స్నేహం కోసం…!! – 2
అలా మధ్యాహ్నం వరకు గాఢంగా నిద్రపోయిన ఆరు, ఒక్కసారిగా కళ్లు తెరిచింది. బెడ్ పక్కనే ఉన్న ఫోన్‌ని చేతిలోకి తీసుకుని టైమ్ చూసిన వెంటనే…
“అమ్మో! ఇంతసేపు పడుకున్నానా నేను?”
అని ఆశ్చర్యంగా అనుకుంది.
ఆ వెంటనే…
“రేపు మార్నింగ్ కల్లా హైదరాబాద్‌లో లేకపోతే అమ్మ ఎంత లొల్లి చేస్తుందో ఏంటో!” అని గొణుక్కుంటూ బెడ్‌పై నుంచి లేచింది.
ఇంక ఆలస్యం చేయకూడదని అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్‌లోకి వెళ్లింది.
ఫ్రెష్ అయి బయటకు వచ్చిన ఆరు, నేరుగా వార్డ్‌రోబ్ దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్ చేసింది. అందులో ఉన్న డ్రెస్సెస్‌లో తనకు నచ్చిన కొన్నింటిని తీసి లగేజ్ బ్యాగ్‌లో సర్దడం మొదలుపెట్టింది.
అలా డ్రెస్‌లు సర్దుతూనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసింది. ఫోన్‌ని ఇయర్‌బడ్స్‌కి కనెక్ట్ చేసుకుని, ఒకవైపు బ్యాగ్‌లో డ్రెస్సెస్ పెడుతూ మరోవైపు అవతలి వ్యక్తి కాల్ లిఫ్ట్ చేస్తాడేమోనని ఎదురుచూస్తోంది.
ఎంతకీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో…
‘వీడేంటో! కాల్ లిఫ్ట్ చేయరా బాబూ!’ అని మనసులోనే అనుకుంది.
ఆమె మనసులో అనుకున్నది వినిపించిందేమో అన్నట్టుగా, మరుక్షణమే కాల్ లిఫ్ట్ అయింది.
“చెప్పు రాక్షసి!” అంటూ అవతలి వైపు నుంచి ఓ మగ గొంతు వినిపించింది.
ఆ గొంతు వినగానే ఆరు ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది.
“యష్!” అంటూ గట్టిగా అరిచింది.
“అరవకే రాక్షసి! నువ్విలా అరిస్తే నా చెవులు పోయేలా ఉన్నాయి!” అంటూ ఫోన్‌ని చెవికి కొంచెం దూరంగా పెట్టుకున్నాడు యష్.
“నేనేం అరవడం లేదు. అయినా నీకు అంకుల్ ఏమైనా కాల్ చేశారా?” అని అడిగింది ఆరు.
అలా అడుగుతూనే డ్రెస్సెస్ అన్నీ ఇష్టం వచ్చినట్టు బ్యాగ్‌లో పడేసి, చివరికి బ్యాగ్ జిప్ మూసేసింది.
“నాన్న నాకు కాల్ చేశారనే విషయం నీకు ఎలా తెలుసు?” అని అడిగిన యష్, వెంటనే ఏదో గుర్తొచ్చినట్టుగా…
“ఓహ్! నీకు ఆంటీ కాల్ చేశారా?” అని అడిగాడు.
“అవును రా! అమ్మ కాల్ చేసి, రీజన్ ఏంటో చెప్పకుండా రేపు డైరెక్ట్‌గా హైదరాబాద్ రావాలంది” అని ఫేస్ డల్ చేసుకుంటూ చెప్పింది ఆరు.
అసలే ఆరుకి ఇంత సడన్‌గా ఇంటికి వెళ్లడం ఇష్టం లేదు. ఎప్పుడో కానీ ఇంటికి వెళ్లని తనని, ఇప్పుడు ఉన్నట్టుండి రమ్మంటే ఎలా అనిపిస్తుంది?
అందుకే ఇంటికి వెళ్లాలనే విషయం గుర్తొచ్చిన ప్రతిసారీ తన ముఖం చిన్నబోతుంది.
అది గమనించినట్టుగా యష్…
“ఒసేయ్! నువ్వు ఇంటికి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందో ఒక్కసారి ఆలోచించు!” అన్నాడు.
అప్పటికే ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన యష్, తన కార్ వైపు నడుస్తూ మాట్లాడుతున్నాడు.
