New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Ghost love 👻 – 2
Ghost love 👻 5 min read

Ghost love 👻 – 2

అవ్యూక్త్ 💖 శిశిర 

 

 

శిశిర నీ బాత్ రూం లోకి తీసి బయట నుంచి లాక్ చేస్తాడు అవ్యూక్త్ ……

 

 

వాష్ రూం లో ఉన్న శిశిర కి అసలు ఏమి అర్ధం కాలేదు….తను ఎప్పుడూ అవ్యూక్త్ నీ వాళ్ళ ఫ్యామిలీ కి దూరం చేసింది…….!

 

 

అసలు  అవ్యూక్త్ ఎందుకు ఆమె మిద అంత పగ పెంచుకున్నాడు అని ఆలోచిస్తూ……. అతను కొట్టిన చెంప దెబ్బకి పెద్దవి చిట్లి లైట్ గా రక్తం వస్తూ ఉంటె…. వాష్ రూమ్లో ఉన్న మిర్రర్ లో దాన్ని చూసుకుంటూ ,

 

 

ట్యాప్ ఆన్ చేసి చల్లని నీళ్ళతో ఫేస్ వాష్ చేసుకొని ఆ బ్లడ్ నీ క్లీన్ చేసుకొని అక్కడే ఒక మూలన కూర్చొని ఎర్రగా కందిన చెంప మంటగా అనిపిస్తూ ఉంటే……

 

 

తొలి రాత్రి ఇలాంటి ఒక సంఘటన తనకి ఎదురు అవుతుంది అని అసలు ఊహించని శిశిర కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటే , కష్టంగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ……

 

 

అసలు ఆమె ఎప్పుడు అవ్యూక్త్ నీ అతని ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి దూరం చేసింది అని ఆలోచిస్తూ అక్కడే వాష్ రూం గోడకు ఆనుకొని నిద్రపోతుంది…

 

 

బెడ్ రూంలో ఉన్న  అవ్యూక్త్ కోపంతో ఊగిపోతూ నా ఫ్యామిలీ నీ నాకు దూరం చేసిన నీ మిద పగ తీర్చుకోవాలి అనే…..మీ ఇంటికి వచ్చి మీ అమ్మ నాన్న నీ ఒప్పించి మరి నిన్ను పెళ్లి చేసుకున్నాను….

 

 

 

నన్ను నా ఫ్యామిలీ కి దూరం చేసిన నీకు లైఫ్ అంతా నరకం ఎలా ఉంటుందో చూపిస్తా…….” అని కసిగా అనుకుంటూ బెడ్ మిద ఉన్న పూలు అవి చూసి చిరాకు పడుతూ బెడ్ షీట్ లాగి కింద ఒక మూలలో విసిరి కొట్టి….

 

 

 

శిశిర తెచ్చిన పాల గ్లాస్ నీ కూడా విసిరి గోడకు కొట్టి వెళ్లి బెడ్  మిద కూర్చొని శిశిర నీ ఎలా టార్చర్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు….

 

 

మరుసటి రోజు….

 

అలా తెల్లారి 4 గంటల టైం లో వాష్ రూం డోర్ ఓపెన్ చేసి అక్కడ గోడకు జార బడి నిద్రపోతూ ఉన్న శిశిర నీ చూసి……. కోపంతో బకెట్ లో నిండుగా నీళ్ళు నింపి ఆ నీళ్ళని విసురుగా శిశిర మొహం మిద కొడతాడు అవ్యూక్త్….

 

 

అది చలి కాలం కావడం అండ్ అంత ఉదయాన్నే చల్లని నీళ్ళు మొహం మిద కొట్టేసరికి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉన్న శిశిర కి , ఎదురుగా బకెట్ పట్టుకొని కోపంగా తననే చూస్తూ ఉన్న అవ్యూక్త్  కనిపించగానే…….తెలియని ఏదో బెరుకు కలగడంతో పైకి లేచి నిలబడింది….

