New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
రావణ్ చెరలో సీత – 2

రావణ్ చెరలో సీత – 2

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

వైష్ణవి ని హెలికాప్టర్ లో ఎక్కించుకుని రావణ్ నేరుగా శ్రీలంకకి తీసుకెళ్తాడు 

 

 

హెలికాప్టర్ లో  తను అరవకుండా నోటికి ప్లాస్టర్ వేసి, చేతికి హ్యాండ్ కఫ్స్ వేసి తనతో పాటు శ్రీలంకకి తీసుకెళ్ళి పోయాడు

 

 

హెలికాప్టర్ శ్రీలంక బోర్డర్ లోకి ఎంటర్ అవ్వడమే శ్రీలంక గవర్నమెంట్ రావణ్ వెనుక ఎవరైనా వస్తున్నారేమో అని మిస్సైల్స్ ని సిద్దం చేసుకొని మరి చూస్తుంది 

 

 

వైష్ణవి ఆ ప్రదేశాన్ని చూడడం మొదటి సారి కావడంతో అక్కడ ప్రకృతి ఆమెకు కొంచెం అందమైన అనుభూతిని కలిగించింది కానీ ఆమె ఉన్న పరిస్థితికి అవేం పట్టించుకునే స్థితిలో లేదు 

 

 

రావణ్ ఇల్లు రావడంతో హెలికాప్టర్ కిందకి దిగబోతుంటే అప్పుడు కిందకి చూస్తుంది, ఇంద్ర భవనం కూడా సరిపోదు అనేంత పెద్ద ఇంటిని చూసి కన్ను ఆర్పలేకపోయింది 

 

 

హెలికాప్టర్ నేరుగా అతని ఇంటి ఎదురుగా ఆగింది, రావణ్ హెలికాప్టర్ డోర్ తెరిచి తనతో పాటు ఆమెను కూడా కిందకి దించాడు 

 

 

ఆమె కళ్ళు ఇంకాస్త పెద్దవి అయ్యాయి, ఎందుకంటే దాదాపుగా మూడు వందల మంది చేతిలో గన్స్ పట్టుకుని అతనికి ‘ వెల్కమ్ భాయ్ ‘ అని విష్ చేసారు 

 

 

రావణ్ ఆమె నోటికి ఉన్న ప్లాస్టర్, చేతికి ఉన్న హ్యాండ్ కఫ్స్ తీసేసి తనతో పాటు ముందుకు తీసుకెళ్తాడు 

 

 

రావణ్ వైష్ణవి చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్తుంటే వాళ్ళు అందరూ కూడా గన్స్ తో పైకి కాలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు 

 

 

 

ఆ సౌండ్ కే ఆమె చెవులు పోయేలా ఉన్నాయి , వెంటనే రెండు చెవులు మూసుకుని ముందుకు కదలకుండా అక్కడే నిలబడి ఉంది 

 

 

రావణ్ ఆమె దగ్గరకు వెళ్ళి మెల్లగా ఆమె తలను పైకి లేపి ఎలాంటి భావం లేకుండా ‘ భయం వేసిందా ? ‘ అని అడుగుతాడు 

 

 

ఆమె అవును అన్నట్టుగా తల ఊపుతుంది , నార్మల్ గా ఉన్న ఫేస్ కాస్త కోపంగా మారిపోయింది, వెంటనే తన వీపు వెనక ఉన్న గన్ తీసుకుని ‘ ఎవరెవరు అయితే గన్స్ కాల్చారో వాళ్ళందరిని షూట్ చేసుకుంటూ పోతున్నాడు ‘ 

 

 

రక్తం చూస్తేనే భయపడే వైష్ణవి ఇప్పుడు ఏకంగా తన ముందే అంతమందిని ఏ కారణం లేకుండా షూట్ చేస్తుంటే తను ఇంకా భయపడుతూ రావణ్ చేతులు పట్టుకుని ‘ ప్లీజ్ ఆపండి ‘ అని కళ్ళ నీళ్ళతో అడుగుతుంది 

 

 

రావణ్ కొంచెం నార్మల్ అయ్యి తన చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాలి అని చూస్తుంటే తను భయంతో కదలకుండా అలాగే నిలబడి ఉంది 

