New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
Ghost love 👻 – 3
Ghost love 👻 4 min read

Ghost love 👻 – 3

అవ్యూక్త్ 💖 శిశిర

నాకు ఇలా ఇంటి పని చెయ్యడం , నా వాళ్ళకి అన్నీ దగ్గర ఉండి , నేనే నా చేతులతో చేసి పెట్టడం ఇష్టం…..

అందుకే పని మనిషి నీ ఇంటి పని మాత్రమే చూసుకోమని చెప్పి , వంట పని అంత నేనే చేస్తున్న తాత గారు అని చెప్పింది శిశిర.

అప్పుడే ”  శిశిర ఒకసారి ఇలా రా ” అనే అరుపు పైన ఉన్న రూం నుంచి వినపడింది….

రామ కృష్ణా గారితో మాట్లాడుతున్న శిశిర ఆ అరుపు విని కంగారుగా అక్కడ నుంచి పైకి వెళ్ళింది…

అక్కడ రూం లో బెడ్ మిద కూర్చొని అతని ఫ్రెండ్ తో మాట్లాడుతున్న అవి ( అవ్యూక్త్ ) నీ చూసి మెల్లిగా బెడ్ దగ్గరికి వెళ్లి అడుగు దూరం లో ఆగి పోయి అతన్నే చూస్తుంది ఎందుకు పిలిచాడు అని…

( అవ్యూక్త్ నీ అవి అని పిలుచుకుందాం )

అవి కాల్ మాట్లాడుతూనే తన కాళ్ళకి షూ వెయ్యమనట్టు అతని కాలు చూపిస్తే ఏం మాట్లాడకుండా షూ వేసి మళ్ళీ అతన్ని చూసింది.

అవి కాల్ కంటిన్యూ చేస్తూ మిర్రర్ దగ్గరికి వెళ్లి హెయిర్ సెట్ చేసుకుంటూ…. టై కట్టు అన్నట్టు బెడ్ మిద ఉన్న దాన్ని కళ్ళతో చూపిస్తే….

ఆ కల్ల భాషని అర్ధం చేసుకొని బెడ్ మిద టై తీసుకొని వెళ్ళి అతనికి కట్టడానికి ట్రై చేస్తుంది కానీ శిశిర పొట్టిగా ఉండడం వల్ల అవి మెడ అందక కుస్తీలు పడుతూ ఉంటుంది….

శిశిర కుస్తీలు పడడం చూసిన కొంచం కూడా రీయాక్టీ అవ్వకుండా ఇంకా కావాలి అని అతని తల నీ పైకి పెడ్తూ ఆమె నీ ఏడిపిస్తూ ఉంటాడు  అవి….

శిశిర కష్టపడి తన కాళ్ళని పైకి ఎత్తి , ముని వేళ్ళ మిద  నిలబడి ఎలాగో ఒకలా అవి కి టై కట్టడం ఫినిష్ చేసింది.

టై నీ దాన్ని కట్టిన శిశిర నా ఒకసారి చూసి కాల్ మాట్లాడుతూనే అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయాడు అవి.

శిశిర బెడ్ మిద ఉన్న ల్యాప్ టాప్ బ్యాగ్ పట్టుకొని అవి వెనకే కిందకి వెళ్ళింది.

అవి కిందకి వెళ్ళే సరికి రామ కృష్ణా గారు అక్కడే సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే అతను మాట్లాడుతున్న కాల్ కట్ చేసి ఆయనని విష్ చేసి….

ఒక్కడివే ఉన్నావు ఎంటి తాతయ్య….నానమ్మ ఎక్కడ….? ఇంకా నిద్ర లెవలేదా…? రోజు ఈ పాటికి నిద్ర లేచి ఇల్లు అంతా పొగతో నింపేసి పూజలు , పాటలు అంటూ హడావిడి చేసేది కదా…? అని అడుగుతాడు.

మీ పెళ్లి హడావిడిలో పడిలో సరిగ్గా టాబ్లెట్స్ వేసుకోలేదు రా అందుకే నీరసంగా ఉంది అని పడుకొని ఉంది ” అని చెప్పారు ….

అవునా అంటూ అక్కడ నుంచి వాళ్ళ నానమ్మ రూం దగ్గరికి వెళ్లి నిద్రపోతున్న ఆవిడ నీ చూసి డిస్ట్రబ్ చెయ్యడం ఇష్టం లేక మళ్ళీ వెనక్కి వచ్చి…..

” రా తాతయ్య బ్రేక్ ఫాస్ట్ చేద్దాం ” అని పిలుస్తాడు అవి.

