New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రౌడీ మొగుడు – 2

రౌడీ మొగుడు – 2

ఎదురుగా సుమలత గారు ఇంకా కొంతమంది బంధువులు తనని చూసి తన మేలిముసుకుని సరిగ్గా కప్పి తనని తీసుకొని అక్కడి నుంచి పెళ్లి మండపం దగ్గరికి వెళ్ళిపోయారు 
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకొని డోర్ దగ్గరికి వేసేసి వెంటనే మహికి కాల్ చేసింది హేమ 
ఇక్కడ ఇందు ని తీసుకొని వచ్చి దేవాన్ష్ పక్కన కూర్చోబెట్టారు 
ఇందుకీ ఒకపక్క భయం ఇంకొక పక్క బాధ తన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే వాటిని అతి కష్టం మీద బయటకి రాకుండా ఆపుకుంటూ ఉంది 
సారీ సూర్య నన్ను పెంచి ఇంత చేసిన వాళ్ల కూతురు కోసం నేను నా ప్రేమని త్యాగం చేయాల్సి వస్తుంది అండ్ సారీ నువ్వు నన్ను ఏమైనా అనుకున్న కూడా పరవాలేదు కానీ నీ మీద నాకున్నది నిజమైన ప్రేమ అనుకుంటూ తన కన్నీళ్లు చంపాలని జారుతూ ఉంటే అలా ఉండిపోయింది 
పంతులుగారు ఒక్కొక్క కార్యక్రమం చేయిస్తూ ఉంటే అన్ని దగ్గరుండి చేస్తూ ఉన్నాడు దేవాన్ష్ ఒక బొమ్మల కూర్చుని ఉండిపోయింది ఇందు 
బాబు అమ్మాయి మెడలో ఈ నల్లపూసలు వేయండి అని పంతులుగారు చెప్పడంతో దేవాన్ష్ ఆ నల్లపూసలు తీసుకొని ఇందు మెడలో వేసి ఆ తర్వాత మూడు ముళ్ళు వేశాడు 
తాళి కట్టి నల్లపూసలు వేసిన తర్వాత దేవాన్ష్ వాళ్ళ ఆచారం ప్రకారం అమ్మాయి మొహం చూడకుండానే తన పాపిట్లో సింధూరం అద్దాడు 
ఒక్కసారిగా తను సూర్యాతో కలలు కన్న జీవితం మొత్తం పీకమెడల కూలిపోయినట్టు అనిపిస్తూ ఉంటే బాధగా కూర్చుంది ఇందు 
బాబు ఇప్పుడు మీరు అమ్మాయి మేలు మూసుకు తీసి తనని చూడొచ్చు అని చెప్పడంతో దేవా మేలి ముసుగు తీసి ఇందు నీ చూసి షాక్ అయితే మిగతా వాళ్ళు కూడా షాక్ అయిపోయారు 
ఇందు అనుకున్నారు సుమలత గారు భాస్కర్ గారు ఇద్దరూ 
ఏయ్ ఎవరు నువ్వు గంభీర్యంగా అడిగాడు దేవా 
అది అది అంటుంటే ఒక్కసారిగా పెళ్లి పీటల మీద నుంచి కోపంగా లేచాడు దేవా 
ఇందు కూడా ఫాస్ట్ గా లేచి దేవా వైపు భయంగా చూస్తే లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు దేవా 
దేవా కొట్టిన ఫోర్స్ కి ఇందు నేల మీద పడితే గబగబా అక్కడికి వచ్చిన సుమలత గారు ఇందు నీ పైకి లేపి ఇందు నువ్వేంటి రా ఇక్కడ అసలు హేమ ఎక్కడ హేమ ప్లేస్ లో నువ్వేంటి అడిగారు ఆవిడ ఇందు వైపు చూస్తూ 
అది ఆంటీ మరి అది అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపుతూ 
ఇది మీ కూతురు కదా అడిగాడు దేవా 
కాదు బాబు కానీ మా కూతురు లాంటిదే అన్నారు భాస్కర్ గారు దేవా వైపు భయంగా చూస్తూ 
ఏంటి మిస్టర్ భాస్కర్ ఇది మీకు ఆటలుగా ఉందా అంటూ కళ్ళెర్ర చేసి చూడటంతో ఆయనకి ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అయింది 
ఇంతలో దేవా మనుషులు అక్కడికి హేమ నీ పట్టుకుని వచ్చారు 
వదలండి నన్ను వదిలేయండి అంటూ అరుస్తుంది హేమ 
హేమ వైపు చూసిన భాస్కర్ గారు సుమలత గారు మరింత షాక్ అయ్యారు 
హేమ నువ్వు అక్కడేంటి అసలు ఏం జరుగుతుంది? మీరిద్దరూ ఏం చేశారో మీకు ఏమైనా అర్థమవుతుందా అడిగారు భాస్కర్ గారు కూతురు వైపు కోపంగా చూస్తూ 
అది డాడీ అది అంటున్న వాళ్ళ మాటల్ని అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా సుమలత గారిని చుట్టుకుని ఉన్న ఇందు చేయి పట్టుకొని వాట్ ఎవాయిడ్ మే బి ఇప్పుడు ఇది నా పెళ్ళాం అండ్ మిస్టర్ భాస్కర్ మీరు రేపు మార్నింగ్ కల్లా ఈ అమ్మాయిని మీరు అడాప్టర్ చేసుకుంటున్నట్టు ప్రూఫ్ నాకు సబ్మిట్ చేయాలి లేదంటే దీన్ని దాన్ని ఇద్దరిని చంపేస్తాను మీరు ఈ అమ్మాయిని మీ కూతురుగా దత్తత తీసుకొని అప్పుడు మీ అసలైన కూతుర్ని తీసుకొని వెళ్ళండి బాయ్స్ బ్రింగ్ హర్ అని చెప్పేసి ఇందు రెక్క పట్టుకొని లాక్కుంటూ వెళ్లిపోయాడు దేవా 
వెనకే ఉన్న దేవా మనుషులు హేమ ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు 
అసలు ఏం జరుగుతుందో అర్థం కాక వచ్చిన చుట్టాలు అందరూ గుసగుసలు మాట్లాడుకుంటూ ఉంటే భాస్కర్ గారు అందరి వైపు చూస్తూ వెళ్లిపోండి ప్లీజ్ అందరూ అని అందరికీ చేతులు జోడించి దండం పెట్టి చెప్పాడు 
అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే అక్కడ కేవలం భాస్కర్ గారు సుమలత గారు మాత్రమే మిగిలారు 
ఏంటండీ ఇది? నాకు ఏం అర్థం కావట్లేదు అసలు పిల్లలు ఎందుకు ఇలా చేశారు అడిగారు సుమలత గారు 
అది మనం వాళ్ళని అడిగి తెలుసుకోవాలి పదం ముందు వెళ్లి మనం ఇందుని అడాప్ట్ చేసుకుంటున్నట్టు పేపర్స్ రెడీ చేయించాలి లేదంటే ఇద్దరికి ప్రమాదమే అన్నారు భాస్కర్ గారు 
పదండి అని సుమలత గారు భాస్కర్ గారు అక్కడి నుంచి లాయర్ దగ్గరికి స్టార్ట్ అయ్యారు 
——–continues…………….. 
ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