 

 

” ఎంటి డార్లింగ్ రాత్రి అంత బాగ నిద్రపోయిన్నట్టు ఉన్నావ్….ఇంకా నిద్ర పోయింది చాలు లే కానీ ఫ్రెష్ అయ్యి వచ్చి , నాకు మిల్క్ షేక్ రెడీ చేసి ఇచ్చి , అదే చేతితో బ్రేక్ ఫాస్ట్  కూడా ప్రిపేర్ చెయ్ ” అని చెప్పి శిశిర జబ్బ పట్టుకొని విసురుగా వాష్ రూం బయటికి తోసేసి డోర్ క్లోజ్ చేసుకున్నాడు అవ్యూక్త్ …

 

 

అవ్యూక్త్  విసురుగా బయటికి తోసెయ్యడం వల్ల శిశిర తల బెడ్ ఏడ్జ్ కి  తగిలి ఎర్రగా బొప్పి కట్టి వాచింది……

 

 

దాన్ని చేతితో తడుముకొని , నొప్పికి కళ్ళు మూసుకొని  అవ్యూక్త్  వాటర్ కొట్టడం వల్ల సగం తడిచిన చీర తో చలికి కొంచం వొనుకుతూ…… 

 

 

ఒక నిమిషం తర్వాత కళ్ళు తెరిచి రూం లో నుంచి బయటికి వెళ్లి  అవ్యూక్త్ చెప్పినట్టు మిల్క్ షేక్ రెడీ చేసి మళ్ళీ రూం లోకి వెళ్ళింది…

 

 

శిశిర రూం లోకి వెళ్ళే సరికి  అవ్యూక్త్ వాష్ రూం నుంచి బయటికి వచ్చి అక్కడే ఉన్న బాల్కనీలో పుష్ అప్స్ చేస్తూ ఉంటాడు…

 

 

శిశిర ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా బాల్కనీలోకి వెళ్లి అక్కడ ఉన్న స్వింగ్ చైర్ లో మిల్క్ షేక్ బాటిల్ పెట్టీ….ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోతూ ఉండగా ”  ఆగు ” అని పిలుపు వినిపించే సరికి అక్కడే ఆగి వెనక్కి తిరిగింది…

 

 

పుష్ అప్స్ చేస్తున్న అవ్యూక్త్ పైకి లేచి నిలబడి , చైర్ లో ఉన్న మిల్క్ షేక్ బాటిల్ తీసుకొని ఒక సిప్ చేసి “హూ టేస్ట్ బాగుంది డార్లింగ్ ” అని చెప్పి నవ్వుతూ శిశిర దగ్గరికి వెళ్లి ఆ మిల్క్ షేక్ మొత్తం ఆమె నెత్తి మిద పోసేస్తాడు…

 

 

అసలే చల్లగ ఉన్న నీళ్ళు పైన కొట్టినందుకే చలికి వోణుకుతున్న శిశిర ఇప్పుడు మళ్ళీ మిల్క్ షేక్ అలా తల మిద పొయ్యడంతో ఏడుపు గొంతులోనే ఆపుకుంటూ కళ్ళల్లో నీళ్ళతో అవ్యూక్త్  నీ చూసింది…

 

 

అవ్యూక్త్ కోపంగా ఆమె కళ్ళల్లోకి చూస్తు ” ఇంకోటి ప్రిపేర్ చేసుకొని తీసుకొని రా పో ” అని చెప్పి మళ్ళీ వర్క్ ఔట్స్ చేసుకోవడం లో పడిపోయాడు…

 

 

( రీడర్స్ ఫీలింగ్స్ : బాగుంది అని చెప్పి మళ్ళీ దాన్ని శిశిర మిద పోసి ఎందుకు ఇంకోటి తీసుకొని రమ్మన్నాడు….)

 

 

( రైటర్ ఆన్సర్ : ఎందుకు అంటే బాబు శిశిర నీ టార్చర్ చెయ్యాలి అని అనుకుంటున్నాడు కాబట్టి…)

 

 

శిశిర సైలెంట్ గా అక్కడ నుంచి రూం లోకి వెళ్లి,  ఫస్ట్ వాష్ రూం లోకి వెళ్లి……ఫ్రెష్ అయ్యి వచ్చి అప్పుడు కిచెన్ లోకి వెళ్లి మళ్ళీ మిల్క్ షేక్ రెడీ చేసి తీసుకొని వెళ్లి అవ్యూక్త్ కి ఇచ్చింది…..

 

 

” నేను ఎప్పుడూ తీసుకొని రమ్మని చెప్పాను….?

