Ghost love 👻 – 1
అవ్యుక్త్ 💖 శిశిర
అందంగా అలంకరించిన ఫస్ట్ నైట్ బెడ్ మీద తెల్లని పట్టు పంచ , షర్ట్ వేసుకొని ఉన్న ఒక ఆరు అడుగుల అందగాడు బెడ్ కి చివరన కూర్చొని తన ఫ్రెండ్ తో కాల్ మాట్లాడుతూ ఉంటాడు….
కాల్ లో లైన్ లో ఉన్న అతని బెస్ట్ ఫ్రెండ్ ” రేయ్ బావ అక్కడ ఫస్ట్ నైట్ పెట్టుకొని నా చెల్లితో ముచ్చట్లు పెట్టుకోకుండా నాకు కాల్ చేసి సోది కబుర్లు అన్నీ చెప్తున్నాను ఎంటి రా……! “అని అడిగాడు..
” మీ చెల్లి ఇంకా రూం లోకి రాలేదు అందుకే నీకు కాల్ చేశా….” అని అంటాడు మన హీరో అవ్యుక్త్ .
” ఓ అవున ఇంకా ముహూర్తం టైం అయ్యి ఉండదు ఏమో , అందుకే రాలేదు ఏమో లే ” అని…..
మా చెల్లి నీ ఎక్కువ ఇబ్బంది పెట్టకు రా బావ…అసలే చాల సెన్సిటివ్ మా చెల్లి…..హ్యాండిల్ విత్ కేర్ ” అంటూ ఆటపటిస్తూ ఉంటాడు….
వాళ్ళు అలా కాల్ లో మాట్లాడుకుంటూ వుండగానే డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చింది మన హీరోయిన్ శిశిర.
అప్పటి వరకు కాల్ మాట్లాడుతూ నవ్వుతూ ఉన్న అవ్యుక్త్ డోర్ సౌండ్ కి అటు వైపు చూసి అలాగే బెడ్ మిద నుంచి లేచి నిలబడి శిశిర నా కింద నుంచి పైకి అలా చూస్తూ ఉంటాడు…
తెల్లని పాదాలకి ఎర్రటి గోరింటాకు పెట్టుకొని దానికి వెండి పట్టీలు పెట్టుకొని , పొడవాటి కాళి వెళ్ళకి మెట్టెలు పెట్టుకొని ఉంటే ఆ పాదం చూడడానికి చాల అందంగా కనిపిస్తుంది…
అలా పైకి వెళ్తే తెల్లని చీరకి టొమాటో ఎరుపు రంగు బోర్డర్ తో అక్కడ అక్కడ హ్యాండ్ మేడ్ ఎంబ్రాయిడరీ తో చాల అందంగా ఉన్న చీర నీ ఇంకా అందంగా బొడ్డు కిందకు కట్టుకొని ఉంటే…..
ఆ నడుము కి లెఫ్ట్ సైడ్ కొంచం పక్కకి బొట్టు బిళ్ళ సైజ్ అంత పుట్టు మచ్చ అందంగా కనిపిస్తూ ఉంటే అలా ఒక నిమిషం చూపు అక్కడ లాక్ అయిపోయింది అవ్యూక్త్ బాబు ది…
ఒక నిమిషం తర్వాత అలా పైకి వెళ్తూ గుండెల మీద అతను కట్టిన పసుపు తాడు మెరుస్తూ కనిపిస్తూ ఉంటే……
అలా ఇంకొంచం పైకి వెళ్లి శంఖం లాంటి మెడ కి సింపుల్ గా ఉన్న నెక్ పీస్ నీ చూసి , అలా ఇంకొంచం చూపు పైకి తీసుకొని వెళ్ళి ఊరిస్తూ ఉన్న ఎర్రటి పెదాలు దగ్గర అతని చూపుని నిలిపి అతనికి తెలియకుండానే అడుగులు ఆమె వైపు వేస్తూ వెళ్తూ….
చేతిలో ఉన్న ఫోన్ నీ కట్ చెయ్యకుండా అలాగే బెడ్ మిద విసిరి శిశిర నీ చూస్తూ నాలుగు అడుగుల్లో ఆమెని చేరి మెల్లిగా అతని చేతిని ఆమె బుజం చుట్టూ వేసి తనని బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు…
ఫోన్ లైన్ లో ఉన్న అవ్యూక్త్ ఫ్రెండ్ హలో….
హలో….. అంటూ ఉంటే ఏం సమాధానం రావడం లేదు ఎంటి అనుకుంటూ ఉండగా…..పట్టీల సౌండ్ లీలగా వినిపిస్తూ ఉండే సరికి అతనికి విషయం అర్ధం అయ్యి నవ్వుకొని కాల్ కట్ చేశాడు….