“అవును అనుకో! నేను ఇంటికి వచ్చి చాలా డేస్ అవుతుంది. కానీ ఇలా సడన్‌గా రమ్మంటే ఎలా రా? నాకు ఏదోలా ఉంది. నేను రాకపోతే అమ్మ ఏమో మళ్లీ మొదలుపెడుతుంది!” అంటూ విసుగ్గా చెప్పింది ఆరు.
ఆమె మాటలకు యష్ చిన్నగా నవ్వుకున్నాడు.
“ఆంటీ వాళ్లని డిసప్పాయింట్ చేయకుండా ఇంటికి రా. నేను కూడా కోల్‌కతా నుంచి స్టార్ట్ అవుతాను” అన్నాడు.
“ఏంటి? నువ్వు కోల్‌కతాలో ఉన్నావా?” అని అడిగింది ఆరు.
ఆమె మామూలుగానే అడిగింది. కానీ ఆ మాట వినగానే యష్‌కి మాత్రం పక్కనే డీజే బాక్స్ పెట్టి సౌండ్ పెంచినట్టుగా అనిపించింది.
“అవును రాక్షసి! కోల్‌కతా వచ్చాను. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. అది పూర్తవడంతో నాన్న వెంటనే హైదరాబాద్ రమ్మన్నారు” అని చెప్పాడు.
“ఓహ్! సరే సరే!” అంది ఆరు.
“నాకు ఈ టైమ్‌కి ఫ్లైట్ ఉంది. నువ్వు కూడా అదే టైమ్‌కి వస్తే ఎయిర్‌పోర్ట్‌లో నీకోసం వెయిట్ చేస్తాను. లేదంటే నేను వెళ్లిపోతాను!” అంటూ ఓ ఫ్లైట్ టైమ్ చెప్పాడు యష్.
“అయ్యో! మరీ అంత మాట అంటావేంట్రా? నేను కూడా అన్నీ ప్యాక్ చేసుకున్నాను. ఇంక బయలుదేరడమే లేట్!” అంది ఆరు, బ్యాగ్‌లో ఏమైనా మర్చిపోయానేమోనని మరోసారి చూసుకుంటూ.
“సరే! నేను కూడా నా లగేజ్ ప్యాక్ చేసుకుంటాను. బయలుదేరాక నీకు కాల్ చేస్తాను” అన్నాడు యష్.
అప్పటికే తాను బస చేసిన హోటల్‌కి చేరుకోవడంతో కార్ దిగి లోపలికి వెళ్తున్నాడు.
“ఓకే రా! నేను కూడా అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాను. తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. నా కోసం ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చెయ్!” అంటూ కాల్ కట్ చేసింది ఆరు.
మరోవైపు…
ఆరుతో మాట్లాడిన తర్వాత యష్ తన రూమ్‌లోకి వెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక తనతోపాటు తెచ్చుకున్న డ్రెస్సెస్, ల్యాప్‌టాప్, ఇతర వస్తువులన్నీ లగేజ్ బ్యాగ్‌లో సర్దుకోవడం మొదలుపెట్టాడు.
మరోవైపు ఆరు కూడా తన బ్యాగ్‌ని మరోసారి చెక్ చేసుకుని, క్యాబ్ బుక్ చేసింది.
క్యాబ్ వచ్చేలోపు పూజ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
కొద్దిసేపటికి పూజ అక్కడికి రావడంతో ఆరు తన బ్యాగ్ తీసుకుని ఆమె దగ్గరకు వెళ్లింది.
“బాయ్ పూజా! నేను ఇంటికి వెళ్తున్నాను. అమ్మ రమ్మని కాల్ చేసింది” అని చెప్పింది.
“అవునా! సరేనే. జాగ్రత్తగా వెళ్లు!” అంటూ పూజ నవ్వుతూ చెప్పింది.
“హా! నువ్వు కూడా జాగ్రత్త. మళ్లీ కలుద్దాం!” అంటూ పూజ దగ్గర వీడ్కోలు తీసుకుంది ఆరు.
అప్పటికే తాను బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో తన లగేజ్ తీసుకుని అందులో కూర్చుంది.
క్యాబ్ ఎయిర్‌పోర్ట్ వైపు బయలుదేరింది.
ఆరుకి తెలియదు…
ఈ ప్రయాణం తన జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోందో!
యష్‌కి కూడా తెలియదు…
హైదరాబాద్‌లో తమ కోసం ఎలాంటి పరిణామాలు ఎదురుచూస్తున్నాయో!
To be continued…
మీ అందరికీ ఈ పార్ట్ కచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను.
మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి, బ్యూటిఫుల్స్! 🤗❤️
Swipe left/right or tap the sides to turn pages