 

 

రావణ్ తన చెయ్యి పట్టుకొని కొంచెం లాగాడు‌ ముందుకు కదులుతుందేమో అని …. కానీ ఆమెకు అతన్ని చూస్తుంటేనే భయం టన్నుల్లో పుట్టుకు వస్తుంది , కదలకుండా భయంతో అలాగే నిలబడి ఉంది 

 

 

రావణ్ ఊపిరి కొంచెం గట్టిగా పీల్చుకుని ” రావా ? ” అని అడిగాడు 

 

 

అతనే అనుకుంటే అతని గొంతు ఇంకాస్త భయం పెంచుతుంది , తను భయపడుతూనే ‘ నేను రాను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది 

 

 

రావణ్ మెల్లగా ‘ ఓకే ‘ అని చెప్పి మరోసారి గన్ తీసుకుని మిగిలిన వాళ్ళని కూడా షూట్ చేయడం మొదలుపెట్టాడు 

 

 

వైష్ణవి భయంతో ‘ ప్లీజ్ ఆపండి ‘ అని అంటున్న కూడా రావణ్ వినకుండా కనబడిన వాళ్ళని షూట్ చేసుకుంటూ పోతున్నాడు 

 

 

వైష్ణవి కింద పడి రావణ్ కాళ్ళు పట్టుకుని ‘ ప్లీజ్ ఆపండి ‘ అని మొత్తుకుంటుంది 

 

 

రావణ్ ఆపేసి గన్ నుండి వస్తున్న పొగని స్టైల్ గా ఉఫ్ అని ఊది తన కాళ్ళ దగ్గర ఉన్న వైష్ణవి ని ఒక చేత్తో ఫోర్స్ గా పైకి లేపి, ఆమె కళ్ళల్లోకి కోపంగా చూస్తూ ‘ ఇది నీ బాబు ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టు ఉండడానికి , ఈ రావణ్ ఇల్లు….. ఇక్కడ అంతా నేను చెప్పినట్టే జరగాలి , లేదంటే నీ నోటి నుంచి వచ్చే ఒక్కో మాటకు ఒక మనిషిని చంపి నీ పెళ్ళికి వచ్చిన అందరినీ శవాలుగా మార్చి నీ ఎదురుగానే కుప్పలు పోసినట్టు పోస్తాను  , రావణ్ మాటకు ఎదురు చెప్పడం అంటే శవాల్ని లెక్కపెట్టుకోవడమే, మైండ్ ఇట్ ‘ అని చెప్పి తన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తాడు 

 

 

వెళ్తూ వెళ్తూ వాళ్ళందరినీ హాస్పిటల్ లో పడేయండి అని ఆర్డర్ వేసి తనని తీసుకుని లోపలికి వెళ్తాడు 

 

 

రావణ్ లోపలికి రావడమే ఏభై మంది దాకా వంట వాళ్ళు, పనివాళ్ళు అందరూ వచ్చి అతని ఎదురుగా తల దించుకుని నిలబడతారు 

 

 

రావణ్ వాళ్ళని చూసి వాళ్ళందరి మధ్యలో ఉన్న ఒకే ఒక్క ఆడమనిషిని ” రంగమ్మ ” అని పిలుస్తాడు 

 

 

రంగమ్మ వెంటనే వెనుక నుంచి ముందుకు వచ్చి ‘ చెప్పండి బాబు ‘ అని ఎంతో భయంగా అంటుంది 

 

 

రంగమ్మ రాగానే ‘ ఈ అమ్మాయికి తన గదిని చూపించు ‘ అని వైష్ణవిని ఆవిడ దగ్గరకు తోసేసి అతను మెట్లు ఎక్కి తన రూంకి వెళ్ళిపోతున్నాడు 

 

 

రంగమ్మ వైష్ణవి చెయ్యి పట్టుకొని ‘ రామ్మా ! నీ గదిని చూపిస్తాను ‘ అని తనని తీసుకెళ్తుంటే మరోసారి ” రంగమ్మ ” అనే పిలుపు వచ్చి ఇద్దరు ఆగిపోయి పైకి చూస్తారు 

 

 

