New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
విధి విడదీసిన స్నేహం 🥹 – 1

విధి విడదీసిన స్నేహం 🥹 – 1

“ప్రతిసారి రక్షించడానికి హీరో రాడు… కొన్ని సార్లు ఒక స్నేహితురాలు చాలు.”
స్నేహం, ధైర్యం, మరియు ఒక స్త్రీ పునర్జన్మకు ప్రతీక — పుష్పవల్లి. 🌸💔
ఇది ఒక యాదర్ధ సంఘటన….. పాత్రలు కల్పితాలు మాత్రమే….
సున్నిత మనస్తత్వం ఉన్నవాళ్లు గుండెని రాయి చేసుకొని చదవండి….
అనగనగ ఒక 15 సంవత్సరాలు ముందుకు వెళ్తే….
2011-12 మధ్యలో ఆ కాలంలో….
ఒక పాప రోజు స్కూల్ కి వెళ్లి వచ్చేది.
దారిలో తనకి ఒక ఫ్రెండ్ ఉండేది… ఉన్నది అన్న విషయం ఆమెకి మాత్రమే తెలుసు ఇప్పుడు మీకు తెలుసు…. 
ఎవరికీ చెప్పకండి సీక్రెట్ ఇది 🤫….
ఒకే టాపిక్ డైవర్ట్ అవ్వకుండా కాన్సెప్ట్ లోకి వెళ్తే…..
ఆ పాప స్కూల్ పక్కన పూరి గుడిసెలు ఉండేవి….
అంటే అది కామన్ ఆ రోజుల్లో వలస వచ్చి ఉన్నవాళ్లు తల దాచుకోడానికి ఉండే ఏకైక చోటు అది వాళ్ల సొంత ఇల్లు అది…..
(ఇది ఎవరిని తక్కువ చేసి, వెటకారంగా చెప్పలేదు నేను….
ఎవరిని తక్కువ చెయ్యదు కదా, నీ చేతితో నువ్వు తలదాచుకోడానికి కట్టుకున్నాం అంటే అది నీ సొంత ఇల్లే…. అది చిన్నది అయినా కోట అయినా…… ఎవరి స్తొమత వారిదే…..)
అలా ఆ పాప స్కూల్ దగ్గర కూడా ఉండేవి ఒకటి రెండు కాదు చాలా ఇంచుమించు ఒక 15 20 వరకు…..
అయితే ఆ పాప రోజు స్కూల్ అయ్యాక అటు వెళ్ళేది.
అక్కడ తనకి ఒక ఫ్రెండ్ ఉండేది మన కాన్సెప్ట్ కోసం ఒక పేరు పెట్టుకుందాం…. ఏం పేరు 🤔…… ఆహ్ వల్లీ…..
అయితే వల్లీ కి ఆ పాప కి మంచి స్నేహం అనమాట, కులం స్థాయి లాంటి వ్యత్యాసలు అస్సలు లేవు…..
పిల్లలు అంటేనే అంత కదా అందుకే వారిని దేవుళ్ళు అంటాం 😌….
అయితే రోజు ఆ పాప తో ఆడుకునేది మాట్లాడేది వాళ్ల మమ్మీ వాళ్లు (వల్లీ) కి కూడా ఆ పాప అంటే చాలా ఇష్టం…..
ఊరికే పాప పాప ఎందుకు కానీ…. పుష్ప అని పెట్టుకుందాం తన పేరు……
పుష్ప కూడా వాళ్ల ఇంట్లో తినేది వాళ్లతో చాలా శాఖ్యతతో ఉండేది.
అలా రోజులు గడుస్తున్నాయి….
ఒకరోజు పుష్ప స్కూల్ కి వెళ్ళలేదు ఆ రోజు రాత్రే వాళ్ల జీవితాలో విషాదగాధ గా మిగిలిపోయింది.
