమిషాలకి అక్కడికి వచ్చింది ఇంకొక అమ్మాయి 
ఇందు వచ్చావా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అండి ఆ అమ్మాయి తన చోటు నుంచి లేస్తూ 
అసలు ఏమైంది ఎంతవరకు వచ్చింది అడిగింది ఇందు ఆ అమ్మాయి వైపు చూస్తూ 
ఒసేయ్ నువ్వు చిన్నప్పటినుంచి నాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశావు ఇప్పుడు నేను అడిగే హెల్ప్ కూడా కాదనకుండా చేయవే అంది హేమ ఇందు వైపు చూస్తూ 
ఏంటి హేమా అది అడిగింది ఇందు అయోమయంగా 
హేమ గబగబా వెళ్లి డోర్ లాక్ చేసేసి తన తలకి ఉన్న మేలిమిసుగు తీసేసి ఇదిగో నా బదులు ఇప్పుడు నువ్వే పెళ్లికూతురుగా కూర్చోవాలి అంది హేమ 
ఏంటి ఏం మాట్లాడుతున్నావో కొంచమైనా ఐడియా ఉందా పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు నేను నేను అలాంటి పని చేయలేను సారీ నువ్వేమైనా అనుకో అంది ఇందు భయంగా 
ఇందు ఇందు ప్లీజ్ చిన్నప్పటినుంచి నేను అడగకపోయినా నాకోసం చాలానే చేసావు నువ్వు. ఇప్పుడు ఇంతలా అడుగుతున్నా ఈ హెల్ప్ చేయవే ప్లీజ్ ఇందు అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంది హేమ 
హేమ పిచ్చా నీకేమైనా అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో నీకు కొంచమైనా ఐడియా ఉందా వచ్చేది దేవాన్ష్ నాయుడు మనం చేసేది గాని కనిపెడితే నిన్ను నన్ను దయాదాక్షిన్యాలు లేకుండా చంపి పడేస్తాడు ఏమనుకుంటున్నావ్ నావల్ల కాదు హేమ అంది ఇందు భయంగా 
ఆ మాటకి హేమ ఇక చేసేదేం లేక తన సూట్ కేసులో దాచిపెట్టిన పాయిజన్ బాటిల్ తీసుకొని ఇందు ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఈ విషయం తాగి నేను ఇక్కడికి ఇక్కడే చచ్చిపోతాను అంది హేమ 
హేమ ఏంటి నువ్వు అడిగింది ఇందు 
నా దగ్గర ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు నేను ప్రేమించిన మహి నీ  కాదు అనుకుని ఇప్పుడు నేను వేరొకరిని పెళ్లి చేసుకోలేను దేవాన్ష్ టు నాకు పెళ్లి అసలు ఏ మాత్రం ఇష్టం లేదు ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే నాకు ఈ విషయం తప్ప ఇంకో గతి లేదు అంది హేమ 
లేదు నేను గాని పెళ్లి చేసుకుంటే వాడి చేతిలో నా జీవితం నాశనం అయిపోయినట్టే నేను చేయలేను హేమ అర్థం చేసుకో అంది ఇందు భయంగా 
అబ్బా ఇందు వాడు నిన్ను ఏం చేయడే నన్ను అనుకుని పెళ్లి చేసుకుంటాడు. నువ్వు అని తెలిస్తే నిన్ను ఒక నాలుగు తిట్లు తిట్టి వదిలేస్తాడు నీ దారిన నిన్ను అంతే ప్లీజ్ ఇందు అర్థం చేసుకోవే అంది హేమ 
ఇందు ఏ సమాధానం చెప్పకపోవడంతో సరే నేను కూడా నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఇందు. నేనే చచ్చిపోతాను నేను చచ్చిపోతే అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు తాగుబోతున హేమ చేతిలో నుంచి పాయిజన్ డబ్బాని విసిరేస్తుంది ఇందు 
నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం ఇవ్వవే అంది ఇందు 
అంత టైం లేదు ఇందు అంది హేమ 
ఇందు బలంగా తన కళ్ళని మూసుకొని ఆలోచించడం మొదలుపెట్టింది ఎవరు లేని తనని చేరదీశారు భాస్కర్ గారు 
తన కూతురు హేమ తో పాటు సమానంగా తనని కూడా చదివించి తన ఎంబీఏ పూర్తి చేయడంలో హెల్ప్ చేశారు ఆయన 
అలాంటి ఆయన కూతురి కోసం ఏం చేసినా తప్పులేదు అని భావించిన ఇందు సరే అలాగే అంది హేమ వైపు చూస్తూ 
థాంక్యూ బంగారం అని వెంటనే హిందూ నీ హగ్ చేసుకుని సరే సరే ముందు నువ్వు జడ వేసేసుకో నేను ఈ లోపు జ్యువలరీ ఎంత తీస్తాను అని చెప్పడంతో ఇందు అద్దం ముందు కూర్చుని హేమ వేసుకున్నట్టే అచ్చం తనలాగే జడ వేసుకుంది 
ఈలోపు హేమ తను వేసుకునే జువెలరీ చీర అన్ని విప్పేసి వేరే హిందూ డ్రెస్లోకి మారిపోతే ఇందు హేమా లాగా చీర కట్టుకొని ఆ నగలు అన్ని పెట్టుకొని నుదుటున కళ్యాణ తిలకం బుగ్గన చుక్క పెట్టుకొని హేమ ముందు నిలబడింది 
నిజంగా చాలా బాగున్నవి అంది హేమ అందంగా నవ్వుతూ 
ఇందు నవ్వలేక మా అన్న లేక నవ్వుతూ ఉంటే ఇంతలో బయటనుంచి డోర్ తట్టడంతో ముందు నువ్వు మేలు మూసుకు వేస్కో వేసుకొని నువ్వే వెళ్లి డోర్ తీయు అమ్మ వస్తే అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడకు అని చెప్పేసి హేమ మంచం కిందకి వెళ్ళిపోతే ఇందు మేలి ముసుగు వేసుకొని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది 
ఎదురుగా సుమలత గారు ఇంకా కొంతమంది బంధువులు తనని చూసి తన మేలిముసుకుని సరిగ్గా కప్పి తనని తీసుకొని అక్కడి నుంచి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోయారు 
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకొని డోర్ దగ్గరికి వేసేసి వెంటనే మహికి కాల్ చేసింది హేమ 
——–continues…………… 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