New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
The Devil’s promise 😈 – 2

The Devil’s promise 😈 – 2

 

 

 

 

ప్లీజ్ అండి నన్ను వదిలేయండి మీకు దండం పెడతాను అంటూ ఏడుస్తూ చేతులు జోడించి వేడుకుంటూ ఉంటే వాడు ఆ అమ్మాయి ఏడుపు కనీసం చూడకుండా అతనికి అభిముఖంగా తిరిగిన ఆ అమ్మాయి పర్వాల వైపు చూస్తూ అబ్బా ఏం పెంచావే నాకోసమే ఇంత పెంచావా ఒక్కసారి గదిలోకి రావచ్చు కదా మా అక్క తో మాట్లాడి నీకు ఈ పనులేమీ లేకుండా చేస్తాను నిన్ను మహారాణిలా నా పక్కనే పెట్టుకుంటా అంటూ మాట్లాడుతూ ఉంటే అతని మాటలకి అసహ్యం కలుగుతూ ఉంటే భయంగా అతని వైపు చూస్తూ ఉంది 

 

ఇంతలో వాళ్ళ అక్క అక్కడికి రావడం గమనించిన వాడు ఇప్పుడు కాదు రాత్రికి చెప్తా నీ పని అని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతే ఆ అమ్మాయి అక్కడే నేలకి ఒరిగిపోయి ఏడుస్తూ కూర్చుంది 

 

ఇంతలో అక్కడికి వచ్చిన తన పిన్ని సులోచన ఆ అమ్మాయి వైపు చూస్తూ ఒసేయ్ నందన ఇంకా పనిచేయకుండా కూర్చుని ఏం చేస్తున్నావే ముందు లేచి నా తమ్ముడికి కాఫీ ఇచ్చిరా అంది సులోచన 

 

పిన్ని నేను మావయ్య దగ్గరికి వెళ్ళలేను ప్లీజ్ పిన్ని అన్ని పనులు నేనే చేసేస్తాను మావయ్యకి కాఫీ ఒకటి నువ్వు ఇవ్వవా అంటూ నందన ఏడుపు గొంతుతో అడగడంతో 

 

ఏంటమ్మా ఇంట్లో పనులన్నీ నువ్వే చేసేస్తావా ఏ ఊరికే కూర్చోబెట్టి తిండి పెట్టడానికి నువ్వేమైనా మహారాణివి అనుకుంటున్నావా 

 

మూసుకొని వెళ్లి ఇవ్వవే దానికంటే ముందు నాకు టిఫిన్ పెట్టు మీ అమ్మ బాబులు ఇద్దరు నిన్ను నామీదకి వదిలేసి పోయారు ఏదో మీ నాన్నని రెండో పెళ్లి చేసుకొని సుఖ పెడదాం అనుకుంటే పెళ్లి చేసుకున్న ఆరు సంవత్సరాలకి ఆడు పోయాడు నిన్ను కూర్చోబెట్టి మేపడానికి వాళ్లేవీ నాకు మూటలు మూటలు అప్ప చెప్పలేదు అంటూ సులోచన దెప్పి పొడుస్తూ మాట్లాడడంతో ఇక చేసేదేం లేక టిఫిన్ ప్రిపేర్ చేసి ఆమెకి టిఫిన్ వడ్డించి ఆ తర్వాత అక్కడి నుంచి కాఫీ పట్టుకొని వాడి దగ్గరికి భయంగానే వెళ్ళింది 

 

రూమ్ దగ్గర నుంచి నందన రావడం చూసిన ఆ దరిద్రుడు లోపలికి వెళ్లి మంచం మీద కూర్చొని సైలెంట్ గా ఫోన్ చూస్తు ఉన్నాడు 

 

నందన డోర్ బయటే ఆగిపోయి మావయ్య కాఫీ అంది భయంతో 

 

ఏంటి నేను ఇక్కడున్నాను నా చెయ్యి అంతవరకు రాదు కదా వచ్చి ఇవ్వు అన్నాడు వాడు 

 

అలాగే మామయ్య అని తప్పక రూమ్ లోకి వెళ్లి మంచం దగ్గరికి వెళ్లి కాఫీ ఇచ్చింది 

 

వాడు కాఫీ పక్కనే టేబుల్ మీద పెడుతూ నందన చెయ్యి పట్టుకుని బలవంతంగా తనని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు  

 