మన అవ్యూక్త్ బాబు శిశిర నీ బెడ్ దగ్గరికి తీసుకొని వచ్చి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకొని పక్కన పెట్టీ శిశిర నీ పట్టుకొని బెడ్ మిద కూర్చోబెట్టి తల దించుకొని ఉన్న ఆమెని చూస్తూ అతని చేతులలో ఆమె గడ్డం పట్టుకొని పైకి లేపి ” సిగ్గు పడుతున్నవా శిశిర ” అని అడిగాడు…
దానికి శిశిర ఏమి సమాధానం చెప్పకుండా కళ్ళు కిందకి వాల్చేస్తూ ఉంటే…..” నిన్ను ఇలా చూస్తూ ఉంటే అసలు ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండాలి అని అనిపించడం లేదు ” అంటూ ఆమె నీ అలాగే బెడ్ మిద పడుకోబెట్టి అతను ఆమె మీదకి ఒరిగిపోతూ శిశిర చెవి దగ్గరికి వెళ్లి ” స్టార్ట్ చేద్దామా డార్లింగ్ ” అని మెల్లిగా నోటితో ఆమె మెడ వంపుల్లో గాలి ఉదుతాడు…
అతను చేస్తున్న పనికి ఒళ్ళు అంతా జివ్వుమని అనిపిస్తూ ఉంటే కళ్ళు మూసుకొని తన చీర నీ పిడికిలి లో బిగించింది శిశిర….
అవ్యూక్త్ తన చేతితో శిశిర పవిట నీ పక్కకి తప్పించడానికి చెయ్యి పవిట మిద వేసి తన్మయత్వంతో కళ్ళు మూసుకొని ఉన్న శిశిర నీ ఒకసారి చూసి చేతిని పవిట దాక తీసుకొని వెళ్ళి, పవిట నీ తాకకుండా శిశిర చెంప నీ గట్టిగా లాగి పెట్టీ కొడతాడు…
అప్పటివరకు ఏదో మాయలో ఉన్న శిశిర అవ్యూక్త్ కొట్టిన చెంప దెబ్బకి షాక్ అయ్యి చెంప మిద చెయ్యి పెట్టుకొని తన మిద ఒరిగి ఉన్న అతన్ని కళ్ళ నిండా నీళ్ళతో చూస్తూ ఉంటుంది….
అవ్యూక్త్ కళ్ళు ఎర్రగా మారిపోయి , దవడ కండరాలు బిగించి విసుగ్గా శిశిర మిద నుంచి పైకి లేచి , ఆమె జబ్బ పట్టుకొని బెడ్ మిద నుంచి లాగినట్టు పైకి లేపి అక్కడే ఉన్న గోడకు ఆమె నీ అది పెట్టీ……
శిశిర బుగ్గలు రెండు ఒక్క చేతితో వత్తి పట్టుకొని కోపంగా ఆమె కళ్ళల్లోకి చూస్తు…..” నీ వల్ల పది సంవత్సరాలు నా ఫ్యామిలీ కి నేను దూరం అయ్యాను….
నీ వల్లే చిన్నప్పటి నుంచి నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న నా తాతయ్య మొదటి సారి నా మిద చెయ్యి చేసుకున్నారు….
నీ వళ్ళే చిన్నప్పుడు నా ఫ్రెండ్స్ కి , తాతయ్య , నానమ్మ కి నా వాళ్ళందరికీ దూరంగా అనధలా హాస్టల్ లో ఉండాల్సి వచ్చింది…
నీ వల్లే నా చైల్డ్ హుడ్ లైఫ్ అంతా ఏ సంతోషాలు , సరదాలు లేకుండా ఆ హాస్టల్ లో చెత్త ఫుడ్ తినలేక , నానమ్మ , తాతయ్య నీ చూడాలి అని ఉన్నా ఇంటికి రాలేక , నా ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఆడుకోలేక నరకం అనుభవించాను….
నీ వల్లే కేవలం నీ వల్లే……నా చైల్డ్ హుడ్ డేస్ అన్నీ స్వీట్ మెమోరర్స్ గా ఉండాల్సినవి….నాకు శాఢ్ మెమోరీస్ గా మిగిలిపోయాయి….
నన్ను నా ఫ్యామిలీ కి దూరం చేసిన నిన్ను వదిలి పెట్టాలి అనుకోలేదు….నన్ను నా ఫ్యామిలీ కి దూరం చేసి నువ్వు మాత్రం నీ ఫ్యామిలీ , ఫ్రెండ్స్ తో హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేసావ్ కదా…
ఇప్పటి నుంచి నీ లైఫ్ లో హాపీ డేస్ అనేవి లేకుండా చేస్తా….ప్రతి క్షణం నువ్వు నరకం అనుభవించేలా చెయ్యకపోతే నా పేరు అవ్యూక్త్ దేవ్ ఏ కాదు….అని కోపంగా చెప్పి విసురుగా శిశిర నీ అక్కడే ఉన్న వాష్ రొం లోకి తొసి బయట నుంచి లాక్ చేశాడు….
To be continued…..
అసలు ఈ అవ్యూక్త్ , శిశిర స్టోరీ ఎంటి….?
అవ్యూక్త్ నీ శిశిర ఎందుకు వాళ్ళ ఫ్యామిలీ కి దూరం చేసింది….?
Swipe left/right or tap the sides to turn pages