 

నువ్వు ఎప్పుడు తీసుకొని వచ్చావు…? “

 

అని కోపంగా శిశిర నీ గోడకు అదిమి పెట్టీ బుగ్గలు నొక్కుతూ ” ఇంకో సారి నేను చెప్పిన టైం కి చెప్పినవి తీసుకొని రాకపోతే పనిష్మెంట్ మామూలుగా ఉండవు ” అని చెప్పి …

 

 

 

ఆమెని లాక్కొని కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఫ్రిజ్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీసి , వాటిని ఒక బౌల్ లో వేసి……అందులో వాటర్ పోసి  , శిశిర మెడ వెనక నుంచి గొంతు దగ్గర పట్టుకుని ఆమె ఫేస్ నీ ఆ ఐస్ క్యూబ్స్ ఉన్న వాటర్ బౌల్ లో ముంచాడు…..

 

 

శిశిర గించుకుంటూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటుంది కానీ అవ్యూక్త్ మాత్రం తనని వదలకుండా ఇంకా తన మెడ నీ వాటర్ లో ముంచుతూ ఉంటాడు….

 

 

ఒక పది నిమిషాల తర్వాత ఆమె నీ వదిలి ఎర్రగా అయిపోయిన ఆమె ఫేస్ చూసి…….

 

 

” నేను హాస్టల్ లో ఉన్నప్పుడు కూడా ఇంతే….

ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపి , ఇలా కోల్డ్ వాటర్ తో బాత్ చెయ్యమని చెప్తే అప్పుడు నేను ఎంత ఏడ్చానో ,  ఎంత ఇబ్బంది పడ్డానో ఇప్పుడు నీకు అర్ధం అవుతుంది” అని చెప్పి…..

 

 

” ఒక్క అరగంట టైం ఇస్తున్నా……బ్రేక్ ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మిద ఉండాలి లేదు అంటె……” అని మాట ఫినిష్ చెయ్యకుండా ఒక్క చూపు శిశిర నీ చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు…

 

 

శిశిర ఏం మాట్లాడకుండా తన చీర కొంగుతో మొహం తుడుచుకుని టిఫిన్ ప్రిపేర్ చెయ్యడం స్టార్ట్ చేసింది….

 

 

అవ్యూక్త్ ఇచ్చిన టైం లోపు టిఫిన్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మిద పెట్టింది…..

 

 

అప్పటికి టైం ఉదయం 7 గంటలు కావస్తోంది……

 

 

అప్పుడే అవ్యూక్త్ వాళ్ళ తాత గారు రామకృష్ణ గారు ఆయన రూం నుంచి బయటికి వచ్చి శిశిర నీ చూస్తూ…” గుడ్ మార్నింగ్ మనవరాల ” అని నవ్వుతూ విష్ చేస్తారు.

 

 

ఆయన్ని చూసి శిశిర కూడా నవ్వుతూ ”  గుడ్ మార్నింగ్ తాత గారు ” అని విష్ చేసి…… కిచెన్ లోకి వెళ్లి వేడి వేడి కాఫీ తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చి,  ” అమ్మమ్మ గారు ఇంకా లేవ లేదా ” అని అడిగింది.

 

 

” మీ పెళ్లి పనులు హడావిడిలో పడి టాబ్లెట్స్ అవి సరిగ్గా వేసుకోలేదు……అందుకే కొంచం నీరసంగా ఉంది అని ఇంకా పడుకొని ఉంది…” అని చెప్పి..

 

 

” అవును నువ్వు ఎందుకు తల్లి ఈ పనులు అన్నీ చేస్తున్నావు…ఇంట్లో పని అమ్మాయి ఉంది కదా ” అని అడుగుతారు.

 

 

నాకు ఇలా ఇంటి పని చెయ్యడం , నా వాళ్ళకి అన్నీ దగ్గర ఉండి , నేనే నా చేతులతో చేసి పెట్టడం ఇష్టం…..

 

 

అందుకే పని మనిషి నీ ఇంటి పని మాత్రమే చూసుకోమని చెప్పి , వంట పని అంత నేనే చేస్తున్న తాత గారు అని చెప్పింది శిశిర.

 

 

అప్పుడే ”  శిశిర ఒకసారి ఇలా రా ” అనే అరుపు పైన ఉన్న రూం నుంచి వినపడింది….

 

 

To be continued…..