హెల్ప్ చేశాడని క్లోజ్ గా ఉంటే వరుణ్ ను వదిలేయమని చెప్తాడా ఛా ………. !! అందుకే అన్ నోన్ పర్సన్స్ తో మాట్లాడకూడదు అని మమ్మీ చెప్తూనే ఉంటుంది……… !! ఎదో హెల్ప్ చేశాడు పైగా వరుణ్ అనవసరంగా కొట్టాడు అన్న గిల్టీ తో నేనే ఆకాష్ తో మాట్లాడాను………. !! అదెంత తప్పో ఇప్పుడే తెలిసింది అరే నా మీద తన పెత్తనం ఎంటి ………. ?? పైగా నేను వరుణ్ తో హ్యాపీగా లేనట నాకు మంచి లైఫ్ ఉండాలంటే వరుణ్ కి దూరంగా ఉండాలట ……….. !! ఈ విషయం గురించి వరుణ్ కు తెలిస్తే ఇంకేం అయినా ఉందా ……… ?? ఇంకెప్పుడు ఆకాష్ తో మాట్లాడను అంటూ కోపంగా మొబైల్ లో ఉన్న ఆకాష్ నంబర్ ను బ్లాక్ చేసి నంబర్ కూడా డిలీట్ చేసి ……….. !! తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుని గట్టిగా ఊపిరి వదిలి మధన్ రూమ్ లోకి వెళ్తుంది ………. !!
రూమ్ లోకి వెళ్ళిన వర్ష కి సోఫా లో కూర్చుని మొబైల్ చూస్తున్న గోకుల్ కనిపించడం తో లేని నవ్వు తెచ్చుకుంటూ ……….. !! అన్నయ్య అప్పుడే వచ్చేశావా మమ్మీ డాడీ లను ఇంటి దగ్గర డ్రాప్ చేసావా……… ?? అంటూ గోకుల్ కోసం పక్కన పెట్టిన లంచ్ ప్లేట్ లోకి సర్వ్ చేస్తు అడుగుతుంది ………… !!