రావణ్ పైన నిలబడి సీరియస్ గా ‘ ఆ అమ్మాయి ఇక్కడ ఉన్నన్ని రోజులు నీదే బాధ్యత ! ఇక్కడ ఎలా ఉండాలో , ఎలా బ్రతకాలో నేర్పించు ఆమెకి ….. అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పు , ఈ విషయం లో ఏ చిన్న తేడా జరిగినా సరే ” ఆ అమ్మాయికి ఆమె కుటుంబం ఉండదు …… నీ కుటుంబానికి నువ్వు ఉండవు , జాగ్రత్త‌ “ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోతాడు 

 

 

అతను ఇచ్చిన వార్నింగ్ కి ఇద్దరూ కూడా భయపడి సైలెంట్ గా ముందుకు వెళ్ళిపోయారు 

 

 

వైష్ణవి చుట్టూ చూసి ఆవిడని పట్టుకుని ‘ ఏవండి, అసలు ఎవరు మీరు అంతా ? కాసేపట్లో పెళ్లి చేసుకోబోయే నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు ?….. అని ఇంకా అడగబోతుంటే రంగమ్మ వెంటనే ఆమె నోరు మూసేసి ‘ ఇక్కడ ఏం మాట్లాడకు , నీ గదిలోకి వెళ్ళాక ఏదైనా మాట్లాడు ‘ అని చిన్నగా చెప్పి తనను ఆమె గదికి తీసుకెళ్తుంది 

 

 

 

రంగమ్మ రూమ్ దగ్గరికి తీసుకెళ్ళి డోర్ తీసి ఆమెతో పాటు ఆవిడ కూడా లోపలికి వెళ్లి ఎవరూ చూడకుండా వెంటనే డోర్ లాక్ చేసేస్తుంది 

 

 

లోపలికి వెళ్ళాక వైష్ణవి తన మనసులోని బాధ అంతా బయట పెడుతుంది అనుకుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేసరికి రంగమ్మ కూడా గదిని చూస్తుంది 

 

 

రూమ్ అంతా నీట్ గానే ఉంది కానీ కొన్ని బట్టలు మంచం మీద‌ అలాగే మరికొన్ని బట్టలు బాల్కనీలో వైర్ మీద , ఇంకొన్ని పక్కనే ఉన్న వాషింగ్ మెషిన్ మీద ఉన్నాయి 

 

 

రంగమ్మ వాటిని చూసి ‘ ఏంటి ఈ రూమ్ లో బట్టలు ఇలా పడేసి ఉన్నాయి అని వాటిని ఫోల్డ్ చేయడానికి పట్టుకోబోతుంటే వైష్ణవి పెద్దగా ” ఆగండి ‘ అని అరుస్తుంది 

 

 

తన నుంచి అలాంటి అరుపు ఊహించని రంగమ్మ మంచం మీద పడుతుంది 

 

 

వైష్ణవి ఆ గది అంతా కూడా ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తుంది 

 

 

రంగమ్మ లేచి ‘ ఏమైంది అమ్మాయి? ఎందుకు అలా అరిచావు ? ‘  అని అడుగుతుంది 

 

 

వైష్ణవి ఆ గది అంతా చూస్తూ ‘ ఇది నా రూమ్ ‘ అని అంటుంది 

 

 

రంగమ్మకి ఏం అర్థం కాక ‘ ఇది మీ రూమ్ ఏంటి అమ్మాయి ? ‘ అని అంటుంది 

 

 

వైష్ణవి ఆవేశంగా ‘ ఇది నా రూమ్ అంటే సేమ్ మా ఇంట్లో నా రూమ్ ని నేను లాస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఉంది ‘ 

 

 

రంగమ్మకి అప్పుడు అర్థం అవుతుంది వైష్ణవి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఎందుకు ఉందా అని ? 

 

 

రంగమ్మ ‘ కానీ అదెలా సాధ్యం అమ్మాయి?  ఎక్కడో ఇండియా హైదరాబాద్ లో ఉన్న నీ రూమ్ …ఇక్కడ శ్రీలంక రావణ్ బాబు ఇంట్లో ఉన్న రూమ్ ఒకేలా ఎలా ఉంటాయి ? 

