విధి కలిపిన బంధం – 3
ఆదర్ష్ కార్ ని స్పీడ్ గా పోనిస్తున్నాడు…. అంకిత కి కొంచెం భయంగా ఉన్న ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంది…. అనుకోకుండా ఆదర్ష్ సడన్ బ్రేక్ వేసాడు…. ఆ దెబ్బకి తూలి ముందుకు గుద్దుకొని వెనక్కి వాలింది….
ఏంటి అండి ఇది చూసుకోరా అని చెప్పి అరిచి తల రుద్దుకుంటూ కూర్చుంది…. నాకు అర్జంట్ గా నీ డ్రెస్ కావాలి అని అడిగాడు…. ఆ మాటకి షాక్ అయ్యి ఏమి అడుగుతున్నావ్ రా నువ్వు నా డ్రెస్ ఇవ్వడం ఏంటి పిచ్చి కానీ ఎక్కిందా నీకు అని అరిచింది….
ఎహే ఇప్పుడు నువ్వు వేసుకున్న డ్రెస్ తీసి నాకు ఇవ్వు అని అన్నాడు…. ఏమి మాట్లాడుతున్నావ్ రా అనింది భయంగా ముందు చెప్పేది విను మనం ఇప్పుడు ఒక షాప్ కి వెళ్దాం హ వెళ్లి అక్కడ నీకు నచ్చిన డ్రెస్ సెలెక్ట్ చేసుకొని వేసుకొ…
ఇప్పుడు నువ్వు వేసుకున్నది తీసి నాకు ఇవ్వు అన్నాడు…. అయోమయం గా చూస్తూ ఎందుకు అలా హ్మ్ ప్రతిది క్వశ్చన్స్ తోనే పనా నీకు సరే చెప్తా విను…. ఇప్పుడు అక్షిత ఉంది కదా హ హుష్ అబ్బా అదేలే శవం హ అయితే….
అయితే ఏముంది నీ డ్రెస్ తీసి తనకి వెయ్యాలి…. ఆ తర్వాత నైట్ కి తీసుకెళ్లి ట్రాక్ మీద వేసేద్దాం అప్పుడు ట్రైన్ ఆక్సిడెంట్ అనుకుంటారు…. లేదు అనుకో ఈ లోపే ఎవరైనా చుస్తే హాస్పిటల్ కి తీసుకెళ్తారు….
అక్కడ తను తను అని ఇంక ఏమి మాట్లాడలేక కళ్ల నీళ్లు పెట్టుకుంటాడు…. అది చూసి ఏమైంది అలా ఐపోయారు…. ఏమి లేదు అది చూసి నువ్వే అనుకుంటారు అత్యాచారం జరిగింది అని నిర్దారణ కి వచ్చి అది నేనే నిన్ను తీసుకెళ్లి అలా చేసి చంపేసాను అనుకుంటారు….
అలా నా కోసం వెతుకుతారు ఆ బాడీ ని తీసుకెళ్లి మీ పేరెంట్స్ కి అప్ప చెప్తారు…. ఇంక అంకిత గా నువ్వు చనిపోతావ్ అక్షిత లా మా ఇంటికి వచ్చి ఉంటావ్…. అది నేను ఆలోచించింది….
అంటే అక్షిత ని అని ఇంకేమి మాట్లాడలేక ఆగిపోయింది…. అవును నువ్వు అనుకుంటున్న దే అని చెప్పి కార్ ని మళ్ళీ వెనక్కి తిప్పాడు…. అంకిత కి ఇంకేమి చెప్పాలో తెలియక కామ్ గా ఉంది….
ఆదర్శ్ ఏ మాట్లాడుతూ ఇప్పుడు జరిగిన దాని గురించి బాధ పడటం కన్నా కూడా అక్కడ ఒక ప్రాణం కాపాడటం మేలు అనిపించింది అందుకే లోపల ఎంత బాధ కోపం ఉన్న కూడా ప్రస్తుతం నేను ఏమి చేయలేను….