సడన్ గా ఆ ల్యాండ్ గవర్నమెంట్ ది ఇక్కడ పార్క్ కడుతున్నాము అని చెప్పేసి రాత్రికి రాత్రే అక్కడ వాళ్లని కాళీ చేపించేశారు.
ఆ క్షణం లో వల్లీ కి స్కూల్ లో ఇద్దరు చేసుకున్న ప్రామిస్ ఏ గుర్తుకు వచ్చింది.
“ఎప్పుడైనా మనం దూరమైనా… మళ్లీ ఒకరోజు కలుస్తాం.”
వాళ్లు కట్టు బట్టలతో అక్కడి నుండి వచ్చేసి రోడ్ మీద కూర్చున్నారు.
అప్పట్లో ఫోన్స్ ఉండేవి కాదు అంటే పుష్ప వాళ్ల ఇంట్లో అయితే ల్యాండ్లైన్ ఉండేది.
వీళ్లకేమో అవేవి తెలీదు ఎటు వెళ్లాలో తెలీదు….
పుష్ప ని సంప్రదించడానికి మార్గం తెలీదు…
ఎటు వెళ్లాలో పాలుపోట్లేదు….
మరి ఏం చేసి ఉంటారు?
పుష్ప ని సంప్రదించరా లేదా ఇంతకీ?
వల్లీ పుష్ప ల బంధం అర్ధంతరంగా ముగిసేన?
✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨✨
పుష్ప రోజు ఇంటికి వెళ్ళాక తన పేరెంట్స్ తో అన్నయ్య తో ఆరోజు జరిగేవి అన్ని పంచుకునేది.
ఆరోజు కూడా స్కూల్ లో ఏం చేసిందో చెప్పింది..
రన్నింగ్ లో 1st వచ్చిన విషయం నుండి,
తను dodge ball సూపర్ గా ఆడుతుంది. దానితో పాటు లాంగ్ జంప్స్ హై జంప్స్ ఇవ్వని కూడా చేస్తూ ఆక్టివ్ గా ఉంటుంది.
అతి చిన్న వయసులోనే డిస్ట్రిక్ట్ లెవెల్ కి సెలెక్ట్ కూడా అయింది.
ఆరోజు తను చేసిన ప్రాక్టీస్ తగిలాంచుకున్నా దెబ్బలు అన్ని తన అన్నయ్య పూణీత్ తో చెప్పింది.
రోజు జరిగేదే కావడంతో నవ్వుతూ వింటూ ఉన్నాడు పూణీత్…
అన్నయ్య తో జరిగింది చెప్పడం అయ్యాక నాన్న దగ్గరికి పరుగు పెట్టింది.
నాన్న తో కూడా చెప్పి అమ్మ తో నాలుగు అక్షింతలు ప్లస్ మొట్టికాయలు కూడా వేయించుకొని, అన్నయ్య నాన్న దగ్గర గారాభం పోయి తిరిగి నాన్న చేత అమ్మని తిట్టించి ఇంకా హోంవర్క్ చేయడానికి కూర్చుంది.
అన్నయ్య మాత్రం ముగ్గురి వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు.
చేస్తుందా అంటే ఆబ్బె మీరు అలా అనుకుంటే మూసి లో కాలు వేసినట్టే….
ఒకసారి మీ కాలు చూస్కోండి 🤭.
ఎవరితో చేయిస్తుంది అంటారు?
మీరు గెస్ చెయ్యండి!
కంటిన్యూస్…..
వాళ్ల ప్రామిస్ నిలబడుతుందా?
వల్లీ గురించి పుష్ప కి తెలిస్తే?
తన రియాక్షన్?
పుష్ప హోంవర్క్ ఎవరు చేసారు?
మీ రెస్పాన్స్ బట్టి ఇవ్వాళా వద్ద అని డిసైడ్ అవుతా ఇంకా….
ఎలా అనిపించింది ఎపిసోడ్?? కామెంట్స్ లో తెలుపండి. 
ఇంకోసారి ఇంకో ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటాను…
ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్.
-siri హన్విత ❤️