 

 

వైష్ణవి ‘ ఏది….‌ మళ్ళీ అనండి ఒకసారి? ‘ 

 

 

రంగమ్మ ‘ ఏంటిది అమ్మాయి? ‘ 

 

 

వైష్ణవి ‘ ఇప్పుడేదో అన్నారు కదా ! అదే మళ్ళీ ఒకసారి చెప్పండి ‘ 

 

 

రంగమ్మ ‘ నేనేమన్నాను ? అదెలా సాధ్యం అని అన్నాను ! అంతేగా‌ ‘ 

 

 

వైష్ణవి ‘ దాని తర్వాత ఇంకోటి అన్నారు కదా , అది చెప్పండి ‘ 

 

 

రంగమ్మ ‘ ఎక్కడో ఇండియా హైదరాబాద్ లో ఉన్న మీ రూమ్ … ఇక్కడ శ్రీలంక రావణ్ బాబు ఇంట్లో ఉన్న రూమ్ ఒకేలా ఎలా ఉంటాయి అని అన్నాను ‘ 

 

 

వైష్ణవి షాక్ అవుతూ ‘ అంటే ఇప్పుడు ఇది శ్రీలంకనా ? నేను ఇప్పుడు ఇండియాలో లేనా‌? ‘ 

 

 

రంగమ్మ  ‘” ఇది‌ ఇండియా కాదు అమ్మాయి , శ్రీలంక ! నిన్ను తీసుకొచ్చిన మనిషి ఈ లంక మొత్తానికి రెండవ రావణాసురుడు  ” 

 

 

వైష్ణవి కొంచెం భయంగా ‘ అంటే ఇక్కడ రామ మందిరాలు ఏం ఉండ…….అని పూర్తిగా అడగక ముందే రంగమ్మ వైష్ణవి నోరు మూసేసి తన దగ్గరకు వచ్చి మెల్లగా ‘ నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం ఆ రాముడి గురించి మాట్లాడడం కానీ , కనీసం ఆయన పేరుని కూడా నువ్వు ఇక్కడ పలుకకూడదు ‘ 

 

 

వైష్ణవి భయంతో ” ఎందుకని ? ” 

 

 

రంగమ్మ ‘ ఈ రావణ్ బాబు పూజించేది ఆ పది తలల రావణాసురుడిని , అతను ఒక్కడే కాదు ఈ శ్రీలంకలో చాలా మంది పూజించేది రావణుడినే , ఇక్కడ ఉన్న అందరికీ మరి ముఖ్యంగా రావణ్ బాబుకి ఆ రాముడు అంటే అసలు ఇష్టం లేదు, ఆయన పేరు వినబడిన చాలు …. ఆ ఊరు మొత్తాన్ని స్మశానంలా‌ మార్చేస్తాడు , నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఆ పేరు కూడా ఎత్తకు ‘ 

 

 

అతని గురించి వింటుంటే భయం వేస్తుంది కానీ చిన్నప్పటినుండి తను ఎంతో భక్తితో పూజిస్తున్న రాముడి పేరు కూడా ఇక్కడ ఎత్తకూడదు అనేసరికి కోపం తన్నుకొచ్చేసింది 

 

 

వైష్ణవి కోపంగా ‘ నాకు ఒక సహాయం చేస్తావా ఆంటీ ? ‘ 

 

రంగమ్మ ‘ చెప్పమ్మా ! ‘ 

 

 

వైష్ణవి కోపంగా ” పూజ చేయడానికి నాకు ఒక గంట,  అలాగే హారతి పళ్ళెం , కర్పూరం ఒకటి తీసుకురాగలరా ? “

 

 

ఇంకా ఉంది………

 

 

మిస్టేక్స్ ఏమైనా ఉంటే మన్నించండి…

 

 

స్టోరీ బాగుంది అనిపిస్తే కొంచెం నన్ను కూడా సపోర్ట్ చెయ్యండి , బాలేదు అనుకుంటే ఇగ్నోర్ చేసేయండి….

 

 

ఎలా అనిపించిందో కామెంట్స్ పెట్టండి…

 

నెక్ట్స్ అప్డేట్ లో కలుద్దాం