ఈ నిర్ణయమే సరి అయినది అని అనుకుంటున్న అని చెప్పి అంకిత తనని చూసేసరికి మొహం పక్కకి తిప్పేసాడు….కానీ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు బాధ పడతారు కదా మరి అది మీకు పర్లేదా అనింది….
ఇలా చూడు నేను స్వార్ధపరుడులా కనిపించొచ్చు కానీ నా ఫ్యామిలీ కోసం నేను ఎలా అయినా ఉంటాను… నాకు వాళ్ళు మాత్రమే ముఖ్యం అన్నాడు…. అంకిత కోపంగా చూస్తూ సెల్ఫిష్ ఫెలో నువ్వు అసలు మంచోడివే కాదు….
అసలు ఏమో అక్షిత ని నువ్వే అలా చేసి ఇదంతా చేస్తున్నావ్ ఏమో అనింది కోపంగా…. అంకిత నోరు జారకు ఏమి చేస్తానో కూడా నాకు తెలియదు…. జారతాను కచ్చితంగా నువ్వే అలా చేసి ఉంటావ్ ఉంటావ్ ఉంటావ్…
ఈ లోపే కార్ స్పీడ్ గా బ్రేక్ వేసి ఆపాడు అంకిత ని గట్టిగ కొట్టాడు మళ్ళీ…. నువ్వు ఎన్ని కొట్టిన నేను భయపడను నువ్వే చేసావ్ అనే అంటాను….ఏమి తెలుసే నీకు నా గురించి హ ఏమి తెలుసు….
రేపు మా ఇంటికి వస్తావ్ గా చూద్దువు గాని అని చెప్పి జుట్టు పట్టుకొని ఊపుతూ నన్నే అంత మాట అంటావ్ కదూ రేపు నువ్వే నాకు వంద సార్లు సారీ చెప్తావ్ చూడు అని చెప్పి విసురుగా వదిలేసాడు….
అంకిత కోపంగా చూస్తూ నేను రాను రాను రాను దీనికి నేను అసలు ఒప్పుకోను నీ ఫ్యామిలీ నీకు ఎంత ముఖ్యమో ఈ విషయం లో నాకు నా ఫ్యామిలీ అంతే ముఖ్యం అని అరిచింది….
అంత ముఖ్యం అనుకున్నప్పుడు ఇంట్లో నుంచి ఎందుకు వచ్చేసావ్ అని అంతే గట్టిగ గర్జించాడు…. ఆ మాటకి ఇంకేమి మాట్లాడలేదు సైలెంట్ అయ్యింది…. హ ఎదో తెగ గింజకుంటున్నావ్ కదే ఇప్పుడు చెప్పు అంత ఇష్టం ఉంటే ఎందుకు వచ్చేసావ్ అన్నాడు….
అది నా ఇష్టం అనింది చిన్నగా అబ్బా గొంతు ఏంటి చిన్నగా వస్తుంది…. ఇందాకటి దాకా పెద్ద పెద్దగా అరిచావ్ హ్మ్ తప్పు ఉంది నీ దగ్గర అందుకే మూసుకొని ఉన్నావ్… ఇలా చూడు నీకు ఇప్పుడు ఇది తప్ప ఇంకో మార్గం లేదు అంకిత….
కామ్ గా నేను చెప్పింది చేయి అంతే అని చెప్పి బలవంతంగా కార్ లో కూర్చోపెట్టాడు…. అంకిత ఏడుస్తునే ఉంది…ఆదర్ష్ కి అది వినపడిన వినపడనట్టే కార్ ని ముందుకు పోనిచ్చాడు….
హ్మ్ ఏంటో వీళ్ళ గొడవ ఆగదు అనుకుంట….
అక్షిత ని అలా చేసింది ఎవరు….?
ఇప్పుడు అంకిత నిర్ణయం ఏంటి….?
ఇవన్నీ తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కై వేచి ఉండండీ….
అంత వరకు మీ విలువైన రేటింగ్స్ ఇంకా సమీక్ష లని ఇచ్చి నన్ను ప్రోత్సాహిస్తారు అని ఆశిస్తూ….
మీ
లక్ష్మి అవినాష్.
Swipe left/right or tap the sides to turn pages