నేను ఇప్పుడే కాఫీ తాగాను రా….కొంచం సేపు అయ్యాక చేస్తాను లే కానీ నువ్వు , నా మనవరాలు తినండి ” అని చెప్పి పక్షులకు మేత వెయ్యడానికి అని గార్డెన్ లోకి వెళ్తారు రామా కృష్ణ గారు…

( వాళ్ళ గార్డెన్ లో పక్షులు అవి ( పావురాళ్ళు ) పెంచుతూ ఉంటారు రామా కృష్ణ గారు )

ఆయన అలా బయటికి వెళ్ళగానే అవి  వెళ్లి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్ లో కూర్చుంటాడు…

ఎప్పటిలానే శిశిర ఏం మాట్లాడకుండా వెళ్లి అతనికి బ్రేక్ ఫాస్ట్ వడ్డించి పక్కన నిలబడింది.

ఒకసారి శిశిర నీ చూసి ఏం మాట్లాడకుండా బ్రేక్ ఫాస్ట్ చేసి అప్పటికే లేట్ అవుతుంది అని త్వరగా ఆఫీసు కి వెళ్ళాలి అని కార్ లో ఆఫీసు కి వెళ్ళిపోతాడు అవి.

అవి ఒక స్టార్ట్ అప్ కంపెనీ స్టార్ట్ చేసాడు….అది మంచి గ్రోత్ లో కూడా ఉంది సో దాన్ని మెల్లిగా పెద్ద కంపెనీ గా రిమోడల్ చెయ్యాలి అని ట్రై చేస్తున్నాడు…

అలాగే ఒక షాపింగ్ మల్ అండ్ సినిమా థియేటర్ కూడా ఉంది వాళ్ళకి…

ప్రజెంట్ షాపింగ్ మాల్ మళ్ళీ రి మోడలింగ్ పని చెపిస్తున్నాడు…

ఇటు బిజినెస్ చూసుకుంటూ అటు , కంపెనీ నీ డెవలప్ చేసే పనిలో ఫుల్ బిజీ గా ఉన్నాడు అవి.

ఇంటి దగ్గర స్టార్ట్ అయినా కార్ డైరెక్ట్ గా ఆఫీసు ముందు ఆగింది..

.ఆఫీసు లోకి వెళ్లి తన చైర్ లో కూర్చోగానే అవి పి ఏ వచ్చి అతని షెడ్యూల్డు చెప్పి వెళ్తాడు…

అవి ఇంకా తన వర్క్ స్టార్ట్ చేసి కరెక్ట్ గా 11 కి మీటింగ్ ఉండడంతో అక్కడ మీటింగ్ హల్ లో దానికి అటెండ్ అయ్యి వాళ్ళ స్టార్ట్ అప్ కంపెనీ నీ ఇంకా ఎలా ఇంప్రైవ్ చెయ్యాలి ,  సొసైటీ లో వాళ్ళ కంపెనీ కి ఎలా గుడ్ విల్ నీ తెచ్చుకోవాలి అనే పాయింట్స్ మీద డిస్కస్ చేసి కరెక్ట్ గా లంచ్ టైం కి మీటింగ్ క్లోజ్ చేసి అతని ఛాంబర్ కి వెళ్ళిపోతాడు…

అవి మీటింగ్ కి వెళ్ళేటప్పుడు  తననే స్వయంగా లంచ్ తీసుకొని కంపెనీ కి రమ్మని శిశిర కి మెసేజ్ చేశాడు….

అతను చెప్పినట్టే శిశిర నే స్వయంగా లంచ్ ప్రిపేర్ చేసి ఆఫీసు కి తీసుకొని వెళ్ళింది.

అవి అతని ఛాంబర్ కి వెళ్ళే సరికి అక్కడ శిశిర క్యారేజ్ తో రెడీ గా ఉంటుంది.

తనని అక్కడ అలా చూసి ఈవిల్ స్మైల్ ఒకటి ఇచ్చి వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు అవి.

శిశిర తనతో తెచ్చిన ప్లేట్ తీసి దాంట్లో అన్నం , పప్పు , పచ్చడి , ఆలు ఫ్రై వేసి ప్లేట్ అతనికి ఇచ్చింది.

అవి ఆ ప్లేట్ తీసుకొని దాంట్లో ఉన్నవి చూస్తూ….అతని ఫోన్ నుంచి ప్యూన్ కి కాల్ చేసి క్యాంటీన్ నుంచి ఉప్పు , కారం , పంచదార తీసుకొని రమ్మని చెప్పి కాల్ కట్ చేసి….

అతడినే అయోమయంగా చూస్తూ ఉన్న శిశిర నీ చూస్తూ ” ఎంటి బంగారం నన్ను అలా చూస్తున్నావ్…? ఇప్పుడు క్యాంటీన్ నుంచి అవి ఎందుకు తెప్పిస్తున్నాను అనా…?

నువ్వే చూస్తావు గా జస్ట్ వెయిట్ ఫర్ ఫైవ్ మినిట్స్….” అని చెప్పి ప్యూన్ తెచ్చే వాటి కోసం వేవుట్ చేస్తూ ఉంటాడు….

అసలు అవి ఉప్పు , కారం , పంచదార తో ఇప్పుడు ఏం చెయ్యబోతున్నాడు….?

నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం….

To be continued….