చూడు నందన నేను ఏం చూస్తున్నానో తెలుసా అంటూ ఆమె మొహాన్ని పట్టుకొని వాడు చూస్తున్న దాన్ని చూపిస్తూ ఉన్నాడు 

 

అందులో వాడు అప్పటికే బూతు వీడియోలు చూస్తూ ఉండడంతో అది చూసిన నందనాకి ఒక్కసారిగా ఒళ్లంతా అసహ్యం పుట్టింది 

 

వదులు మావయ్య అంది నందన 

 

వాళ్ళు ఎలా చేస్తున్నారు చూడు, మనం కూడా అలాగే చేద్దాం బాగుంటుంది నీకు అస్సలు నొప్పి తెలియకుండా చేస్తాను కానీ నువ్వు మాత్రం ఇంకా ఇలాగే నాటకాలు ఆడితే నేను బలవంతంగా అయినా దక్కించుకోవడానికి వెనకాడను అన్నాడు వాడు 

 

ఆ మాటకి భయంగా వాడి వైపు చూస్తూ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చూసింది కానీ వాడు ఒక చేత్తో నందన నడుముని గట్టిగా పట్టుకొని నలిపేస్తూ ఉంటే భయంగా చూస్తూ ఉంది నందన వాడి వైపు 

 

వాడు అక్కడితో ఆగకుండా ఆమె కట్టుకున్న ఓని మీద చెయ్యి వేస్తూ ఉంటే నందన కి ఏం చేయాలో తెలియక లాగి పెట్టి వాడిని కొట్టింది 

 

అంతే ఒక్కసారిగా తనని వదిలి దూరం జరిగిన వాడు ఏంటి ఏదో బావుంటావు కదా అని నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బాగా చూసుకుందాం అనుకుంటే నన్నే కొడతావా 

 

అంటూ అక్కడే హ్యాంగర్ కి ఉన్న వాడి బెల్ట్ తీసుకుని ఇష్టం వచ్చినట్టు కొట్టడం మొదలుపెట్టాడు 

 

వాడు కొడుతూ ఉంటే ఆ నొప్పి భరించలేక గట్టిగా అరుస్తుంది నందన 

 

ఆరుపులకి అక్కడికి వచ్చింది సులోచన 

 

ఏమైందిరా ఎందుకు దాన్ని కొడుతున్నావ్ అడిగింది సులోచన తమ్ముడి వైపు చూస్తూ 

 

చూడక్క దీనికి ఒళ్ళంతా పొగరే ఎలా ఉందో చూడు నన్నే కొట్టింది ఇది అన్నాడు వాడు నందన వైపు కోపంగా చూస్తూ 

 

ఏమి ముద నష్టపు దాన నీకు తిండి పెట్టి ఇంట్లో ఉండనివ్వడమే గొప్ప మళ్ళీ నువ్వు నా తమ్ముడిని కొడతావా నీకెంత ధైర్యమే అంటూ సులోచన కూడా వచ్చి ఆచంప ఈ చెంప వాయించేసింది 

 

లేదు పిన్ని మావయ్య నాతో అంటున్నావ్ నందన మాటలు అసలు ఏమాత్రం పట్టించుకోకుండా 

 

వాడు నీకు కాబోయే మొగుడు ఏదో అచ్చట ముచ్చట తీర్చుకోవాలి అనుకుంటే వాడికి సహకరించాల్సింది పోయి ఇలాగే ప్రవర్తిస్తావా నువ్వు అంటూ సీరియస్గా అడుగుతూ ఇంకొక వారం రోజుల్లో మీ ఇద్దరికీ పెళ్లి అప్పుడు ఇదేం పీకుతుందో నేను కూడా చూస్తాను నువ్వు వెళ్లి పెళ్లికి ఏర్పాట్లు చూడరా అని సులోచన తమ్ముడికి చెప్పడంతో వాడు క్రూరంగా నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు 

 

సులోచన కూడా నందన నీ అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతే నందన అక్కడి నుంచి బయటికి వచ్చి దగ్గర ఉన్న తన అమ్మానాన్నల ఫోటో తీసుకుని ఎందుకు నాన్న ఎందుకమ్మా మీరిద్దరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు మీరు ఉండుంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో విల్ల టార్చర్ భరించకండి చచ్చిపోవడమే మంచిది అనిపిస్తుంది అనుకుంటూ ఏడుస్తూ ఉంది నందన 

 

 

 

——–continues…………..

 

 

 

 

ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ఆన్ ది స్టోరీ